కరీంనగర్

యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారత్ జోడో పోస్టర్ ఆవిష్కరణ

Submitted by Mdrafiq on Sun, 04/09/2022 - 17:10

కరీంనగర్, సెప్టెంబర్ 4 (ప్రజాజ్యోతి) : కరీంనగర్ అసెంబ్లీ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు అబ్దుల్ రహమాన్ ఆధ్వర్యంలో నగరంలోని హైమద్ పుర చౌరస్తా లో ఆదివారం యూత్ జోడో బూత్ జోడో పోస్టర్ ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి మాజిద్ ఖాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అబ్దుల్ రెహమాన్ మాట్లాడుతూ రాహుల్ గాంధీ సెప్టెంబర్ 7 ప్రారంభమయే భారత్ జోడో యాత్రలో యువత, నిరుద్యోగులు ఎక్కువ సంఖ్యలో పాల్గొనాలని కోరారు.

రాజకీయ 'మాయ'లో యువత

Submitted by Mdrafiq on Sat, 03/09/2022 - 12:27
  • మందు, బిర్యానిలతో మభ్యపెట్టి 
  • యువకులను వాడుకుంటున్న నేతలు
  • నాయకులను నమ్మి వస్తున్న యువత
  • భవిష్యత్తుపై మాత్రం లేని భరోసా

మెట్ పల్లి, సెప్టెంబర్ 2 (ప్రజాజ్యోతి  ) : - పుట్టిన ప్రతి మనిషి జీవితంలో ఏదైనా సాధించాలంటే అతనికి యుక్త వయసు ఎంతో ప్రధానమైనది. జీవితంలో ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని దాన్ని సాధించడానికి చేసే కృషి యుక్తవయసులోనే చేయాల్సి ఉంటుంది. అయితే ఇటీవల కాలంలో రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు యువతను వినియోగించుకోవడానికి అవసరమైన అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.