చౌటుప్పల్

సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ ముందంజలో ఉంది అభినందన్ రెడ్డి

Submitted by mallesh on Mon, 03/10/2022 - 14:40

చౌటుప్పల్ అక్టోబర్ 2( ప్రజా జ్యోతి):   తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయడంలో దేశంలోనే ముందంజలో ఉన్నదని టిఆర్ఎస్ పార్టీ మండల యువజన విభాగం అధ్యక్షుడు నారెడ్డి అభినందన్ రెడ్డి అన్నారు.ఆదివారం చౌటుప్పల్ లో నిర్వహించిన టిఆర్ఎస్ పార్టీ మండల యువజన సమావేశం లో ఆయన మాట్లాడుతూ ఎంపీపీ తాడూరి వెంకట్ రెడ్డి, తన సొంత స్వలాభం కోసం రాజగోపాల్ రెడ్డి ఇచ్చే డబ్బులకు  అమ్ముడుపోయారన్నారు.

ఘనంగా మహాత్మ గాంధీ జయంతి వేడుకలు

Submitted by mallesh on Mon, 03/10/2022 - 11:54

చౌటుప్పల్ అక్టోబర్ ( ప్రజా జ్యోతి):  భారత దేశానికి స్వతంత్రం సాధించడం కోసం ఎన్నో కష్టాలు అవమానాలు భరించి, అహింసతోనే ప్రపంచాన్ని జయించవచ్చని నిరూపించిన వీరుడు జాతిపిత మహాత్మా గాంధీ అని ఎల్లాగిరి సర్పంచ్ రిక్కల ఇందిరా సత్తిరెడ్డి అన్నారు.ఆదివారం ఎల్లాగిరి గ్రామపంచాయతీ ఆవరణంలో మాత్మ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి సర్పంచ్ ఇందిరా సత్తిరెడ్డి ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సాయిరెడ్డి బుచ్చిరెడ్డి, కొత్త యాదయ్య, శ్యామ పద్మ, కొత్త సంతోష, మారగోని పద్మ ,కందగట్ల యాదిరెడ్డి మెట్టు నర్సిరెడ్డి ,లక్ష్మీబాయి, కందగట్ల పద్మా రెడ్డి, వెంకట్ రామ్ రెడ్డ

తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష బిజెపితోనే సాధ్యమవుతుంది జిట్టా బాలకృష్ణారెడ్డి

Submitted by mallesh on Sat, 01/10/2022 - 10:54

చౌటుప్పల్ సెప్టెంబర్ 30 (ప్రజా జ్యోతి):  భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష సాధన కోసం పనిచేస్తుందని బిజెపి రాష్ట్ర నాయకుడు జిట్ట బాలకృష్ణ రెడ్డి అన్నారు.

సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలి మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

Submitted by mallesh on Fri, 30/09/2022 - 16:25

చౌటుప్పల్ సెప్టెంబర్ 30 ( ప్రజా జ్యోతి) ./... ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాలను శాసించే స్థాయికి చేరితే ,తెలంగాణలో అందజేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను దేశవ్యాప్తంగా అమలవుతాయని, ప్రజలు సీఎం కేసీఆర్ ను దేశ రాజకీయాల్లో రావాలని, కోరుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు.శుక్రవారం చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ ఆవరణలో కుంట్ల గూడెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బాల విటల్, దోర్నాల రామస్వామి, బాల చంద్రయ్య, కర్నాటి శ్రీనివాసులు తో పాటు 100 మంది కార్యకర్తలను టిఆర్ఎస్ పార్టీలోకి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆహ్వానించారు.

బడుగు బలహీన వర్గాల ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి

Submitted by mallesh on Fri, 30/09/2022 - 11:04

చౌటుప్పల్ సెప్టెంబర్ 29 (ప్రజా జ్యోతి) .//..సీఎం కేసీఆర్ 8 సంవత్సరాలుగా కాలేశ్వరం ప్రాజెక్ట్ పేరిట దోచుకున్న అవినీతి సొమ్మును త్వరలోనే బయటకు తీస్తామని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి అన్నారు. గురువారం దేవలమ్మ నాగారం గ్రామంలో నిర్వహించిన బూత్ కమిటీ నాయకుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. గడపగడపకు తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాజెక్టుల డిజైన్ పేరిట ముఖ్యమంత్రి వేలకోట రూపాయలను సొమ్ము చేసుకుంటున్నారు. దక్షిణ తెలంగాణపై కేసీఆర్ వివక్ష చెబుతున్నారని పేర్కొన్నారు.

దళిత మహిళా సర్పంచ్ దిష్టిబొమ్మ ను దహనం చేసిన వ్యక్తులను వెంటనే అరెస్టు చేయాలి

Submitted by mallesh on Thu, 29/09/2022 - 12:46

చౌటుప్పల్ సెప్టెంబర్ 28 (ప్రజాజ్యోతి)..//..  చిన్న కొండూరు గ్రామ సర్పంచ్ బక్క స్వప్న శ్రీనాథ్ దిష్టిబొమ్మను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, దహనం చేయడానికి నిరసిస్తూ గురువారం ఎమ్మార్పీఎస్ నాయకులు అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు.ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ నాయకులు మత్య దేవేందర్, బోయ దేవేందర్ లు మాట్లాడుతూ దళిత వర్గాల నాయకులను అవమాన పరిచేల భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం చేస్తే, మాదిగల ఆత్మగౌరవం కోసం ,మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో భారీ ఉద్యమాలు చేపడతామన్నారు.

ఆర్థిక సహాయం అందజేత

Submitted by mallesh on Thu, 29/09/2022 - 12:38

చౌటుప్పల్ సెప్టెంబర్ 28 (ప్రజా జ్యోతి) .///.,టిఆర్ఎస్ పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు కంటికి రెప్పలాగా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఎల్లప్పుడు అండగా ఉంటాడని టిఆర్ఎస్  యువజన విభాగం మండల అధ్యక్షుడు నారెడ్డి అభినందన్ రెడ్డి అన్నారు.దామెర గ్రామానికి చెందిన ఊడుగు కృష్ణ అకాల మరణం చెందడంతో కృష్ణ కుటుంబానికి చేయూతనిస్తూ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆర్థిక సహాయం గాను అందించిన 50 వేల రూపాయలను మృతుడు భార్య ధనలక్ష్మికి అభినందన్ రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నా రెడ్డి అండాలు.