మహబూబ్ నగర్

భూమికోసం, భుక్తి కోసం పోరాడిన చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం ఆమె జయంతిని ఘనంగా నిర్వహిస్తున్నది" ---- జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటరావు

Submitted by Kramakanthreddy on Tue, 27/09/2022 - 13:02

మహబూబ్ నగర్, సెప్టెంబర్ 26 (ప్రజాజ్యోతి ప్రతినిధి) :  సోమవారం చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకుని జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బీసీ సంక్షేమ అధికారి కార్యాలయంలో ఏర్పాటుచేసిన చాకలి ఐలమ్మ చిత్రపటానికి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటరావు పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆనాటి బానిస సంకెళ్లను తెంచుకొని ఎలా పోరాడాలో చాకలి ఐలమ్మ సమాజానికి నేర్పిందని, ఆమె పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని అన్నారు.

ప్రజల సమస్యలను తీర్చేందుకు తెలంగాణాను తెచ్చుకున్నాం

Submitted by Kramakanthreddy on Sat, 10/09/2022 - 16:10
  • కరివేన రిజర్వాయర్ పూర్తయ్యే దశలో ఉంది.వచ్చే సంవత్సరం నీళ్లొస్తాయి"
  • ప్రజల సమస్యలన్నీ దశల వారిగా తీరుస్తాం"
  • రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్

  మహబూబ్నగర్, సెప్టెంబర్ 10 (ప్రజా జ్యోతి ప్రతినిధి) :  పేదల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో పని చేస్తున్నామని రాష్ట్ర ఎక్సైజ్ , క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు.శనివారం ఆయన మహబూబ్ నగర్ గ్రామీణ మండలం ధర్మాపూర్ గ్రామంలో 15 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన 3 సి సి రోడ్లను ప్రారంభించారు.61మంది నూతన ఆసరా పెన్షన్ కార్డుల లబ్ధిదారులకు పెన్షన్ కార్డు

వచ్చే సంవత్సరం నాటికి మహబూబ్ నగర్ లో చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం

Submitted by sridhar on Sat, 10/09/2022 - 15:27
  • పాత పాలమూరులో చాకలి ఐలమ్మ పేరున కమ్యూనిటీ హాల్ పూర్తి చేస్తాం"
  • రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ 

మహబూబ్నగర్, సెప్టెంబర్ 10 (ప్రజా జ్యోతి ప్రతినిధి) : సమాజంలో అనగారిన, పీడిత వర్గాల కోసం పోరాటం చేసిన ధీరవనిత చాకలి ఐలమ్మ ఆని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు.  చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్బంగా  శనివారం ఆయన  మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పాలమూరు మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతి పై ధర్నా

Submitted by Kramakanthreddy on Thu, 08/09/2022 - 17:37
  • పాలమూరు మున్సిపాలిటీలోని రెవిన్యూ సెక్షన్ లో దాదాపు 25 లక్షల అవినీతి జరిగింది"
  • మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అంజయ్య
  • పాలమూరు మున్సిపాలిటీ అంటేనే అవినీతి మున్సిపాలిటీ గా మారిపోయింది"
  • బి జె పి జిల్లా అధ్యక్షులు వీరబ్రహ్మచారి

మహబూబ్నగర్ , సెప్టెంబర్ 8 (ప్రజాజ్యోతి ప్రతినిధి) :  "అవినీతి అంతం - బి జె పి సొంతం "  అంటూ  నినాదాలు చేస్తూ గురువారం ఉదయం  భారతీయ జనతా పార్టీ పట్టన శాఖా ఆధ్వర్యంలో పాలమూరు మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి అవినీతి పై పాలమూరు మున్సిపాలిటీ కార్యాలయం ముందు కమిషనర్ డౌన్ డౌన్ అంటూ నిరసన  కార్యక్రమాన్ని చేపట్టింది.

డెంగ్యూ,మలేరియా, టైఫాయిడ్ లాంటి సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి

Submitted by Kramakanthreddy on Thu, 08/09/2022 - 17:33
  • జిల్లా కేంద్రంలో ముమ్మరంగా డెంగ్యూ నివారణ చర్యలు
  • వినాయక విగ్రహాల నిమజ్జన నిమిత్తం బైపాస్ దగ్గర వాహనాల ఏర్పాటు
  • మున్సిపల్ చైర్మన్ కోరమోని నరసింహులు

మహబూబ్నగర్, సెప్టెంబర్ 8 ( ప్రజా జ్యోతి ప్రతినిధి) : జిల్లా కేంద్రంలోని ప్రజలు ప్రమాదకరమైన డెంగ్యూ,మలేరియా, టైఫాయిడ్,వైరల్,సీజనల్ వ్యాధుల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని, ఇంటి ముందు నిల్వ ఉన్న నీటిని తొలగించాలని మున్సిపల్ చైర్మన్ కే.సి నర్సింహులు ప్రజలను కోరారు.

గురుకుల పాఠశాలలు ఇతర పాఠశాలలకు ఆదర్శంగా ఉండాలి

Submitted by Kramakanthreddy on Thu, 08/09/2022 - 09:55
  • స్వచ్ఛతకు మారుపేరుగా, విద్యలో దీటుగా నిలవాలి

  జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటరావు ; మహబూబ్నగర్, సెప్టెంబర్ 7 (ప్రజా జ్యోతి ప్రతినిధి) : గురుకుల పాఠశాలలు , కళాశాలలు ఇతర అన్ని పాఠశాలలకు ఆదర్శంగా నిలవాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ ఎస్.

ప్రొఫెసర్ జయశంకర్ కాలనీలో భక్తిశ్రద్ధలతో భజనలతో గణనాథుని నిమజ్జనం

Submitted by sridhar on Tue, 06/09/2022 - 15:04
  • వినాయకుని లడ్డూ వేలం పాటలో 1,03,456 రూపాయలకు లడ్డు దక్కించుకున్న సామి రాజగోపాల్

మహబూబ్నగర్, సెప్టెంబర్ 6 ( ప్రజా జ్యోతి న్యూస్) : జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డ్, ప్రొఫెసర్ జయశంకర్ కాలనీ యందు విఘ్నేశ్వరుని ప్రతిష్టించడానికి ఏర్పాటు చేసిన మండపాన్ని రంగు రంగు పూలతో , మామిడి తోరణాలతో విద్యుత్ దీపాలతో  ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా అలంకరించి గత ఐదు రోజులుగా మండపంలో ప్రతిష్టించిన వినాయకుడికి పూజలు చేస్తూ, భక్తిశ్రద్ధలతో భజనలు చేస్తూ, అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ, సోమవారం రోజు వినాయకుడి నిమజ్జన కార్యక్రమంలో భాగంగా  లడ్డూ వేలంపాట నిర్వహించడం జరిగింది.

బతుకు మార్గాన్ని పాఠశాల నుండి చూపించే ఉద్యోగస్తుడు ఉపాధ్యాయుడు

Submitted by sridhar on Mon, 05/09/2022 - 17:15
  • ఎంపీడీవో శ్రీధర్ 
  • 75 మంది రిటైర్డ్ ఉపాధ్యాయులకు ఘన సన్మానం

మక్తల్, సెప్టెంబర్ 5, ( ప్రజా జ్యోతి న్యూస్) ; భారతదేశంలో పాఠశాల లేని పల్లెటూరు అయినా ఉండవచ్చేమో కాని ఉపాధ్యాయుడు లేని ఊరు మాత్రం ఉండదని, బ్రతుకు తెరువు కోసం పాఠాలు చెప్పుకునే ప్రతి వ్యక్తి, బ్రతుకు మార్గాన్ని పాఠశాల నుండి చూపించే ఉద్యోగస్తుడు ఒక్క ఉపాధ్యాయుడు మాత్రమేనని ఎంపీడీవో సురేందర్ అన్నారు.