భద్రత ప్రమాణాలు పాటించాలి
సరైన భద్రత ప్రమాణాలు పాటించాలి
ప్రమాదాలను నివారించాలి
డాక్టర్ సుమన్ బైనిక్
సరైన భద్రత ప్రమాణాలు పాటించాలి
ప్రమాదాలను నివారించాలి
డాక్టర్ సుమన్ బైనిక్
హైదరాబాద్,సిటీ,ప్రజాజ్యోతి ; ప్రస్తుత సమాజంలో మానవులు తీవ్ర ఒత్తిడి, నిద్రలేమి, కలుషిత ఆహార పదార్థాల ద్వారా అనారోగ్యం పాలు అవుతున్నారని అలా కాకుండా ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకోవాలని డిస్టిక్ ఫైర్ సేఫ్టీ ఆఫీసర్ మోహనరావు అన్నారు. బుధవారం వరల్డ్ హార్ట్ డే ను పురస్కరించుకొని బేగంపేటలోని మెడికవర్ హాస్పిటల్ లో ఏర్పాటు చేసిన డిపార్ట్మెంట్ ఆఫ్ కార్డియాక్ సైన్సెస్ - సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విభాగాన్ని హాస్పిటల్ చీఫ్ ఆఫ్ బిజినెస్ ఆపరేషన్ మహేష్ దెగ్లూర్కర్, కార్డియాలజిస్ట్ సాకేత్, న్యూరో సర్జన్ రణధీర్ లతో కలిసి ప్రారంభించారు.
ద ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ టింబర్ మర్చంట్ సామిలర్స్ అండ్ ఎల్ఈడి ఇండస్ట్రీస్ జనరల్ బాడీ మీటింగ్ హైదరాబాదులోని ఎల్బీనగర్ లో గల శ్రీ లక్ష్మీ నారాయణ భవన్ లో ఆదివారం ఘనంగా జరుపుకున్నారు ఈ సమావేశంలో పాత బాడీ రద్దు కాగా అన్ని జిల్లాల నుండి హాజరైన ఆయా జిల్లాల కలప వర్తక సంఘాల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు ట్రెజరర్లు మరియు ఇతర సామిల్ ల యజమానులు నూతనంగా రాష్ట్ర అధ్యక్షులను, ప్రధాన కార్యదర్శిని, ట్రెజరర్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు నూతన కార్యవర్గానికి చెందిన వారిలో చకిలం రమణయ్య గారిని రాష్ట్ర అధ్యక్షునిగా గోపి కృష్ణ గారిని ప్రధాన కార్యదర్శిగా , పురుషోత్తం ఎమ్ పటేల్ గారిని ట్రెజరర్ గా, హాజరైన సభ్యులు ఏకగ్
హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని రూబీ హోటల్‌లో జరిగిన భారీ అగ్ని ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది. ఇప్పటికే ఏడుగురు చనిపోగా తాజాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో వ్యక్తి మృతిచెందారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి అపోలో,యశోద ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు.
మృతుల వివరాలు
అల్లాడి హరీశ్ (33), విజయవాడ (రామవరప్పాడు)
వీరేంద్రకుమార్ (50), దిల్లీ సీతారామన్ (48),చెన్నై బాలాజీ (58),చెన్నై రాజీవ్ మైక్ (26),దిల్లీ
సందీప్ మాలిక్,దిల్లీ
ఓ మహిళ సహా మరో ఇద్దరి వివరాలు తెలియాల్సి ఉంది.
హైదరాబాద్ సిటీ/ప్రజాజ్యోతి ; రెబల్ స్టార్ యు. వి. కృష్ణంరాజు మాజీ కేంద్ర మంత్రి మరణ వార్తా తనను తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసిందని హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఈమేరకు విడుదల చేసిన పత్రిక ప్రకటన లో పేర్కొన్నారు.
హైదరాబాద్ సిటీ/ప్రజాజ్యోతి
ప్రముఖ సినీ నటుడు,మాజీ కేంద్రమంత్రి (ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు) కృష్ణం రాజు మరణం పట్ల రాష్ట్ర గిరిజన,స్త్రీ - శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ సంతాపం వ్యక్తం చేశారు.
తన యాభై ఏండ్ల సినీ ప్రస్థానంలో అనేక సినిమాల్లో హీరోగా నటించి, తన విలక్షణ నటనతో 'రెబల్ స్టార్' గా సినీ ప్రేక్షకుల హృదయాల్లో అభిమానం సంపాదించుకున్న కృష్ణంరాజు మరణం సినిమా రంగానికి తీరని లోటని అన్నారు.
లోక్ సభ సభ్యునిగా,కేంద్ర మంత్రిగా ప్రజలకు సేవలందించిన కృష్ణంరాజు మరణం బాధాకరమని మంత్రి అన్నారు.
హైదరాబాద్ సిటీ/ప్రజాజ్యోతి ; సీనియర్ నటుడు, రెబల్‌స్టార్ కృష్ణంరాజు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఈ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.
పంజాగుట్ట, సెప్టెంబర్8 (ప్రజాజ్యోతి) కరాటే కేవలం ఆత్మరక్షణకే కాదు సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడాలని సినీ హీరో సుమన్ అన్నారు.గురువారం సోమజిగూడ ప్రెస్ క్లబ్ లోతైక మార్షల్ ఆర్ట్స్ అకాడమీ చీఫ్ ఆర్గనైజర్ అశోక్ చక్రవర్తి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశనికి సుమన్ ముఖ్య అతిథిగా విచ్చేసి నవంబర్ 6 న గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో నిర్వహించే ఆల్ ఇండియా ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ పోటీల కు సంబంధించిన పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఆత్మ రక్షణ కోసం ప్రతి ఒక్కరు కరాటే నేర్చుకోవాలన్నారు.
హైదరాబాద్ సిటీ సెప్టెంబర్7(ప్రజాజ్యోతి): ఈ నెల 17న తెలంగాన జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుందని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. బుధవారం మంత్రులు వి శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్ ,నగర ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో, మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, అధికారులతో కలిసి నెక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజాలో పర్యటించారు.
సెప్టెంబర్ 8 ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవం సందర్భంగా సువిధ హాస్పిటల్ వారు ఫిజియోథెరపీ ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమం మరియు ప్రతి వ్యక్తి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రతిరోజు నడుక తప్పనిసరి అని తెలియజేయడానికి వాల్కథన్ కార్యక్రమాన్ని గురువారం ఉదయం ఏడు గంటలకు కేబీఆర్ పార్కు నుంచి పంజాగుట్ట వరకు నిర్వహించబడును ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే దానం నాగేందర్ , ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయ రెడ్డి, అడిషనల్ డీసీపీ మహేందర్ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా సినీ నటుడు సోహైల్ ఖాన్, బుల్లితెర మరియు సినీ నటులు ప్రభాకర్, నిరుపమ్ తదితరులు పాల్గొననున్నారు ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరై ప్రపంచ ఫిజియ