డబ్బులు ఎవరికి ఊరికే రావు, ప్రాణాలు పోతే మళ్ళీ రావు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మల్లేష్

Submitted by BikshaReddy on Wed, 10/07/2024 - 14:40
Traffic awareness

 

 

డబ్బులు ఎవరికి ఊరికే రావు, ప్రాణాలు పోతే మళ్ళీ రావు

ఈరోజు మల్కాజ్ గిరి ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో * సెఫిల్గూడలో నాగేంద్ర స్కూల్ లో, ట్రాఫిక్ మరియు రోడ్డు భద్రత నియమాలపై మరియు ఎన్విరాన్మెంట్ పై షేర్ అమ్బరిల్లా ఆర్గనైజేషన్ వారు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. 

ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మల్లేష్  మాట్లాడుతూ విద్యార్థులందరికీ నిర్ణీత వయసు వచ్చాక, లైసెన్సు పొందిన తర్వాత మాత్రమే వాహనాలు నడపమని సూచించడం జరిగింది*. 

 మైనర్లు వాహనం నడిపితే వారి ప్రాణాలకే కాక ఇతరుల ప్రాణాలకు కూడా ప్రమాదమని, మైనర్లు వాహనం నడిపి పట్టుపడితే వారితోపాటు వాహన యజమాని పై కూడా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని* తెలియజేయడం జరిగింది.

అంతేకాకుండా ట్రిపుల్ రైడింగ్, మొబైల్ డ్రైవింగ్, ఆపోజిట్ డ్రైవింగ్, స్పీడ్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవింగ్ మొదలగు ట్రాఫిక్ ఉల్లంఘనల గురించి వాటి వల్ల కలిగే దుష్ఫలితాల గురించి వివరించడం జరిగింది. అలాగే రోడ్డుపైన నడిచేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, *జీబ్రా క్రాసింగ్ లైన్స్, ట్రాఫిక్ సిగ్నల్స్ గురించి, ట్రాఫిక్ సైనేజస్ గురించి వారికి వివరించడం జరిగింది.

విద్యార్థులు స్కూల్ బస్సు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు పూర్తి ఆగిన తర్వాతనే చేయాలని, బస్సులో ప్రయాణించేటప్పుడు చేతులు, తల కిటికీ అద్దాల బయట పెట్టవద్దు అని, బస్సు ముందు నుండి కానీ, వెనక నుండి కానీ డాటేటపుడు దూరంగా వెళ్లి దాటలని, చిన్న పిల్లలను బస్సు వద్దకు రాకుండా చూడాలని చెప్పారు.

మొబైల్ ఫోన్లకి స్క్రీన్ గార్డ్లు, పౌచులు వాడే వాహనదారులు తలకు హెల్మెట్ ధరించకపోవడం ఎంత తప్పో తెలియజేయడం జరిగింది*. *ఫోర్ వీలర్ నడిపేవారు సీడ్ బెల్ట్ తప్పక ధరించాలని* వాహనాలను ఎప్పటికప్పుడు కండిషన్లో ఉంచుకోవాలని తెలిపాము. *మానవుల తలను కోడిగుడ్డు, పుచ్చకాయలతో పోల్చి అవి రోడ్డుపై పడితే ఎలా పగిలిపోతాయి అలానే తలకు గాయమైన కూడా విలువైన ప్రాణాలు కోల్పోవడం జరుగుతుందని విద్యార్థులకు వివరించడం జరిగింది.

వినాయకునికి ఒక తలపోతే ఆ పరమేశ్వరుడు మరోతలను ప్రసాదించాడు కానీ మానవులైన మనకు తల పగిలితే మనకి ఎవరు మరోతలను ప్రసాదిస్తారని జీవితం అర్ధాంతరంగా ముగుస్తుందని తెలియజేయడం జరిగింది.

మొబైల్ డ్రైవింగ్ చేసేవారి ఫోన్ కాల్ యమధర్మరాజుకు కనెక్ట్ అవుతుందని, హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపేవారి కొరకు యమ భటులు ఎదురుచూస్తూ ఉంటారని సరదాగా చెప్పడం జరిగింది

ట్రాఫిక్ నియమాలతో పాటు వారి బాధ్యత ఏమిటో, ఎలా నడుచుకోవాలో, ఈ వయసులో చేయకూడనివి ఏమిటో వివరంగా తెలియచేయడం జరిగింది. *చదువునే వయసులో చెడు స్నేహాలు, చెడు వ్యసనాలకు(మత్తు పదార్థాలు, డ్రగ్స్) ఆకర్షితులై విలువైన జీవితాలు పాడు చేసుకోవద్దని సూచించడం జరిగింది*. ఈ వయసులో పిల్లలతో తల్లితండ్రులు ఎలా మెలగాలో, వత్తిడితో పెంచవద్దని, వారికి తోడ్పాటు అందించాలి, ప్రోత్సహించాలి తప్ప వాళ్ళ కోరికలు పిల్లలపై రుద్దవద్దని చెప్పడం జరిగింది. గొప్పవాళ్ళ జీవిత చరిత్రలు చదవాలని, వారిని ఆదర్శంగా తీసుకోవాలని, జీవిత ఆశయాలు నిర్దేశించుకొని వాటిని సాధించే దిశగా కష్టపడి చదివి తల్లితండ్రులకు, కళాశాలకు పేరు తేవాలని చెప్పడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మల్లేష్, ఎస్సై వెంకెట్ రెడ్డి, ప్రిన్సిపల్ కృష్ణ ,కాలనీ సెక్రటరీ మరియు షేర్ అంబరిల్లా ఆర్గనైజేషన్ డైరెక్టర్ అర్చన మరియు  కానిస్టేబుల్ లతో పాటు టీచర్స్ పాల్గొన్నారు.