పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్మెంట్ ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి. బీసీ పొలిటికల్ జేఏసీ.

Submitted by Ashok Kumar on Wed, 14/09/2022 - 09:56
The state government should immediately release the pending scholarship fee reimbursement. BC Political JAC.

నాగర్ కర్నూల్ (ప్రజా జ్యోతి న్యూస్ )సెప్టెంబర్ 13 ప్రజా జ్యోతి.  తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 8 సంవత్సరాలు కావస్తున్న సీఎం కేసీఆర్ విద్యార్థులకు స్కాలర్షిప్స్ ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడంలో విఫలం అవుతున్నారని. బంగారు తెలంగాణ అని నీళ్లు. నిధులు. నియామకాల కోసం 1200 వందల మంది ఉద్యమకారులు ఆత్మబలి దానాలు చేసుకొని తెచ్చుకున్న తెలంగాణలో కేజీ టు పీజీ విద్య అని దాన్ని గాలికి వదిలేశారు. చిన్న చిన్న ప్రైవేటు కళాశాలలు ప్రభుత్వం ఇచ్చే స్కాలర్షిప్ల పైన నడుస్తాయి. స్కాలర్షిప్లు ఇవ్వడంలో ప్రభుత్వ జాప్యం వల్ల ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు కళాశాలల బిల్డింగ్ రెంట్స్. బోధన సిబ్బందికి జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో అయోమయంలో ఉన్నారని. దీని కారణంగా ఇంటర్మీడియట్ అయిపోయిన విద్యార్థులకు గాని డిగ్రీ అయిపోయిన విద్యార్థులకు గాని పై చదువులకు వెళ్ళుటకు గాని. ఉద్యోగాలు చేసుకోవడానికి గానీ సర్టిఫికెట్లు అవసరం అవుతాయి. కాబట్టి ప్రైవేట్ కళాశాలల యాజమాన్యం విద్యార్థులను ఫీజులు అడగాల్సిన సందర్భం నెలకొంటుంది అన్నారు. అటు విద్యార్థులకు. ఇటు కళాశాల యాజమాన్యాలకు ఇబ్బందులు ఎదురై ఎటు చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నారని అన్నారు. ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలైన వాటికి ప్రభుత్వం విద్య హక్కు చట్టానికి వ్యతిరేకంగా వారికి అండగా ఉండటంవల్ల వాళ్లు ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు.

ప్రభుత్వం ఇప్పటికైనా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని స్కాలర్షిప్స్ ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని లేని పక్షంలో బీసీ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో అసెంబ్లీనీ ముట్టడిస్తామని బీసీ పొలిటికల్ జేఏసీ నాగర్ కర్నూల్ జిల్లా కన్వీనర్ డి.అరవింద్ చారి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో శివకుమార్. ఆంజనేయులు. సునీల్. నరేందర్. గణేష్. వంశీ. అన్నామని. గాయత్రి. శిరీష. రహేళ. తేజ. నందిని. మహేశ్వరి. ఐశ్వర్య. వైశాలి. ఛార్మిక విద్యార్థి సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.