మహదేవ్ పూర

పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు

Submitted by srinivas on Sat, 01/10/2022 - 12:22

మహాదేవపురం సెప్టెంబర్30 (ప్రజాజ్యోతి)./...మండల కేంద్రంలో  సిఐ కిరణ్ ఆధ్వర్యంలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. ఇటీవల వారం రోజుల పాటు మావోయిస్టులు ఆవిర్భావ    వారోత్సవాలు ప్రశాంతంగా ముగిసినప్పటికి , మావోల సంచార సమాచారం తో పోలీసులు స్థాయిలో అప్రమత్తంగా ఉంటూ గ్రామాల్లో కమ్యూనిటీ పోలీసింగ్ తో పాటు , నాకా బందీ లు నిర్వహిస్తున్నారు. శుక్రవారం నాడు స్థానిక సిఐ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు నిర్వహించి అనుమానితులు వివరాలు సేకరించి వదిలారు. ఈ తనికిల్లో స్థానిక రెండవ ఎస్సై రాంసింగ్, ఏఎస్సై చేరాలు, ఉమెన్ పీసీ లు సంధ్య, సరస్వతి లు ఉన్నారు.

బతుకమ్మ చీరల పంపిణీ

Submitted by srinivas on Wed, 28/09/2022 - 13:01


మహదేవపూర్ సెప్టెంబర్ 27 ప్రజాజ్యోతి ..///.మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో బతుకమ్మ  చీరెల పంపిణీ చేశారు. మండలంలోని 18 సంవత్సరాలు నిండిన ఆహార భద్రత కార్డు కలిగిన మహిళలందరికీ బతుకమ్మ చీరెలను అందజేయనున్నట్లు ,9656 మందికి మండలంలో రేషన్ షాప్ ల ద్వారా పంపిణీ చేయనున్నట్లు తహసీల్ధార్ శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రీపతిబాపు,ఎంపీపీ రాణి బాయి, జడ్పీటీసీ గుడాల అరుణ, ఎంపీడీఓ శంకర్ నాయక్, ఉప సర్పంచ్ సల్మాన్ ఖాన్, వార్డ్ సభ్యులు, రేషన్ డీలర్లు, మహిళలు పాల్గొన్నారు

వాలీబాల్ పోటీల విజేత దమ్మూర్ ఎస్పీ చేతులమీదుగా బహుమతుల ప్రధానం

Submitted by srinivas on Wed, 28/09/2022 - 12:20

మహాదేవపూర్  , సెప్టెంబర్ 27 ప్రజాజ్యోతి ..//... మండల కేంద్రం లో నిర్వహించిన రెండు  మండలాల వాలీబాల్ పోటీలు ఉత్కంఠగా జరుగగాపలిమెల మండలం  దమ్మూరు జట్టు మొదటగా నిలిచింది.  కార్యక్రమానికి ఎస్పీ సురేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పోటీలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి మొదటగా నిలిచిన దమ్మూర్ జట్టుకు షీల్డ్ తో  పాటు పదివేల రూపాయల బహుమతిని ఎస్పి  అందించారు.

వ్యసనాల నుండి యువత ను రక్షించడానికి క్రీడలు అవసరం

Submitted by srinivas on Tue, 27/09/2022 - 12:09

పోలీస్ శాఖ అధ్యర్యంలో వాలీబాల్ టోర్నమెంట్ఎస్ ఐ రాజ్ కుమార్

పోడు భూముల పై సమీక్ష

Submitted by srinivas on Sun, 25/09/2022 - 14:21

మహదేవపూర్ సెప్టెంబర్ 24 ప్రజాజ్యోతి ..//.. మహదేవపూర్  మ౦డల ప్రజా పరిషత్ కార్యాలయము,లో పోడు భూములపై మండల స్థాయి సమావేశం నిర్వహించారు. .ఈ సమావేశంలొ తహసీల్దార్ శ్రీనివాస్  మాట్లాడుతూ టైమ్ లైన్ మ్యాప్ ద్వారా సర్వే నిర్వహించ బడుతుందని , గిరిజనులకు 2005 డిసెంబర్ 13 ముందే సాగులొ వుండాలని, గిరిజనేతరులు 2005 డిసెంబర్ 13 కంటే ముందు అంటే మూడు తరాలు సాగులొ వుండాలి లేదా 75సంవత్సరాలు సాగులొ వుండాలని  అన్నారు..

డిగ్రీ కళాశాలలో బతుకమ్మ సంబురాలు

Submitted by veerareddy on Sat, 24/09/2022 - 14:35

మహదేవపూర్ సెప్టెంబర్ 23 ప్రజాజ్యోతి..//.  మహదేవపూర్  డిగ్రీ కళాశాల లో బతుకమ్మ వేడుకలు శుక్రవారంనాడు ఘనంగా నిర్వహించారు.      కళాశాల వరండాలో బతుకమ్మ ను  ప్రతిష్టించి  పాటలతో, నాట్యాలతో  అలరించారు. అధ్యాపకురాలు రజిత మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను పది కాలాల పాటు కాపాడుకోవలసిన అవసరం ఉందని అన్నారు ,  కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ఇంత మంచి కార్యక్రమము ఏర్పాటు చేసినా కళాశాల టీచింగ్ నాన్-టీచింగ్ సిబ్బందిని అభినందించారు.

బతుకమ్మ చీరల పంపిణీకి ముందస్తు ప్రణాళికలు

Submitted by veerareddy on Fri, 23/09/2022 - 14:02

మహాదేవపూర్ సెప్టెంబర్ 22 ప్రజాజ్యోతి..///. మహాదేవపూర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయం లో మండల పరిషత్ అధ్యక్షులు రాణి బాయి, అధ్యక్షతన బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ద్వారా బతుకమ్మ చీరలను  పంపిణీ చేయుటగాను ముందస్తు సన్నహాలలో భాగంగా సమావేశం ఏర్పాటు చేయబడింది.

60వ రోజుకు చేరిన వీఆర్ఏల నిరసన దీక్ష

Submitted by veerareddy on Fri, 23/09/2022 - 13:09

మహాదేవపూర్,సెప్టెంబర్ 22 ప్రజాజ్యోతి../../ విఆర్ ఏ లు చేస్తున్న నిరసన దీక్షలు  నేటికి 60 వరోజుకు చేరింది. ఈ సందర్భంగా విఆర్ ఎలు మాట్లాడుతూ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి వీడి  తమ డిమాండ్లను నెరవేర్చాలని అన్నారు. గ్రామ రెవెన్యూ సహాయకులకు  ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీకి ఘన నివాళి

Submitted by veerareddy on Thu, 22/09/2022 - 12:25

మహాదేవపూర్ సెప్టెంబర్ 21 ప్రజాజ్యోతి .../ మహాదేవపూర్ మండల కేంద్రంలోని వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం ఆవరణలో పద్మశాలి కుల సంఘం ఆధ్వర్యంలో ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 10వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు.

చిల్లర రాజకీయాలతో విమర్శిస్తే సహించేదిలేదు..జిల్లా కాంగ్రేస్ ఉపాధ్యక్షుడు,దుర్గయ్య.

Submitted by veerareddy on Tue, 20/09/2022 - 16:44

మహాదేవపూర్. సెప్టెంబర్20 ప్రజాజ్యోతి.../కసాయిమనిషికి నిర్వచనం పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్ పుట్ట మధు నే అని జిల్లా కాంగ్రేస్ పార్టీ ఉపాధ్యక్షుడు మంచినీళ్ల దుర్గయ్య అన్నారు. మంగళవారం నాడు మహాదేవపూర్ లో పాత్రికేయుల సమావేశంలోఆయన మాట్లాడుతూ మంథని ఎమ్మేల్యే శ్రీధర్ బాబు పై పుట్టమధు అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల తీవ్రంగా ఖండించారు.ప్రేమతో ప్రజలకు దగ్గర కావాలి కానీ చిల్లర రాజకీయాలతో విమర్శనలు చేయడం అది పుట్ట మధు కే సాధ్యం మని అన్నారు.చిన్న కాళేశ్వరం నిర్లక్ష్యం చేసింది నువ్వు  మీ ప్రభుత్వంమేనని విమర్శించారు.