కాంగ్రెస్ పార్టీ మండల బీసీ సెల్ అధ్యక్షుడుగా అంతటి రామకృష్ణ..

Submitted by veerabhadram on Sun, 23/10/2022 - 17:36
bc sell adhyakshudu ramakrishna

చండ్రుగొండ  ప్రజా జ్యోతి  అక్టోబర్ 23

జిల్లా కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్  అధ్యక్షులు తుమ్మ రాంబాబు చండ్రుగొండ మండల కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షులుగా అంతటి రామకృష్ణ ను నియమించారు. జడ్పిటిసి కొణకండ్ల వెంకటరెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీ మండల బీసీ సెల్ అధ్యక్షునిగా అంతటి రామకృష్ణను ప్రకటించి,శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా నూతన కాంగ్రెస్ పార్టీ మండల బీసీ సెల్ అధ్యక్షుడు అంతటి రామకృష్ణ మాట్లాడుతూ... నా చిన్నతనం నుంచి కాంగ్రెస్ పార్టీ అభిమానిగా, పార్టీ కోసం ఎంతో కష్టపడి, నన్ను గుర్తించిన బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు  తుమ్మ రాంబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు కుందుమూరి దయాకర్ రావు, కేశబోయిన నరసింహారావు, సర్పంచ్ పద్దం వినోద్, కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు బొర్రా సురేష్, ఓర్సు రామకృష్ణ, మాజీ సర్పంచ్ రుక్మిణి, దారం గోవిందరెడ్డి, సర్పంచ్ దారావత్ రామారావు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.