నాగర్ కర్నూల్

సెప్టెంబర్ 17 న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి. బీజేపీ

Submitted by veerareddy on Thu, 15/09/2022 - 16:44

నాగర్ కర్నూల్ (ప్రజా జ్యోతి న్యూస్).నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ, BJYM, ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది.

ఆసుపత్రి కార్మికుల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలి.

Submitted by veerareddy on Thu, 15/09/2022 - 16:34

నాగర్ కర్నూల్ (ప్రజా జ్యోతి న్యూస్ ) నాగర్ కర్నూల్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి లో పనిచేస్తున్న శానిటేషన్ పేషంట్ కేర్ సెక్యూరిటీ సూపర్వైజర్ కార్మికులకు పెండింగ్లో ఉన్న నాలుగు నెలల వేతనాలను వెంటనే చెల్లించాలని తెలంగాణ మెడికల్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్(ఏఐటీయూసీ) ఉమ్మడి జిల్లా అధ్యక్షులు పి. సురేష్ డిమాండ్ చేశారు.

నూతన పార్లమెంటు భవానికి అంబేద్కర్ పేరు పెట్టాలి.

Submitted by Guguloth ravi on Wed, 14/09/2022 - 18:09
  • వంగుర్ జయశంకర్

నాగర్ కర్నూల్ (ప్రజా జ్యోతి న్యూస్ ) న్యూఢిల్లీలో నూతనంగా నిర్మించిన పార్లమెంట్ భవనానికి  భారత రాజ్యాంగం నిర్మాత నిర్మాత  బి.ఆర్ అంబేద్కర్ పేరును నామకరణం చేయాలని ఎమ్మార్పీఎస్ టీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వంగుర్ జయశంకర్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు కే. చంద్రశేఖర్ రావు అసెంబ్లీ లో ఏకగ్రీవ తీర్మానం చేయడం చరిత్రత్మకమని, పార్లమెంటు భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని తీర్మానం చేసిన  సీఎం కేసీఆర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్మెంట్ ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి. బీసీ పొలిటికల్ జేఏసీ.

Submitted by Ashok Kumar on Wed, 14/09/2022 - 09:56

నాగర్ కర్నూల్ (ప్రజా జ్యోతి న్యూస్ )సెప్టెంబర్ 13 ప్రజా జ్యోతి.  తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 8 సంవత్సరాలు కావస్తున్న సీఎం కేసీఆర్ విద్యార్థులకు స్కాలర్షిప్స్ ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడంలో విఫలం అవుతున్నారని. బంగారు తెలంగాణ అని నీళ్లు. నిధులు. నియామకాల కోసం 1200 వందల మంది ఉద్యమకారులు ఆత్మబలి దానాలు చేసుకొని తెచ్చుకున్న తెలంగాణలో కేజీ టు పీజీ విద్య అని దాన్ని గాలికి వదిలేశారు. చిన్న చిన్న ప్రైవేటు కళాశాలలు ప్రభుత్వం ఇచ్చే స్కాలర్షిప్ల పైన నడుస్తాయి. స్కాలర్షిప్లు ఇవ్వడంలో ప్రభుత్వ జాప్యం వల్ల ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు కళాశాలల బిల్డింగ్ రెంట్స్.

బీసీ బాలికల హాస్టల్ తనిఖీ చేసిన అధికారులు.

Submitted by sridhar on Tue, 13/09/2022 - 09:49
  • జ్వరంతో బాధపడుతున్న విద్యార్థులతో మాట్లాడుతున్న అధికారులు

అచ్చంపేట సెప్టెంబర్ 12 ప్రజా జ్యోతి ; బల్మూర్ బీసీ బాలికల వసతి గృహాన్ని కస్తూర్బా గాంధీ పాఠశాలను సోమవారం అధికారులు తనిఖీ చేశారు సందర్భంగా తహసిల్దార్  క్రిస్టియ నాయక్ ఎంపీడీవో దేవన్న సందర్శించి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు ప్రధానంగా బీసీ బాలికల వసతి గృహంలో చాలా రోజుల నుంచి విద్యార్థులు జ్వరాలతో బాధపడుతున్న మ్యాట్రిన్ పట్టించుకోవడంలేదని వచ్చిన ఫిర్యాదు మేరకు బీసీ బాలికల వసతి గృహాన్ని సందర్శించి వివిధ సమస్యల గురించి విద్యార్థులతో మాట్లాడటం జరిగిందని తాసిల్దార్ తెలిపారు.

వీఆర్ఏలను అరెస్టు చేయడం ఏమైనా చర్య

Submitted by sridhar on Sun, 11/09/2022 - 17:20

అచ్చంపేట సెప్టెంబర్ 11 ప్రజా జ్యోతి ; తమ సమస్యలను పరిష్కరించాలని 49 రోజుల నుంచి వీఆర్ఏలు నిర్వహిస్తున్న నిరవధిక సమ్మె లో భాగంగా శనివారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం పొట్లపల్లి గ్రామ వీఆర్ఏ వెంకటేశ్వర్లు మనస్థాపన చెంది ఆత్మహత్య చేసుకోవడం జరిగింది అతని అంతక్రియల కోసం వీఆర్ఏలు దహన సంస్కాలకు వెళ్తుండగా పోలీసులు ఎక్కడికి అక్కడ వీఆర్ఏలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు ఇందులో భాగంగా బల్మూరు నుంచి వీఆర్ఏలు మిర్యాలగూడ కు వెళుతుండగా పోలీసులు అరెస్టు చేశారని వీఆర్ఏలు తెలిపారు 49 రోజుల నుంచి నివాళిక సమ్మె చేపడితే ప్రభుత్వంలో ఎలాంటి చరణం లేదని వీఆర్ఏలు ఆవేదన వ్యక్తం చేస్తున

యువజన కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడిగా కొండల్ యాదవ్ నియామకం

Submitted by sridhar on Sat, 10/09/2022 - 18:34

కల్వకుర్తి సెప్టెంబర్ 10(ప్రజా జ్యోతి) ఏఐసిసి కార్యదర్శి,కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్ రెడ్డి ఆదేశాల మేరకు యువజన కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడిగా పోతేపల్లి గ్రామానికి చెందిన తగుళ్ళ కొండల్ యాదవ్ ను నియమిస్తూ శనివారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మోతిలాల్ నాయక్,కొండల్ యాదవ్ కు నియామక ఉత్తర్వులను అందజేశారు.

నిరుపేద కుటుంబానికి అండగా ఐక్యత ఫౌండేషన్ భరోసా

Submitted by sridhar on Sat, 10/09/2022 - 18:32

కల్వకుర్తి సెప్టెంబర్ 10 ప్రజా జ్యోతి
కల్వకుర్తి మండలం కూర్మిద్దా గ్రామానికి చెందిన  సంటి కృష్ణయ్యకు గత వారం రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు.నిరుపేద కుటుంబానికి చెందిన  కృష్ణయ్య కు ఆ గ్రామస్తుల ద్వారా ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయన వెంటనే స్పందించి  ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి గారు 5,000 రూపాయలను ఆర్థిక సహాయం చేశారు,ఈ కార్యక్రమంలో ఐక్యత ఫౌండేషన్ సభ్యులు గణేష్,హసన్,బాలరాజు, శ్రీను గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ

Submitted by sridhar on Sat, 10/09/2022 - 18:27
  • చాకలి ఐలమ్మ విగ్రహ కమిటీ కన్వీనర్ మొగిలి దుర్గాప్రసాద్
  •  ఘనంగా చాకలి ఐలమ్మ37 వర్ధంతి

కల్వకుర్తి సెప్టెంబర్ 10 ప్రజా జ్యోతి ;  చాకలి ఐలమ్మ విగ్రహ కమిటీ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ 37వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించడం  జరిగింది.

ఆధిపత్యానికి సింహ స్వప్నం ఐలమ్మ

Submitted by sridhar on Sat, 10/09/2022 - 17:39
  • జిల్లెల్ల గ్రామ సర్పంచ్ ఎముక జంగయ్య

కల్వకుర్తి సెప్టెంబర్ 10 ప్రజా జ్యోతి ; తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో జాగీర్దార్, జమిందార్, దేశ్ముకులకు చాకలి ఐలమ్మ ఓ సింహస్వప్నంగా నిలిచిందని జిల్లెల్ల గ్రామ సర్పంచ్ ఎముక జంగయ్య అన్నారు. జిల్లెల్ల గ్రామ రజక సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ 37వ వర్ధంతి వేడుకలను శనివారం గ్రామంలోని బస్టాండ్ వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ ఎముక జంగయ్య, ఉపసర్పంచ్ జి.రాజు, ఎంపిటిసి శోభాశేకర్ రెడ్డి, మాజీ ఉపసర్పంచ్ పి.ఎం పాండుగౌడ్ లు హాజరై ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి , నివాళులర్పించారు.