నాగారం

కన్నుల పండుగగా దేవి నవరాత్రి ఉత్సవాలు

Submitted by Upender Bukka on Mon, 03/10/2022 - 11:41

నాగారం 2అక్టోబర్( ప్రజా జ్యోతి)./...మండల కేంద్రంలోని వర్ధమానుకోట బస్టాండ్ సమీపంలో కొలువై ఉన్న అమ్మవారి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆదివారం అమ్మవారి సన్నిధానంలో సామూహిక కుంకుమ అర్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. కుంకుమార్చన లో  మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సరస్వతి దేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు.ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు మధుకర్, విక్రమ్ ,విజయ్, నవీన్ ,మల్లేష్, సాయి, హర్ష పాల్గొన్నారు.

వాటర్ ట్యాంక్ ను ప్రారంభించిన ఎస్సి రాష్ట్ర కార్యదర్శి ఎర్ర యాదగిరి

Submitted by Upender Bukka on Mon, 03/10/2022 - 11:37

నాగారం అక్టోబర్ 2 (ప్రజా జ్యోతి)./....నాగారం మండల పరిధిలోని ఫణిగిరి గ్రామంలో కోట మైసమ్మ గుడి ఆవరణలో ఏర్పాటు చేసిన వాటర్ ట్యాంకును ఆదివారం కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి ఎర్ర యాదగిరి ప్రారంభించారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తుల దాహార్తిని తీర్చడం కోసం, భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా  మంచినీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో వర్ధమానుకోట ఎంపీటీసీ వడ్డే పరుశరాములు, ఉప సర్పంచ్ ఎర్ర నరేష్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

మండల పరిషత్ కార్యాలయంలో గాంధీ జయంతి వేడుకలు

Submitted by Upender Bukka on Mon, 03/10/2022 - 11:25

నాగారం అక్టోబర్ 2 ప్రజా జ్యోతి./....నాగారం మండల పరిషత్ కార్యాలయంలో గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ కూరం మణి వెంకన్న గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ భారత  స్వాతంత్ర ఉద్యమంలో గాంధీజీ పాత్ర వెలకట్టలేనిదని అన్నారు. అహింసనే ఆయుధముగా మలుచుకుని భారతదేశానికి స్వాతంత్రం తీసుకువచ్చిన మహనీయుడు గాంధీ అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శోభారాణి, సూపర్ ఇంటెండెంట్ ముత్తయ్య, శ్రవణ్ ,జానీ, వెంకన్న, రాము, నరేష్, సురేష్, విజయ, రాధిక తదితరులు పాల్గొన్నారు.

ఆజాద్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

Submitted by Upender Bukka on Mon, 03/10/2022 - 11:08

నాగారం అక్టోబర్ 2 ప్రజా జ్యోతి./... మండల కేంద్రంలోని ఆజాద్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో  అన్నదాతలు  పగిలిశెట్టి రామ్ రత్నం, సునీత అన్నదాన  కార్యక్రమాన్ని నిర్వహించారు.  ఈ అన్నదాన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎస్సై ముత్తయ్య హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  దానాలలో కెల్లా అన్నదానం గొప్పదానమని అన్నారు అన్నం పరబ్రహ్మస్వరూపమని ఎవరు అన్నాన్ని వృధా చేయకుండా అన్నదాన కార్యక్రమాన్ని సద్వినియోగపరచుకోవాలని తెలిపారు. అన్నదాన కార్యక్రమానికి ముందుకు వచ్చిన అన్నదాతలను అభినందించారు. అనంతరం కమిటీ సభ్యులు ఆయనను శాలువతో సత్కరించారు.

ఆర్థిక సాయం అందజేత

Submitted by Upender Bukka on Mon, 03/10/2022 - 10:58

నాగారం అక్టోబర్ 2 ప్రజా జ్యోతి./...ఇటీవల పిడుగుపాటుతో నాగారం మండలానికి చెందిన కాట్రే వుల గంగమ్మ మృతి చెందడంతో  ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందులు పడుతున్న  విషయం తెలుసుకున్న  తుంగతుర్తి బిజేపి  నియోజకవర్గ  సభ్యులు కడియం రామచంద్రయ్య ఆదివారం మృతురాలి కుటుంబానికి 5000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో రమేష్,  సోమేష్, మహేష్, కిరణ్, లింగయ్య,, ఐలయ్య, శివ, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.

బాల్య వివాహాలు భవితకు అవరోధాలు

Submitted by Upender Bukka on Sat, 01/10/2022 - 11:22

నాగారం  30 సెప్టెంబర్ (ప్రజా జ్యోతి) ../...బాల్యవివాహాలు భవితకు అవరోధాలని  ఎంపీపీ కూరం మణి వెంకన్న అన్నారు. శుక్రవారం  మండల కేంద్రంలో  ఎంపీడీఓ కార్యాలయంలో  మండల స్థాయి బాలల పరిరక్షణ  కమిటీ,   మరియు అడ్వైజరీ బోర్డు కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో   ఎంపీపీ  మాట్లాడుతూ బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని, సమాజంలో ప్రతి ఒక్కరూ బాల్యవివాహాలను నిర్మూలించాలని   తెలిపారు.

ఎమ్మెల్యే గాదరి దిష్టిబొమ్మ దగ్ధం

Submitted by Upender Bukka on Sat, 01/10/2022 - 11:18

నాగారం  30 సెప్టెంబర్ (ప్రజా జ్యోతి) ,./// బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై  తుంగతుర్తి శాసనసభ్యులు గాదరి కిషోర్ అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా శుక్రవారం నాగారం బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.  ఈ సందర్భంగా నాగారం బహుజన సమాజ్ పార్టీ మండల అధ్యక్షుడు ఎర్ర రాంబాబు మాట్లాడుతూ కేసిఆర్ భారత రాజ్యాంగాన్ని మారుస్తానని వాక్యానించినప్పుడు , స్పందించని ఎమ్మెల్యే గాదరి కిషోర్ నేడు ,ఆర్ఎస్ ప్రవీణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదంగా ఉందని తెలిపారు.

నూతన పింఛన్ కార్డుల పంపిణీ చేసిన వైస్ ఎం. పి. పి. మణి మాల

Submitted by Upender Bukka on Sat, 01/10/2022 - 10:58

నాగారం 30 సెప్టెంబర్( ప్రజా జ్యోతి) ./...నాగారం మండల కేంద్రంలోని డి. కొత్తపల్లి గ్రామపంచాయతీలో నూతనంగా మంజూరైన పింఛన్ స్మార్ట్ కార్డులను నాగారం వైస్ ఎంపీపీ గుంట కండ్ల మణి మాల లబ్ధిదారులకు  పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...... తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు 50 లక్షల మంది వృద్ధులకు , వితంతువులకు దివ్యాంగులకు ,ఒంటరి మహిళలకు, ఆసరా పింఛన్లు అందజేస్తున్నారని తెలిపారు . అదేవిధంగా దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా కళ్యాణ లక్ష్మి ,షాదీ ముబారక్ పథకాలను రాష్ట్రంలో అమలు చేస్తున్నారని పేర్కొన్నారు.

అన్నదానం మహ దానం

Submitted by Upender Bukka on Fri, 30/09/2022 - 12:01

ప్రజా జ్యోతి నాగారం 29 సెప్టెంబర్ ./..  దానాలలో  కెల్లా  అన్నదానం  గొప్పదానమని  సర్పంచ్  ఫసుపులేటి  ప్రేమలత వెంకటరెడ్డి   అన్నారు  .గురువారం  నాగారం మండలంలోని మాచిరెడిపల్లి గ్రామంలో  మెయిన్ బజారులో జైభవానీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 6 వ వార్షికోత్సవం సందర్భంగా   కమిటీ సభ్యులు  ఏర్పాటు చేసిన కార్యక్రమంలో  ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ ప్రేమలత మాట్లాడుతూకమిటీ సభ్యులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం  చేసుకోవాలని తెలిపారు. అన్నదాన కార్యక్రమానికి ముందుకొచ్చిన కమిటి సభ్యులను అభినందించారు.

నివాళులర్పించిన వైస్ ఎంపీపీ మణిమాల

Submitted by Upender Bukka on Fri, 30/09/2022 - 10:47

నాగారం ప్రజా జ్యోతి 29 ./....మండల కేంద్రంలోని డి కొత్తపల్లి గ్రామానికి చెందిన టిఆర్ఎస్ సీనియర్ నాయకుడు గుండెబోయిన సైదులు ఇటీవల అకాల మరణం చెందారు. గురువారం వైస్ ఎంపీపీ మణిమాల ఆయన చిత్రపటానికి  పూలమాలవేసి  నివాళులర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. సైదులు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపి ఓదార్చారు. గుండబోయిన సైదులు మరణం పార్టీకి తీరని లోటని తెలిపారు. తెరాస పార్టీ తరఫున ఆ కుటుంబానికి అండదండగా ఉంటామని పేర్కొన్నారు. నివాళులర్పించిన వారిలో సర్పంచ్ యారాల నరసింహారెడ్డి ఇతర నాయకులు ఉన్నారు.