నారాయణ్ పూర్

బిజెపి సమన్వయ కమిటీ సమావేశం

Submitted by veeresham siliveru on Tue, 06/09/2022 - 11:20
  • రాజగోపాల్ రెడ్డి ని గెలిపించుకోవాలి 
  • బిజెపి మండల కమిటీ అధ్యక్షుడు విక్రమ్

సంస్థాన్ నారాయణపురం సెప్టెంబర్ 5, ప్రజా జ్యోతి: మునుగోడు ఉప ఎన్ని కల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలిపించుకోవాలని బిజెపి మండల కమిటీ అధ్యక్షుడు జక్కలి విక్రం కోరారు. సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో సోమవారం నా డు బిజెపి పార్టీ కొత్త ,పాత నాయకులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. సమావేశంలో కొత్త పాత నాయకులను ఎలా సమన్వయం చేసుకోవాలో వివరించారు . పార్టీ విధానాలను నూతన నాయకులకు తెలిపారు.

రోడ్ల మరమ్మతులు చేపట్టాలని రాస్తారోకో ర్యాలీ నిర్వహించిన అఖిలపక్ష పార్టీ లు

Submitted by Sathish Kammampati on Fri, 02/09/2022 - 12:58
  • రోడ్లను మరమ్మతు చేయండి లేదా దిగిపోండి: అఖిలపక్ష నాయకుల డిమాండ్

సంస్థాన్ నారాయణపురం సెప్టెంబర్ 2 ( ప్రజా జ్యోతి) : మండలం లో అధ్వానంగా మారిన రోడ్లను వెంటనే నిర్మించాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు.  రోడ్లను నిర్మించలేని అసమర్ధ ప్రభుత్వం దిగిపోవాలని డిమాండ్ చేశారు.  సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో శుక్రవారం నాడు అఖిలపక్ష పార్టీ లాఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ చౌరస్తాలో రాస్తారోకో ,ధర్నా చేశారు.  ఈ సందర్భంగా అఖిలపక్ష పార్టీల నాయకులు మాట్లాడుతూ మండలంలోని రోడ్లన్నీ గుంతల మయంగా మారిపోయినట్లు ఆరోపించారు.

సంస్థాన్ నారాయణపూర్ మండలంలో రోడ్ల దుస్థితి

Submitted by Sathish Kammampati on Thu, 01/09/2022 - 14:19
  • అధ్వాన్నమైన రోడ్లు-  ఆందోళనకు సిద్ధమవుతున్న అఖిలపక్షాలు

సంస్థాన్ నారాయణపురం సెప్టెంబర్ 1 ( ప్రజా జ్యోతి) మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా గ్రామాలలోని రోడ్లు అద్వానస్థితికి చేరుకున్నాయి. చౌటుప్పల్ నల్గొండ వెళ్లే ప్రధాన రహదారి తప్ప మిగతా అన్ని రోడ్లు గుంతల మయంగా మారిపోయాయి.  గత దశాబ్ద కాలంగా నియోజకవర్గంలోని రోడ్లు మరమ్మతులకు నోచుకోకపోవడం వల్ల గుంతల మయంగా మారి ప్రయాణికులకు నరకం చూపిస్తున్నాయి. చౌటుప్పల్ నుంచి తంగడపల్లి వరకు అద్వాన్నంగా ఉన్న రోడ్డును ఇటీవలనే కొంతమేరకు మరమ్మతులు చేశారు.

తహసిల్దార్ గా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాసరాజు

Submitted by Sathish Kammampati on Thu, 01/09/2022 - 14:14
  • సంస్థ నారాయణపూర్ తాసిల్దారుగా శ్రీనివాసరాజు 

సంస్థాన్ నారాయణపురం సెప్టెంబర్ 1 ( ప్రజా జ్యోతి) సంస్థాన్ నారాయణపురం మండలం తహసీల్దారుగా శ్రీనివాసరాజు గురువారం పదవి బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఇక్కడ పనిచేసిన రవికుమార్ కలెక్టరేట్కు బదిలీ కాగా,  గుండాల మండలం నుంచి బదిలీపై శ్రీనివాసరావు ఇక్కడికి వచ్చారు. పదవి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా రెవెన్యూ సిబ్బంది ఆయనకు అభినందనలు తెలిపారు.