తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ

Submitted by sridhar on Sat, 10/09/2022 - 18:27
Chakali Ailamma was a Telangana armed fighter
  • చాకలి ఐలమ్మ విగ్రహ కమిటీ కన్వీనర్ మొగిలి దుర్గాప్రసాద్
  •  ఘనంగా చాకలి ఐలమ్మ37 వర్ధంతి

కల్వకుర్తి సెప్టెంబర్ 10 ప్రజా జ్యోతి ;  చాకలి ఐలమ్మ విగ్రహ కమిటీ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ 37వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించడం  జరిగింది. ఈ కార్యక్రమానికీ విగ్రహ కమిటీ కన్వీనర్ మొగిలి దుర్గాప్రసాద్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పలు పార్టీ, ప్రజా సంఘాల నాయకులు ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడుతూ  భూమికోసం, భుక్తి కోసం,వెట్టి చాకిరి విముక్తి కోసం, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ చేసిన పోరాట స్ఫూర్తి నేటి తరం మహిళలకు, యువతకు,ఆదర్శమని చాకలి ఐలమ్మ చేసిన భూ పోరాట స్ఫూర్తితో తెలంగాణ సాయుధ పోరాటానికి బీజాలు పడి 10 లక్షల ఎకరాల భూ పంపిణీకి నాంది పలికిందని, వేలాదిమంది వెట్టి చాకిరి నుంచి విముక్తి పొందారని ఐలమ్మ స్ఫూర్తి గొప్పదన్నారు.

ఇప్పుడున్న పరిస్థితులలో బడుగు బలహీన ఉద్యమకారుల చరిత్రలు లిఖించబడలేదని , ఎంతోమంది మేధావులు చరిత్రకారులు పరిశోధన చేసి , ఐలమ్మ కుటుంబ వారసుల,వారి సమకాలికుల సహకారంతో ఐలమ్మ జన్మించిన తేదీని (సద్దుల బతుకమ్మ నాడు1895 సంవత్సరం ) సెప్టెంబర్ 26 గా బాహ్య ప్రపంచానికి తెలిపారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఐలమ్మ యొక్క జయంతిని అధికారికంగా నిర్వహించడానికి ఉత్తర్వులు జారీ చేసింది తప్ప నిధులు మంజూరు చేసి కార్యక్రమ నిర్వహణ చేయడంలేదని ఎద్దేవా చేశారు,హైదరాబాదులో ట్యాంక్ బండ్ పై ఐలమ్మ కాంస్య విగ్రహాన్ని ప్రతిష్టించాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో జనగామ జిల్లాకు  ఐలమ్మ జిల్లాగా పేరు పెట్టాలని డిమాండ్ చేశారు తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయానికి చిట్యాల ఐలమ్మ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు, భావితరాలకు స్ఫూర్తిదాయకంగా ఐలమ్మ చరిత్రను ఇంటర్మీడియట్ ,డిగ్రీ స్థాయిలో ప్రవేశపెట్టాలని, పరిశోధనలు చేసే విద్యార్థులకు  చాకలి ఐలమ్మ పేరున చేసిన ప్రత్యేక ఫెలోషిప్ ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమానికి బీసీ సబ్ ప్లాన్ తాలూకా అధ్యక్షులు మేకల రాజేందర్, బృంగి ఆనంద్ కుమార్, కాయితి విజయ్ కుమార్ రెడ్డి, కానుగుల జంగయ్య,రాఘవేందర్ గౌడ్, సదానందం గౌడ్, బొజిరెడ్డి, గోపాల్, రమేష్ చారి, ఆంజనేయులు,శ్రీకాంత్ రెడ్డి, రవి గౌడ్, రజక సంఘం అధ్యక్షులు మొగిలి శ్రీనివాసులు, విజయ్, పర్వతాలు,రాజు,తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు*