Regonda

ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు.

Submitted by srinivas on Mon, 03/10/2022 - 12:52

రేగొండ, అక్టోబర్ 2 (ప్రజాజ్యోతి),..//  రేగొండ తెరాస పార్టీ టౌన్ ప్రెసిడెంట్ కొలేపాక బిక్షపతి ఆధ్వర్యంలో  బాపూజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సత్యగ్రహమే ఆయుధంగా అహింస మార్గంలో పోరాడిన  మహనీయుడు  గాంధీజీ అన్నారు.ఈ కార్యక్రమంలో రేగొండ తెరాస పార్టీ మండల అధ్యక్షులు రాజేందర్, ఎంపీపీ  లక్ష్మీ,  పిఎసిఎస్ వైస్ చైర్మన్ పాపిరెడ్డి, పోచంపల్లి ఎంపిటిసి ప్రతాప్ రెడ్డి, మాజీ ఎంపిటిసి  శంకర్, మండల యూత్ ఉపాధ్యక్షులు ప్రవీణ్, జిల్లా యూత్ నాయకులు శ్రీకాంత్ గౌడ్, రాజు,నాయకులు  గణేష్ రెడ్డి, రామకృష్ణ,  భరత్,  రాకేష్,  రమేష్, సృజన్ తదితరులు పాల్గొన్నారు.

పౌష్టికాహారమే దేశ ప్రగతికి సోపానం సీపిడీఓ అవంతిక

Submitted by srinivas on Thu, 29/09/2022 - 16:22

రేగొండ,సెప్టెంబర్ 29 (ప్రజాజ్యోతి),..///  రేగొండ మండలం పోచంపల్లి గ్రామంలో  గురువారం రోజున పోషకాహార వారోత్సవాలు నిర్వహించారు.  కిషోర బాలికలు, గర్భిణీలు బాలింతలు పోషకాహారం తీసు కోవాలని  సిపిడిఓ అవంతిక  సూపర్వైజర్ సంధ్యారాణి   లు సూచించారు.   సర్పంచ్  గంగుల రమణారెడ్డి అధ్యక్షతన ఈ సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గర్భిణీలు, శ్రీమంతాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్స్ ముద్దామల్ల రేణుక దేవి, ఆర్. సరోజన కొడవట0చ  సెక్టర్ అంగన్వాడి టీచర్లు గ్రామ పంచాయతీకార్యదర్శి, మాచపక శ్రీనివాస్, ఆశావర్కర్లు,ఏఎన్ఎంలు తదితరులు పాల్గొన్నారు.

సంక్షేమ పథకాలలో దూసుకుపోతున్న తెలంగాణ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి

Submitted by srinivas on Thu, 29/09/2022 - 10:31

రేగొండ సెప్టెంబర్ 28 ప్రజాజ్యోతి .//...   రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతూ రాష్ట్ర అభివృద్ధికి పాల్పడుతుందని ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని రాయపల్లి, దమన్నపేట, దామరంచపల్లి గ్రామాలలో బతుకమ్మ చీరలు ఆసరా పెన్షన్ కార్డులను పంపిణీ చేశారు.  ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాలలో ఎమ్మెల్యే గండ్ర  మాట్లాడుతూ  అర్హులైన వారందరికీ ఆసరా పెన్షన్ కార్డులను మంజూరు చేస్తున్నామని అన్నారు. ఆడపడుచులకు బతుకమ్మ కానుకగా చీరే సారే ఇస్తున్నామని తెలిపారు.

లక్ష్మీ నరసింహస్వామి హుండీ లెక్కింపు

Submitted by srinivas on Thu, 29/09/2022 - 09:52

రేగొండ,సెప్టెంబర్28ప్రజాజ్యోతి.///...  మండలం  లోని లక్ష్మీనృసింహస్వామి దేవస్థానము హుండీలను   బుధవారం  లెక్కించారు.  హుండీల ద్వారా  మొత్తం  16,80,827-00 రూపాయలు ఆదాయం  వచ్చినట్టు  దేవాదాయ శాఖ పరిశీలకులు  అనిల్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో , ఆలయ కార్యనిర్వాహణాధికారి బిల్ల శ్రీనివాస్, ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ మాదాడి అనిత  కరుణాకర్ రెడ్డి, పోలీస్ అధికారులు రవీందర్, కిరణ్, మెంబర్స్  కుమారస్వామి,  సుమన్,  రాజేశ్వర్ రావు, శంకర్, నరేష్, గ్రామ పెద్దలు  శివాజీ,  భాస్కర్, ఓదెలు,  సంపత్ రావు మరియు నిమ్మల రాజు భజన బృందాలు, భక్తులు పాల్గొన్నారు.

మావోయిస్టులకు సహకరించొద్దు ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి

Submitted by srinivas on Wed, 28/09/2022 - 13:03

రేగొండ, సెప్టెంబర్ 27 ప్రజాజ్యోతి :  మావోయిస్టులకు సహకరిస్తే చర్య లు తప్పవని ఎస్ఐ ననిగంటి శ్రీకాంత్ రెడ్డి అన్నారు.  మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో  మావోయిస్టుల ఫొటోలతో కూడిన వాల్‌పోస్టర్లు ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో అపరిచితులు కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని అన్నారు. మావోయిస్టు భావజాలం వైపు యువతను ప్రేరేపించాలని చూసిన చర్యలు తీసుకుంటామని అన్నారు. గుడుంబా అమ్మిన తయారుచేసిన వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. గ్రామాల్లో ఎలాంటి అవాంఛనియ సంఘటనలు జరగకుండా ప్రజలు సహకరించాలని అన్నారు.

పోలీసుల ఆధ్వర్యంలో వాలీబాల్ టోర్నమెంట్

Submitted by srinivas on Wed, 28/09/2022 - 12:59

రేగొండ, సెప్టెంబర్27 ప్రజాజ్యోతి :  రేగొండ మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిరావు పూలే పాఠశాల ఆవరణంలో మంగళవారం పోలీసుల ఆధ్వర్యంలో వాలీబాల్ పోటీలను నిర్వహించారు. ఈపోటీలను రేగొండ  ఎస్ఐ శ్రీకాంత్  ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ యువత ఆ టలను జీవితంలో ఒక భాగంగా పెట్టుకొని ముందుకు సాగితే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చునని అన్నారు. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయని అన్నారు. మండల స్థాయి పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులతో పాటు జిల్లా స్థాయి పోటీలకు పంపిస్తామని తెలిపారు.

సంక్షేమ పథకాలలో దూసుకుపోతున్న తెలంగాణ పేదింటి అడబిడ్డలకు తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట

Submitted by srinivas on Sun, 25/09/2022 - 10:49
  • నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి
  • భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
  • మండలంలో బతుకమ్మ చీరలు, ఆసరా పెన్షన్ కార్డుల పంపిణీ

రేగొండ,24 సెప్టెంబర్ ప్రజాజ్యోతి  : పేదింటి ఆడపడుచులకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు.