అభివృద్ధిని చూసి టిఆర్ఎస్ లోకి వలసలు.. * రావికంపాడులో 250 కుటుంబాలు చేరిక..

Submitted by veerabhadram on Sun, 23/10/2022 - 17:40
bsp partylo cherikalu

 చండ్రుగొండ ప్రజా జ్యోతి   అక్టోబర్ 23

ముఖ్యమంత్రి కెసిఆర్ చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ, పథకాలను చూసి టిఆర్ఎస్ ( బిఆర్ఎస్) పార్టీలోకి వలసలు వస్తున్నారని అశ్వరావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఆదివారం తాటిసుబ్బన్నగూడెం లోని ఎమ్మెల్యే స్వగృహంలోని జరిగిన కార్యక్రమంలో చండ్రుగొండ మండలం రావికంపాడు గ్రామానికి చెందిన వివిధ పార్టీలకు చెందిన 250 కుటుంబాల వారు టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు భూపతి రమేష్ ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు వారందరికీ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగాఆయన మాట్లాడుతూ... సమస్యల పరిష్కారం కాంగ్రెస్,బిజెపి పార్టీలు వైఫల్యం చెందాయన్నారు. అందుకోసమే టిఆర్ఎస్ పార్టీలోకి చేరుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో గానుగుపాడు సొసైటీ వైస్ చైర్మన్ భూపతి ధనలక్ష్మి,టిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి ఉప్పతల ఏడుకొండలు, టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు  భూపతి రమేష్, జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యులు సయ్యద్ రసూల్, టిఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు భూపతి శ్రీనివాసరావు, సీనియర్ నాయకులు చాపలమడుగు లక్ష్మణరావు, గాలం రవి,చీమట పుల్లయ్య, సర్పంచ్ బానోత్ రన్యా, నిజాంపట్నం మల్లికార్జునరావు, వెంకటేష్,పోతురాజు, వెంకటేశ్వర్లు,బీమా,హరీష్,సుదర్శన్, అబ్బాసాలి,తదితరులు పాల్గొన్నారు.