ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు... * రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ అంకిరెడ్డి కృష్ణారెడ్డి...

Submitted by veerabhadram on Fri, 28/10/2022 - 17:26
ponguleti birth day

 చండ్రుగొండ ప్రజాజ్యోతి అక్టోబర్ 28

 మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకలను మండల వ్యాప్తంగా టిఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు,ప్రజా ప్రతినిధులు ఘనంగా జరుపుకున్నారు. శుక్రవారం చండ్రుగొండలో రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ అంకిరెడ్డి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ప్రధాన సెంటర్లో కేకును కట్ చేసి, కార్యకర్తలకు మిఠాయిలు పంపిణీ చేశారు. రావికంపాడులో గానుగపాడు సొసైటీ వైస్ చైర్మన్ భూపతి ధనలక్ష్మి ఆధ్వర్యంలో పొంగులేటి జన్మదిన సంబరాలు ఘనంగా నిర్వహించి, ఆలయంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ పటిష్టతకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రైతుబంధు జిల్లా కన్వీనర్ అంకిరెడ్డి కృష్ణారెడ్డి,వైస్ ఎంపీపీ నరకుళ్ల సత్యనారాయణ , గానుగపాడు  సొసైటీ వైస్ చైర్మన్ భూపతి ధనలక్ష్మి, సర్పంచ్ బానోత్ రన్యా, టిఆర్ఎస్( బిఆర్ఎస్) నాయకులు మాలోత్ భోజ్య నాయక్, సారేపల్లి శేఖర్, భూపతి శ్రీనివాసరావు, గుగులోత్ రాములు, ఇస్లావత్ శంకర్, కుంజా వెంకటేశ్వర్లు, ద్రోణవల్లి చలపతిరావు, నెల్లూరి ప్రసాద్, నన్నక సంపత్, చాపలమడుగు ప్రసాద్,బన్నె రాము, పసుపులేటి వెంకటేశ్వర్లు, గుగులోత్ ఈర్యనాయక్, ఆళ్లకుంట రాందాస్, అబ్బాస్అలి, తదితరులు పాల్గొన్నారు.