నాగారం

ఆర్థిక సాయం అందజేత

Submitted by Upender Bukka on Thu, 29/09/2022 - 12:01

నాగారం ప్రజా జ్యోతి 28 సెప్టెంబర్,../// నాగారం మండల కేంద్రంలోని బంగ్లా ఎక్స్ రోడ్ లో  మంగళవారం పిడుగుపాటుకు మృతి చెందిన గంగమ్మ కుటుంబాన్ని బుధవారం  ఎం.పి.పి.కూర మణి వెంకన్న, వైస్ ఎంపీపీ మణిమాల పరామర్శించారు. ఆనంతరం మృతురాలి కుటుంబానికి  వైస్ ఎంపీపీ మణి మాల ఎస్. ఫౌండేషన్ ద్వారా 5000  రూపాయలు  ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ   మణి వెంకన్న మాట్లాడుతూ... .. గంగమ్మ మృతి  కుటుంబ సభ్యులకు తీరని లోటు అని  అన్నారు. ఆ కుటుంబాన్ని భవిష్యత్తులో అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలిపారు. అనతరం గంగమ్మ కుటుంబాన్ని ఓదార్చి ధైర్యం చెప్పారు.

పిడుగుపాటుకు మహిళ మృతి

Submitted by mahesh yadhav on Wed, 28/09/2022 - 09:13

ప్రజా జ్యోతి నాగారం 27సెప్టెంబర్.//... పిడుగు పడి మహిళ మృతి చెందిన సంఘటన సూర్యాపేట జిల్లా నాగారం మండలంలో చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే నాగారం  మండలం బంగ్లా ఎక్స్ రోడ్ సమీపంలో  సాయంత్రం 4 గంటల సమయంలో ఉరుములు మెరుపులతో కూడిన  భారీ వర్షం పడింది. అదే సమయంలో పత్తి చేనులో పనిచేస్తున్న కాట్రేగుల గంగమ్మ (55) భారీ శబ్దం రావడంతో   అక్కడికక్కడే మృతి చెందింది. మిగతా మహిళ కూలీలు వెళ్లి చూడగా అప్పటికే మృతి చెంది ఉండడంతో సమాచారాన్ని పోలీసులకు చేరవేశారు.   నాగారం ఎస్సై ముత్తయ్య  సంఘటన  స్థలానికి చేరుకొని పంచనామా నిమిత్తం శవాన్ని తుంగతుర్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు.

బతుకమ్మ చీరల పంపిణీ చేసిన ఎంపీపీ కూరం మణి వెంకన్న

Submitted by mahesh yadhav on Tue, 27/09/2022 - 15:35

ప్రజా జ్యోతి నాగారం 26సెప్టెంబర్...///  నాగారం మండల కేంద్రంలోని పేరబోయిన గూడెం గ్రామపంచాయతీ కార్యాలయంలో ఎంపీపీ కూరం మణి,వెంకన్న ఆధ్వర్యంలో బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూప్రతి సంవత్సరం తెలంగాణ   ఆడపడుచులు  బతుకమ్మ పండుగ సంతోషముగా జరుపుకోవాలని  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తుందని తెలిపారు .అదే విధంగా షాదీ ముబారక్ ,కళ్యాణ లక్ష్మి లాంటి పథకాలను తెలంగాణ సర్కార్ ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు. ప్రతి ఏడాది 300 కోట్లు బతుకమ్మ చీరలకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయిస్తుందని తెలిపారు.

ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం

Submitted by Upender Bukka on Sat, 24/09/2022 - 12:59

ప్రజా జ్యోతి 23, సెప్టెంబర్..//..నాగారం మండలం నుండి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన 17 మంది ఉపాధ్యాయులను ఎంపీపీ కూరం మణి వెంకన్న శుక్రవారం సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అజ్ఞానం అనే చీకటిని తొలగించి వెలుగును నింపడంలో ఉపాధ్యాయుడు సమాజంలో కీలక పాత్ర పోషిస్తాడని అన్నారు. ఎంత టెక్నాలజీ అభివృద్ధి చెందిన ఆన్లైన్ విధానమైన సమాజంలొ  గురువు పాత్ర ముఖ్యమైనదని  తెలిపారు. తల్లిదండ్రుల తర్వాత విద్యాబుద్ధులు నేర్పించిన గురువే సమాజంలో ప్రధానమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో హరిచంద్ర ప్రసాద్, ఎం.

పంచాయతీరాజ్ డి ఈ గా పదవి బాధ్యతలను స్వీకరించిన కొండయ్య

Submitted by Upender Bukka on Sat, 24/09/2022 - 11:58


ప్రజా జ్యోతి నాగారం 23సెప్టెంబర్..///. నాగారం మండలం సర్కిల్ పంచాయతీరాజ్ డి ఈ గా కొండయ్య శుక్రవారం పదవి బాధ్యతలను స్వీకరించారు. అంతకు ముందు తుంగతుర్తి మండలం లో ఇన్చార్జి బాధ్యతలు నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన డీఈలు ఏఈలు మహేష్ రవికుమార్ సీనియర్ అసిస్టెంట్ రవి యాదగిరి  పుష్పగుచ్చం ఇచ్చి శాలువతో సన్మానించారు.

ఆర్థిక సాయం అందజేత

Submitted by Upender Bukka on Fri, 23/09/2022 - 12:01

ప్రజా జ్యోతి నాగారం 22సెప్టెంబర్..///. నాగారం మండల కేంద్రానికి చెందిన శిలోజు గోపయ్య చారి ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఆర్థిక ఇబ్బందు లలో  ఉన్న ఆ కుటుంబాన్ని తెలంగాణ ఉద్యమకారుడు ,ఆరాధ్య  ఫౌండేషన్ ఛైర్మెన్ తాడోజు వాణి శ్రీకాంత్ రాజ్  గురువారం ఆ కుటుంబాన్ని పరామర్శించి ఐదు వేల రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం ఆ కుటుంబానికి ఓదార్పునిచ్చారు. భవిష్యత్తులో ఆ కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు.

తొలిమెట్టు కార్యక్రమాన్ని పరిశీలించిన నోడల్ అధికారి వాసు

Submitted by Upender Bukka on Wed, 21/09/2022 - 12:26

నాగారం ప్రజా జ్యోతి 20సెప్టెంబర్../   ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సామర్థ్యాన్ని, ప్రమాణాలను పెంచే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తొలిమెట్టు కార్యక్రమాన్ని ప్రారంభించారని అన్నారు. మంగళవారం నాగారం మండల కేంద్రంలో గల ప్రాథమిక పాఠశాలలో తొలిమెట్టు కార్యక్రమాన్ని నోడల్ అధికారి వాసు పరిశీలించారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పథకంలో భాగంగా ఈ ఏడాది 23 వేల ప్రాథమిక పాఠశాలలకు చెందిన 11.26 లక్షల మంది చిన్నారులకు కనీస విద్యా ప్రమాణాలు పెంపొందించే లక్ష్యంగా నిర్దేశించారని పేర్కొన్నారు.

మాధవ రావును సన్మానించిన కౌన్సిలర్ సుంకరి అరుణ రమేష్

Submitted by Upender Bukka on Wed, 21/09/2022 - 11:53

ప్రజా జ్యోతి సూర్యాపేట టౌన్ 20 సెప్టెంబర్../ ఆల్ ఇండియా వెలమ అసోసియేషన్ ఈసీ మెంబర్ గా ఎన్నికైన మొదటి మాధవరావును మంగళవారం 19వ వార్డు కౌన్సిలర్ సుంకరి అరుణ రమేష్ శాలువతో సన్మానించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ సుంకరి అరుణ మాట్లాడుతూవెలుమ  అసోసియేషన్ అభివృద్ధికి బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. వెలమ కులస్తులను ఏకతాటిపై తీసుకోరావడానికి చురుకైన పాత్రను పోషించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు యూత్ అధ్యక్షుడు బ్రాహ్మణపల్లి నాగచారి, యాదగిరి నిమ్మల శ్రీకాంత్, నిఖిల్ పాల్గొన్నారు.

దశదినకర్మకు హాజరైన సర్పంచుల ఫోరం అధ్యక్షుడు నర్సింహ రెడ్డి

Submitted by Upender Bukka on Wed, 21/09/2022 - 11:46


ప్రజా జ్యోతి నాగారం 20సెప్టెంబర్.../  నాగారం మండలం ఈటూరు గ్రామ మండల  ఎంపీటీసీ   చింతల్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి    ,వేణుగోపాల్ రెడ్డి  మాతృమూర్తి (80) చింతల్ రెడ్డి   వసుమతి   ఇటీవల హైద్రాబాద్ లోని నారాయణగూడలో  మృతిచెందారు.   దశదిన కర్మ కార్య క్రమంలో భాగంగా సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు యారాల నరసింహారెడ్డి   హాజరై    చిత్ర పటానికి    పూలమాలలు వేసి నివాళులర్పించారు.నివాళులర్పించిన  వారిలో టీఆర్ఎస్ తుంగతుర్తి  మండల పార్టీ అధ్యక్షుడు తాటికొండ సీతయ్య ,నాగారం మండల  సర్పంచ్ కుంభం కరుణాకర్ ,  పసుపులేటి వెంకట్ రెడ్డి ,  ఉన్నారు.

మునుగోడులో నీలి జెండా ఎగరడం ఖాయం

Submitted by Upender Bukka on Wed, 21/09/2022 - 11:43

ప్రజా జ్యోతి నాగారం 20 సెప్టెంబర్.../  రాబోయే మునుగోడు ఉప ఎన్నికల్లో నీలి  జెండా ఎగరడం ఖాయమని బహుజన సమాజ్ పార్టీ నాగారం మండల అధ్యక్షుడు ఎర్ర రాంబాబు అన్నారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూబహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అధ్వర్యంలో    మునుగోడు లో నిర్వహించ బోయే సభకు నాగారం మండలం నుండి అధికంగా దళిత శ్రేణులు పాల్గొంటారని తెలిపారు. మునుగోడు నియోజకవర్గంలో అగ్రవర్ణ పార్టీల కు  దీటుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ అగ్రవర్ణ పేదలను ఏకం చేస్తూ బహుజన రాజ్యాధికారం కోసం రాష్ట్రం నలుమూలల నుండి మునుగోడుకు తరలి రానున్నారని పేర్కొన్నారు.