వెంకటాపురం

వాహన తనిఖీ ల్లో గుడుంబా పట్టివేత

Submitted by veerareddy on Mon, 03/10/2022 - 12:38

వెంకటాపురం (నూగూరు) అక్టోబర్ 02 (ప్రజా జ్యోతి) ./...ములుగు జిల్లా, వెంకటాపురం మండల పరిధిలోని ఆలుబాక సమీప ప్రాంతము లో  శనివారం పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా చర్ల వైపు నుండి వెంకటాపురం వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలపై నలుగురు వ్యక్తులు వస్తుండగా అపి తనిఖీ చేయగా వారి వద్ద సంచులను పరిశీలించి చూడగా సుమారు 120 లీటర్ల నాటుసారా ను గుర్తించారు.1)భుక్యా రాంబాబు (సుజ్ఞానపురం దుమ్ముగూడెం) 2)ముమ్మనేని బాబురావు (ఉప్పేడు వీరాపురం) 3)వల్లేపోగు గణేష్ (కొత్తపల్లి చర్ల)4) చల్లూరి శేషుకూమార్ (ఉప్పేడు వీరాపురం) ను అదుపులోకి తీసుకున్నారు.రెండు ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు.తదుపరి దర్యాప్

మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గాంధీ జయంతి వేడుకలు

Submitted by veerareddy on Mon, 03/10/2022 - 12:23

వెంకటాపురం (నూగూరు) అక్టోబర్ 02 ( ప్రజా జ్యోతి)./..ములుగు జిల్లా, వెంకటాపురం మండల కేంద్రంలోని మండలప్రజాపరిషత్ కార్యాలయంలో ఆదివారం ఎంపిపి చెరుకూరి సతీష్ కుమార్ ఆధ్వర్యంలో మహాత్మ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఎంపిపి సతీష్ మాట్లాడుతూ స్వాతంత్ర్య పోరాటం లో మహాత్ముడు చేసిన సేవలను వివరించి కోనియడారు.ఈకార్యక్రమంలో  వైస్ ఎంపిపి సయ్యద్ హుస్సేన్,ఎంపిటిసి గార్ల పాటి రవి,కోఆప్షాన్ సభ్యుడు సయ్యద్ హమీద్, జూనియర్ అసిస్టెంట్ ఇర్పా సత్యనారాయణ, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

ఘనంగా కుంకుమ పూజ కార్యక్రమం

Submitted by veerareddy on Sat, 01/10/2022 - 12:17

వెంకటాపురం (నూగూరు) ./..ములుగు జిల్లా, వెంకటాపురం మండల కేంద్రంలోని శివాలయం వీదిలో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపం లో శుక్రవారం సాయంత్రం మహిళలకు సాముహిక కుంకుమ పూజ కార్యక్రమం అర్చకులు శ్రీనివాస శర్మ ఆధ్వర్యంలోఘనంగా నిర్వహించారు. కుంకుమ పూజ లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.పూజ కార్యక్రమంఆనంతరం తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.

ప్రతిరోజు కూలి రూ.311 పెంచాలని కోరుతూ రాస్తారోకో

Submitted by veerareddy on Sat, 01/10/2022 - 12:11

వెంకటాపురం (నూగూరు) సెప్టెంబర్ 30 (ప్రజా జ్యోతి),...../వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కూలీలు  శుక్రవారం భద్రాచలం-వెంకటాపురం ప్రదాన రహదారిపై కంకల వాగు బ్రిడ్జి వద్ద, భద్రాచలం-వాజేడు రహదారి పై శాంతినగర్ వద్ద రెండు చోట్ల పలు గ్రామాల కు చెందిన కూలీలు రోడ్డు పై భైటా ఇంచి ఆందోళన చేపట్టారు.ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘo జిల్లా నాయకులు గ్యానం వాసు మాట్లాడుతూకూలీ రేటు  పెంచాలని కోరుతూ వివిధ రకాలుగా కూలీలు కూలీ పనుల కు వెళ్లకుండా ఆందోళనలు చేస్తున్నారన్నారు.చర్చల పేరుతో అధికారులు కాలయాపన చేస్తున్నారని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం రోజు వారీ కూలీ రూ.200 నుంచి రూ.311 కి పెంచాలని డిమాండ్

వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ

Submitted by veerareddy on Thu, 29/09/2022 - 09:45

వెంకటాపురం (నూగూరు) సెప్టెంబర్ 28( ప్రజా జ్యోతి).//..ములుగు జిల్లా, వెంకటాపురం మండలం లో వ్యవసాయ కూలీలకు కూలీ రేట్లు పెంచాలని వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. సమ్మె ఐదురోజుల నుంచి చేయడం జరిగిందని, బుధవారం స్థానిక అంబేద్కర్ విగ్రహం నుంచి ర్యాలీగా ఎన్టీఆర్ సెంటర్ వరకు వెళ్లి అనంతరం తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ధర్నా ను ఉద్దేశించి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు బీరెడ్డిసాంభశివ మాట్లాడుతూ వ్యవసాయ కూలీలకు కనీస వేతనం రోజుకు 300 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు

Submitted by veerareddy on Wed, 28/09/2022 - 12:03

వెంకటాపురం (నూగూరు) సెప్టెంబర్ 27 (ప్రజా జ్యోతి) ,..//ములుగు జిల్లా, వెంకటాపురం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మంగళవారం కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఎంపిటిసి సీతాదేవి ,ఏఈ రాజేష్ ,కార్యాలయ సిబ్బంది లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఆనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తొలి,మలిదశ ఉద్యమాలలో పాల్గోన్న ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ ఇర్పా సత్యనారాయణ,టైపిస్ట్,  కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

కోడి పందెం రాయుళ్లు అరెస్టు

Submitted by veerareddy on Tue, 27/09/2022 - 12:25

వెంకటాపురం (నూగూరు) సెప్టెంబర్ 26 (ప్రజా జ్యోతి)../.  వెంకటాపురం మండలం లో కోడి పందెం రాయుళ్ళను అరెస్టు చేసిన పోలీసులు.సోమవారం బెస్తగూడెం గ్రామం సమీపంలో నమ్మదగిన సమాచారం తో కోడి పందాల స్థావరం పై పోలీసులు దాడులు నిర్వహించారు. డబ్బులు పందెం పెట్టి కోడి పందెం ఆడుతున్న 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ 21780 నగదు, 6 సెల్ ఫోన్లు, రెండు పందెం కోళ్లు, 2 కోడి కత్తులు స్వాధీనం చేసుకున్నారు.పంచుల సమక్షంలో పంచనామా నిర్వహించి కేసు నమోదు చేసినట్లు ఎస్సైలు తిరుపతి, అశోక్ లు తెలిపారు.

వలస గిరిజనేతరులను ఏజెన్సీ నుండి పంపించే వరకు నా ఉద్యమం ఆగదు..సర్పంచ్ నర్సింహమూర్తి

Submitted by veerareddy on Fri, 23/09/2022 - 14:14

వెంకటాపురం (నూగూరు)  సెప్టెంబర్ 22( ప్రజా జ్యోతి);////  ఆదివాసీ నవనిర్మాణ సేన గత కొన్ని రోజుల నుండి చేస్తున్న దీక్ష గురువారం  31 వ రోజుకి చేరుకున్నాయి. వలస గిరిజనేతరుల అనుమతులు లేని అక్రమ నిర్మాణాల పైన ఎల్టీఆర్ కేసులు పెట్టాలని, వలస గిరిజనేతరులను ఏజెన్సీ నుండి పంపించాలి అనే ప్రధాన డిమాండ్లతో నర్సింహమూర్తి దీక్ష చేపట్టాడు.  ఈ దీక్షకి వాజేడు, వెంకటాపురం మండలాల ప్రజలు 30 రోజుల పాటు వెన్నుదన్నుగా నిలిశారు. అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రాల ఆదివాసీ సంఘాలు భారీగా మద్దతు కూడా తెలపడం.  వలస నిరోధక చట్టాన్ని అమలు చేయాలని ఇంత బలంగా ప్రజా ఉద్యమాన్ని చేపట్టడం ఇదే ప్రధమం.

వీఆర్ఏల మొర వినేదెవ్వరు

Submitted by veerareddy on Fri, 23/09/2022 - 13:05

వెంకటాపురం (నూగూరు) సెప్టెంబర్ 22 (ప్రజా జ్యోతి)../ తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం వీఆర్ఏ ల పట్ల చిన్నచూపు చూస్తోందని వీఆర్ఏల సంఘం ఆవేదన వ్యక్తం చేస్తుంది.

ప్రజా జ్యోతి కధనంకు స్పందన బాధిత మహిళకు రూ 25 వేల చెక్కును పంపిణీ చేసిన తహసీల్దార్

Submitted by veerareddy on Fri, 23/09/2022 - 13:01

వెంకటాపురం ( నూగూరు) సెప్టెంబర్ 22(ప్రజా జ్యోతి) ..,ములుగు జిల్లా, వెంకటాపురం మండల పరిధిలోని బర్లగూడెం గ్రామ పంచాయతీ చిన్న గంగారం గ్రామంలో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కుప్పకూలిన ఇల్లు.ఆదివారం వేకువజామున ఇంట్లో నిద్రిస్తున్న మొడెం సమ్మక్క బయటకు పరుగులు తీసి ప్రాణాపాయం నుండి బయట పడింది.నిరుపేద ఐన సమ్మక్క తనకు న్యాయం చేయాలని బాధితురాలు  ప్రభుత్వాన్ని వేడుకుంటుంది.అనే కధనం ప్రజా జ్యోతి దినపత్రిక లో ప్రచురితమైనది పాఠకులకు విధితమే.స్పందించిన తహశీల్దార్ ఆంటీ నాగరాజుక్షేత్ర స్థాయిలో సంభందిత సర్పంచ్ కోర్సా నరసింహ మూర్తి , కార్యదర్శి మౌనిక తో కలిసి పంచనామా నిర్వహించి