Telkapalle

చీకటి దందాగా మారిన ఇసుక రవాణా

Submitted by veerareddy on Mon, 03/10/2022 - 13:19

తెలకపల్లి,అక్టోబర్ 2(ప్రజాజ్యోతి): ఇసుక అక్రమ రవాణా చీకటి దందాగా మారింది కొంతకాలంగా ఈ ప్రాంతంలో దుందుభి వాగు పరిసరాల నుండి ఇసుక మాఫియా తమ ట్రాక్టర్ల ద్వారా ఇసుక నింపుకొని తెలకపల్లి మీదుగా అతివేగంతో నాగర్ కర్నూల్ తెలకపల్లి తదితర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు ఇసుక అక్రమ రవాణాను ఎంతకు అరికట్టే పరిస్థితి లేకుండా పోతుందని ఆరోపిస్తున్నారు అనుమతుల పేరుతో కొందరు ఇసుక రవాణా చేస్తున్నా చీకటి అయింది అంటే ఇసుక రవాణా జోరు పెరుగుతుంది ఇసుక రవాణా మాఫియాను అధికారులు పట్టించుకోకపోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్లకు నంబర్ ప్లేట్లు లేకుండా అతివ

తెలకపల్లి బస్టాండుకు దిక్కెవరు

Submitted by veerareddy on Mon, 03/10/2022 - 13:10

తెలకపల్లి,అక్టోబర్ 30(ప్రజాజ్యోతి):  మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ కు దిక్కెవరని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు ఆర్టీసీ అధికారులు బస్టాండ్ చుట్టూ డబ్బాలు వేయించి వ్యాపారాలు నడిపిస్తూ నెలసరి అద్దెలు వేల రూపాయలు చొప్పున వసూలు చేస్తున్నారు అద్దెలపై దృష్టి సారించిన ఆర్టీసీ అధికారులు ప్రయాణికులకు కనీసం తాగునీటి వసతి కూడా ఏర్పాటు చేయలేకపోతున్నారు ఆవరణను సిసి చేయకపోవడంతో గుంతల మయంగా మారి ప్రయాణికులు ప్రత్యక్ష నరకం చూస్తున్నారు రాత్రిపూట విద్యుత్తు లైట్ల ఏర్పాటు కూడా సక్రమంగా లేకపోవడంతో అంధకారంతో అవస్థలు పడుతున్నారు ఇక్కడి బస్టాండు కల్వకుర్తి లింగాల మరోవైపు నాగర్ కర్నూల్ అచ్చంపే

తాళ్లపల్లి వాగులో యువకుడు గల్లంతు సంఘటనా స్థలానికి చేరుకున్న జడ్పీ చైర్ పర్సన్

Submitted by veerareddy on Sat, 01/10/2022 - 13:09

తెలకపల్లి,సెప్టెంబర్ 30 (ప్రజాజ్యోతి):   తెలకపల్లి మండలం తాళ్లపల్లి గ్రామం వద్ద వాగులో శుక్రవారం గ్రామానికి చెందిన యువకుడు మామిళ్ళపల్లి రాఘవేందర్ గల్లంతయాడు ఉదయం పొలానికి వెళ్లి మధ్యాహ్నం ఇంటికి వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది గ్రామస్తులు సమాచారం ఇవ్వడంతో విషయం తెలిసిన జడ్పీ చైర్ పర్సన్ పద్మావతి బంగారయ్య ఎంపీపీ కొమ్ము మధు ఆర్డిఓ నాగలక్ష్మి సంఘటన స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు ఈ సందర్భంగా జడ్పీ చైర్ పర్సన్ పద్మావతి మాట్లాడుతూ రెస్కి టీమ్స్ ప్రయత్నాలు కొనసాగించాలని అవసరమైతే ఫిషరీస్ సహాయం తీసుకోమని అధికారులను ఆదేశించారు గల్లంతైన రాఘవేందర్ కోసం రిస్కీ టీమ్స్ ఎస్సై

వాగులో కొట్టుకుపోయిన యువ రైతు గల్లంతు ఘటన స్థలానికి చేరుకున్న జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్

Submitted by veerareddy on Sat, 01/10/2022 - 12:54

తెలకపల్లి, సెప్టెంబర్ 30 (ప్రజాజ్యోతి):  మండలంలోని తాళ్లపల్లి గ్రామానికి చెందిన యువరైతు మామిళ్ళపల్లి రాఘవేందర్ శుక్రవారం తాళ్లపల్లి గ్రామంలో ఉన్న వాగులో పడి గల్లంతయ్యాడు విషయం తెలుసుకున్న నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ జడ్పీ చైర్ పర్సన్ పద్మావతి ఎంపీపీ కొమ్ము మధు సింగిల్ విండో చైర్మన్ భాస్కర్ రెడ్డి సర్పంచ్ భాస్కర్ గౌడ్ మాజీ ఎంపీపీ బండ పర్వతాలు తదితరులు గల్లంతైన రైతు రాఘవేందర్ ఆచూకీ కోసం ముమ్మరంగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.

దుర్గామాతకు జడ్పీ చైర్ పర్సన్ పద్మావతి ప్రత్యేక పూజలు

Submitted by veerareddy on Fri, 30/09/2022 - 12:46

తెలకపల్లి, సెప్టెంబర్ 29 (ప్రజాజ్యోతి):  మండలంలోని పెద్దపల్లి గ్రామంలో ఆంజనేయ స్వామి గుడి వద్ద ఏర్పాటుచేసిన దుర్గామాతను గురువారం జడ్పీ చైర్పర్సన్ పద్మావతి బంగారయ్య దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా దుర్గామాతను ఏర్పాటు చేసిన యువకులను జడ్పీ చైర్ పర్సన్ అభినందించారు ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

బాధితునికి లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందించిన ఎమ్మెల్యే

Submitted by veerareddy on Thu, 29/09/2022 - 11:28

తెలకపల్లి,సెప్టెంబర్ 28(ప్రజాజ్యోతి):  మండలంలోని పెద్దూరు గ్రామానికి చెందిన వెంకటేష్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు మెరుగైన వైద్యం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన లక్ష రూపాయలను బుధవారం ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి చేతుల మీదుగా బాధిత కుటుంబానికి లక్ష రూపాయల ఎల్ఓసి అందజేశారు కార్యక్రమంలో టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బైకాని శ్రీనివాస్ యాదవ్ టిఆర్ఎస్ మండల అధ్యక్షులు ఈదుల నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.

కొండా లక్ష్మణ్ బాపూజీ సమాజానికి ఆదర్శం శివశంకర్

Submitted by veerareddy on Wed, 28/09/2022 - 10:41

తెలకపల్లి, సెప్టెంబర్ 27 (ప్రజాజ్యోతి):  తెలంగాణ ఉద్యమకారుడు కొండా లక్ష్మణ్ బాపూజీ సమాజానికి ఆదర్శప్రాయుడని బహుజన సమాజ్ పార్టీ కోఆర్డినేటర్ ఆర్ శివశంకర్ అన్నారు మంగళవారం తెలకపల్లి లో లక్ష్మణ్ బాపూజీ జయంతి నిర్వహించారు ఈ సందర్భంగా శివశంకర్ మాట్లాడుతూ లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ ఉద్యమం కోసం తన పదవిని త్యాగం చేసిన మహనీయుడని కొనియాడారు కార్యక్రమంలో రాజేష్ శివ మహేష్ వెంకటయ్య వంశీ లక్ష్మణ్ భాను ఈశ్వర్ ప్రసాద్ పాల్గొన్నారు.

ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక భావం కలిగి ఉండాలి ఎమ్మెల్సీ గోరటి వెంకన్న

Submitted by veerareddy on Wed, 28/09/2022 - 10:39

 తెలకపల్లి,సెప్టెంబర్ 27 (ప్రజాజ్యోతి): ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక భావం కలిగి ఉండాలని ఎమ్మెల్సీ గోరటి వెంకన్న అన్నారు మండలంలోని తన సొంత గ్రామం గౌరారంలో ఎమ్మెల్సీ గోరటి వెంకన్న తండ్రి యక్షగాన కళాకారుడు గోరటి నరసింహ ఆరాధన ఉత్సవం సోమవారం రాత్రి నిర్వహించారు ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేసి భజన కీర్తనలు నిర్వహించారు కార్యక్రమంలో గురువులు ఈశ్వరయ్య హనుమంత్ రెడ్డి బాలపేరు యాదగిరి ఆంజనేయులు కళాకారులు భక్తులు తదితరులు పాల్గొన్నారు.

నాగం హయాం లోనే దళితులపై దాడులు ఎంపీపీ కొమ్ము మధు

Submitted by veerareddy on Tue, 27/09/2022 - 13:08

తెలకపల్లి,సెప్టెంబర్ 26 (ప్రజాజ్యోతి):  దళితులపై దాడులు నాగం హయాంలోనే జరిగాయని ఎంపీపీ కొమ్ము మధు టిఆర్ఎస్ సీనియర్ నాయకులు బంగారయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు సోమవారం ఎంపీపీ కార్యాలయంలో వారు విలేకరుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు ఇటీవల మాజీ మంత్రి కాంగ్రెస్ నాయకులు నాగం జనార్దన్ రెడ్డి ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పై చేస్తున్న అసత్య ఆరోపణలు సమంజసం కాదన్నారు దళితులపై నాగం హయాంలోనే దాడులు జరిగాయి అని అన్నారు తాళ్లపల్లి కి చెందిన దళితుడు బుచ్చయ్య పై దాడి నాగం కుట్రతోనే జరిగిందని అన్నారు ఎన్నోపదవులు అనుభవించిన మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి ప్రజలకు చేసింది శూన్యం అని తెలిపారు సీ

ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి

Submitted by veerareddy on Tue, 27/09/2022 - 12:52

తెలకపల్లి, సెప్టెంబర్ 26 (ప్రజాజ్యోతి): మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలో తెలంగాణ వీర వనిత చాకలి  ఐలమ్మ 127 వ జయంతిని రజక వృత్తిదారుల సంఘం అధ్యక్షుడు పసుపుల రవి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీపీ కొమ్ము మధు రజక సంఘం అధ్యక్షులు రవి చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ చాకలి ఐలమ్మ భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరీ విముక్తి కోసం ఆమె చేసిన పోరాటాలను కొనియాడారు కార్యక్రమంలో ఎంపీటీసీ రమేష్ ఉప సర్పంచ్ కృష్ణ రజక సంగం గౌరవ అధ్యక్షులు భోగరాజు బక్కయ్య బీఎస్పీ కోఆర్డినేటర్ శివశంకర్ రజక సంగం సభ్యులు నడిపయ్య, అబ్బాస్ శివ రా