నాగర్ కర్నూల్

ఓడిఫ్ గ్రామంగా పెద్దపల్లి. ఏపీమ్ నిరంజన్

Submitted by sridhar on Sat, 10/09/2022 - 16:00

నాగర్ కర్నూల్ (ప్రజా జ్యోతి న్యూస్ )
నాగర్ కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలఓ పెద్దపల్లి గ్రామపంచాయతీ గ్రామ సంఘం సమావేశానికి  ఏపీఎం నిరంజన్ హాజరై తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వివిధ పథకాల గురించి గ్రామ సంఘం సభ్యులకు వివరించారు.

చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి

Submitted by sridhar on Sat, 10/09/2022 - 15:36
  • ఎమ్మెల్యే గుర్క  జైపాల్ యాదవ్

కల్వకుర్తి సెప్టెంబర్ 9 ప్రజా జ్యోతి ; విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కోరారు. గెలుపు, ఓటములను సమానంగా స్వీకరించి క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని సూచించారు. విద్యాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని తెలిపారు.

ఐలమ్మ స్ఫూర్తి భూ పోరాటాలకు నిదర్శనం. సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొమ్ము భరత్

Submitted by sridhar on Sat, 10/09/2022 - 15:16

నాగర్ కర్నూల్ (ప్రజా జ్యోతి న్యూస్ )తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు భూమికోసం భుక్తి కోసం వ్యక్తి చాకిరి విముక్తి కోసం తెగించి పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ స్ఫూర్తితో భూ పోరాటాలు నిర్వహించాలని భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్ము భరత్ పిలుపునిచ్చారు.

భూ నిర్వాసితుల సమస్యలు పరిష్కరించేందుకు జిల్లా కలెక్టర్ చొరవ చూపాలి

Submitted by sridhar on Thu, 08/09/2022 - 10:19
  • రైతులు, అఖిల పక్ష ఐక్య కార్యాచరణ సమితి.

నాగర్ కర్నూల్ (ప్రజా జ్యోతి న్యూస్ ).ఉయ్యాలవాడ శివారులో నిర్మిస్తున్న మెడికల్ కళాశాల భూ నిర్వాసితులు నేడు మరోసారి తమ సమస్యలు పరిష్కరించాలని జిల్లా పరిపాలన అధికారి శ్రీనివాసులు కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో రైతులు మరియు అఖిల పక్ష ఐక్య కార్యాచరణ సమితి నేతలు మాట్లాడుతూ తేది 02-09-22 రోజు అఖిల పక్ష ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు మహాధర్నా కార్యక్రమం నిర్వహిస్తే, జిల్లా జాయింట్ కలెక్టర్ మనూ చౌదరి ధర్నా కార్యక్రమం విరామింప జేయడం జరిగింది.

అచ్చంపేట ప్రాంతంలో బిజెపి పార్టీ ప్రతిష్ఠతకు కృషి

Submitted by sridhar on Thu, 08/09/2022 - 09:49
  • అచ్చంపేట బిజెపి నాయకుడు శ్రీకాంత్ బీమా
  • చెన్నారంలో 50 మంది బిజెపిలో చేరిక

అచ్చంపేట సెప్టెంబరు 7 ప్రజా జ్యోతి ; అచ్చంపేట ప్రాంతంలో బిజెపి పార్టీని పటిష్టం చేసేందుకు కృషి చేయడం జరుగుతుందని అచ్చంపేట బిజెపి నాయకుడు శ్రీకాంత్ భీమా అన్నారు బుధవారం బల్మూరు మండలంలోని చెన్నారం గ్రామంలో మల్లేష్ యాదవ్ తో పాటు వివిధ పార్టీలకు చెందిన 50 మంది యువకులు శ్రీకాంత్ బీమా సమక్షంలో బిజెపి పార్టీలో చేరారు వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఉత్తమ ఉపాధ్యాయునికి ఘన సన్మానం

Submitted by narsimlu on Thu, 08/09/2022 - 09:43

అచ్చంపేట సెప్టెంబర్ 7 ప్రజా జ్యోతి ; ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎన్నికై జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు పొందిన బోడ రవీందర్ ను బుధవారం పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో శాలువా పూలమాలతో ఘనంగా సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం అధ్యక్షులు పులిజాల శ్రీనివాసులు ప్రధాన కార్యదర్శి కోట కిషోర్ ఉపాధ్యక్షులు సత్యనారాయణ సుధాకర్ మల్లికార్జున్ కృష్ణయ్య రమేష్ సంతోష్ లు పాల్గొన్నారు.

నేడు ఉర్కొండ మండలానికి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి రాక ఎంపీపీ రాధ

Submitted by md yusuf on Thu, 08/09/2022 - 09:33

ఉర్కొండ సెప్టెంబర్ 7(ప్రజా జ్యోతి) ; మండలంలోని వివిధ అభివృద్ధి పనులకు శంకస్థాపనలు అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన ఆసరా పించన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మాజీ మంత్రి జడ్చర్ల శాసన సభ్యులు చేర్లకొల లక్ష్మారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొననున్నారనీ ఎంపీపీ రాధ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 

బంగారు తెలంగాణ అని చెప్పి మద్యం తెలంగాణ గా మార్చిన నాయకుడు కేసీఆర్

Submitted by sridhar on Tue, 06/09/2022 - 10:51
  • వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల
  • కల్వకుర్తిలోప్రజా ప్రస్థానం పాదయాత్రలో వైఎస్ షర్మిల భారీ బహిరంగ సభ
  • వైయస్సార్ బిడ్డను దీవించండి వైఎస్ఆర్ సంక్షేమ పాలన తిరిగి తీసుకు వస్తా
  • సభ అనంతరం భారీ వర్షంలో పాదయాత్ర కొనసాగించిన వైయస్ షర్మిల

కల్వకుర్తి సెప్టెంబర్ 5 ప్రజా జ్యోతి ;  బంగారు తెలంగాణ అని చెప్పి మద్యం తెలంగాణగా మార్చిన వ్యక్తి కెసిఆర్ అని వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల అన్నారు ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా కల్వకుర్తి వైఎస్ఆర్ టీపీ కోఆర్డినేటర్ చీమర్ల అర్జున్ రెడ్డి ఆధ్వర్యంలో కల్వకుర్తి పట

అన్నింటిలోకెల్లా ఉపాధ్యాయ వృత్తి చాలా గొప్పది.

Submitted by sridhar on Tue, 06/09/2022 - 10:17
  • ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమంలో ఎమ్మెల్యే గువ్వల బాలరాజు.
  • ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి.

అచ్చంపేట సెప్టెంబర్ 5 ప్రజా జ్యోతి.; సమాజంలో అన్నిటికంటే ఉపాధ్యాయ వృత్తి చాలా గొప్పదని తల్లి తండ్రి గురువు దైవం మూడింటిలో కంటే కూడా గురువు చాలా గొప్పవాడని ప్రభుత్వ విపు అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు సోమవారం అచ్చంపేట పట్టణంలోని అంగిరేకుల ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవం లో భాగంగా ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ సన్మాన కార్యక్రమం నియోజకవర్గస్థాయిలో 100 మంది ఉపాధ్యాయులకు ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సన్మానం

కొండనాగుల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేరాలని అధ్యాపకుల ప్రచారం.

Submitted by sridhar on Mon, 05/09/2022 - 16:18

అచ్చంపేట సెప్టెంబర్ 5 ప్రజా జ్యోతి. బల్మూరు మండలంలోని కొండనాగుల ప్రభుత్వ ఉమామహేశ్వరి డిగ్రీ కళాశాలలో దోస్తు మూడో విడత కౌన్సిలింగ్ లో భాగంగా విద్యార్థులు డిగ్రీ కళాశాలలో చేరాలని ఆ కళాశాల అధ్యాపకులు కరపత్రాలతో బల్మూరు మండలంలోని వివిధ గ్రామాలలో తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు కొండనాగుల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అన్ని వసతులు అధ్యాపక బృందం తోపాటు అన్ని సౌకర్యాలు ఉన్నాయ ని పేద విద్యార్థులు ప్రభుత్వ డిగ్రీ కాలేజీ లో చేరాలని అధ్యాపకులు సూచించారు ఈ కార్యక్రమంలో అధ్యాపకులు పరంగి రవి జాన్ బాబు లక్ష్మణ్ గౌడ్ చంద్రకాంత్ తదితరులు ఉన్నారు.