ఆసుపత్రి కార్మికుల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలి.

Submitted by veerareddy on Thu, 15/09/2022 - 16:34
Pending salaries of hospital workers should be paid immediately.

నాగర్ కర్నూల్ (ప్రజా జ్యోతి న్యూస్ ) నాగర్ కర్నూల్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి లో పనిచేస్తున్న శానిటేషన్ పేషంట్ కేర్ సెక్యూరిటీ సూపర్వైజర్ కార్మికులకు పెండింగ్లో ఉన్న నాలుగు నెలల వేతనాలను వెంటనే చెల్లించాలని తెలంగాణ మెడికల్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్(ఏఐటీయూసీ) ఉమ్మడి జిల్లా అధ్యక్షులు పి. సురేష్ డిమాండ్ చేశారు. గురువారం తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్(ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో కార్మికుల నాలుగు నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలని, కోర్టులో పెండింగ్లో ఉన్న టెండర్ కి సంబంధం లేకుండా కార్మికులకు ప్రభుత్వం పెంచిన కొత్త వేతనాలు అమలు చేయాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఎస్ఎస్సి ఏజెన్సీ కాంట్రాక్టర్ పై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నాగర్ కర్నూల్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ రఘుకు వినతి పత్రాన్ని ఇచ్చారు అనంతరం జిల్లా కలెక్టర్ పరిపాలన అధికారికి కూడా వినతి పత్రాన్ని అందచేశారు ఈ సందర్భంగా పి. సురేష్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా కొత్త టెండర్లు పూర్తిచేసుకుని ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం పెంచిన కొత్త వేతనాలు అమలై మూడు నెలలు దాటుతున్న నాగర్ కర్నూల్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో మాత్రం అమలుకు దోచుకోకపోవడం బాధాకరమని అన్నారు. ఆసుపత్రిలో దాదాపునాలుగునెలలనుండికార్మికులకువేతనాలుచెల్లించకుండాఏజెన్సీకాంట్రాక్టర్నిర్లక్ష్యంగావ్యవహరిస్తూకార్మికులజీవితాలతోచెలగాటమాడుతున్నారనిఆరోపించారు. కార్మికులు మహిళా సంఘాల పొదుపు అప్పులు, ఇంటి అద్దెలు నెలవారి ఈఎంఐలు స్కూల్ ఫీజులు లాంటివి చెల్లించలేక అవమానాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వ బడ్జెట్లో సంబంధం లేకుండా ఏజెన్సీ కాంట్రాక్టర్ అడ్వాన్స్ గా మూడు నెలల వేతనాలు చెల్లించాలని టెండర్ అగ్రిమెంటులో ఉన్న యువకులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ముందే చాలీచాలని వేతనాలు నెలల తరబడి వేతనాలు పెండింగ్లో ఉంచితే కార్మికుల బతుకు ఎలాగని ప్రశ్నించారు. వేతనాలు లేక ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తులతో అప్పులు తెచ్చుకొని దినదిన గండంగా బతుకుతున్నారని వీరి జీతం అప్పుల మిత్తికి కూడా సరిపోవడం లేదని అన్నారు. కావున పెండింగ్లో ఉన్న వేతనాలు తక్షణమే చెల్లించాలని కోరగా సూపరిండెంట్ రెండు రోజుల్లో వేతనాలు అందించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మధు గౌడ్, మోహన్ నాయక్, రవిలతో పాటు ఆస్పత్రి కార్మికులు పాల్గొన్నారు తదితరులు పాల్గొన్నారు.