గూడూర్

పార్టీ బలోపేతానికి కృషి చేస్తా గూడూరు మండల యూత్ నూతన అధ్యక్షుడు మధు

Submitted by veerareddy on Mon, 03/10/2022 - 12:35

 గూడూరు అక్టోబర్ 02 (ప్రజా జ్యోతి):    కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అన్ని విధాలా కృషి చేస్తానని గూడూరు మండలం నూతనంగా ఎన్నికైన యూత్ అధ్యక్షుడు మధు అన్నారు. గూడూరు మండలంలోని పొనుగోడు గ్రామానికి చెందిన బొల్లికొండ మధును రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కంకర అయ్యప్ప రెడ్డి నియమించినట్లు తెలిపారు.

ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

Submitted by veerareddy on Mon, 03/10/2022 - 12:28

 గూడూరు అక్టోబర్ 02 (ప్రజా జ్యోతి):  మహబూబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయంలో తాసిల్దార్ కార్యాలయంలో గాంధీజీ చిత్రపటానికి తాసిల్దార్ అశోక్ కుమార్ పూలమాలసి ఘనంగా వేడుకలు జరిపారు గూడూరు గాంధీ సెంటర్లో గాంధీ జయంతి సందర్భంగా ఆర్యవైశ్య సంఘం బిజెపి పార్టీ నాయకులు టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి నాయకులు అనంతరం మాట్లాడారు.

దేవీ నవరాత్రుల్లో పెద్ద ఎత్తున అన్నదానం

Submitted by veerareddy on Sat, 01/10/2022 - 12:29

గూడూరు సెప్టెంబర్ 30 (ప్రజా జ్యోతి) ./....గూడూరు మండలం మండల కేంద్రంలోని  దుర్గా బేకరీ వద్ద ఏర్పాటుచేసిన దేవీ నవరాత్రి ఉత్సవాల సందర్భంలో శుక్రవారం రోజున అన్నపూర్ణేశ్వరి  అవతారంలో కొలువు తీరినారు.  మహిళలు పెద్ద ఎత్తున కుంకుమ పూజలు చేసి మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని రాత్రి వేళలో కోలాటాలు బతుకమ్మ పాటలతో అంగరంగ వైభవంగా జరుగుతున్నది పూజలు అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది  ఈ పూజా కార్యక్రమంలో  (స్వాములు) హరీష్, వీరన్న రాము స్వాములు  ఈ పూజలో అధిక సంఖ్యలో భక్తులు కూడా పాల్గొన్నారు. తదనంతర వెయ్యి మందికి కూడా మహా అన్నదానం నిర్వహించారు.

వెంగంపేట తెరాస గ్రామ పార్టీ నూతన అధ్యక్షులుగా బొడ్డు సూర్యనారాయణ

Submitted by veerareddy on Fri, 30/09/2022 - 14:54

గూడూరు   సెప్టెంబర్ 29 (ప్రజా జ్యోతి):  వెంగంపేట తెరాస గ్రామ పార్టీ నూతన అధ్యక్షులుగా  ఆయుర్వేద వైద్యుడు బొడ్డు సూర్యనారాయణ ని తెరాస గ్రామ నాయకులు, కార్యకర్తలు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈసమావేశంలో గ్రామసర్పంచ్ కట్లభవానివిష్ణు, ఉపసర్పంచ్ బొమ్మగాని దుర్గయ్య  గ్రామ పెద్దలు కుందూరు శోభన్ రెడ్డి, ఆదొండా సాయిలు, లింగయ్య,వెంకట్ రెడ్డి, రాఘవరెడ్డిగంధం వెంకన్న,యాదగిరి రాజాలు , గుగులోత్ వెంకన్న,ఆదొండా యకస్వామి, దేశ్య, మోహన్, రమేష్, చిరంజీవి, శ్రీనివాస్, రాజు,బద్దుల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో క్షయ వ్యాధిగ్రస్తులకు న్యూట్రిషన్ ఫుడ్ అందజేత

Submitted by veerareddy on Fri, 30/09/2022 - 14:34

గూడూరు  సెప్టెంబర్ 29 (ప్రజా జ్యోతి): క్షయ వ్యాధితో బాధపడుతున్న బాధితులకు రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో గురువారం న్యూట్రిషన్ ఫుడ్ ను అందజేయడం జరిగింది.

హడ్ హాక్ కమిటీ మండల కన్వీనర్ గా ముత్యం లక్మి నారాయణ

Submitted by veerareddy on Wed, 28/09/2022 - 12:39

గూడూరు  సెప్టెంబర్ 27 (ప్రజా జ్యోతి):  తెలంగాణ మాల పోరాట సమితి(టిఎంపిఎస్)గూడూరు మండల హడ్ హాక్ కమిటీని ఏక గ్రీవంగా ఎన్నుకున్నట్లు మాల పోరాట సమితి వ్యవస్థాపక, రాష్ట్ర అధ్యక్షులు పెరమాండ్ల వెంకటేశ్వర్లు తెలిపారు. మంగళవారం గూడూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన తెలంగాణ మాల పోరాట సమితి సంఘం సమావేశానికి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. అనంతరం గూడూరు మండల టిఎంపి ఎస్ హడ్ హాక్ కమిటీని నియమించారు.

అభివృద్ధి చూసి ఓర్వలేక నే కాంగ్రెస్ నాయకులు తెరాసపై బురద జల్లుతున్నారు తెరాస గూడూరు టౌన్ అధ్యక్షుడు చీదురు వెంకన్న

Submitted by veerareddy on Fri, 23/09/2022 - 14:12

గూడూరు  సెప్టెంబర్ 22 (ప్రజా జ్యోతి): అభివృద్ధిని చూసి ఓర్వలేకనే కొందరు కాంగ్రెస్ నాయకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై తెరాస పార్టీ పై విమర్శలు చేస్తున్నారని ప్రజలు అన్ని గమనిస్తారని టిఆర్ఎస్ గూడూరు టౌన్ అధ్యక్షుడు చీదురు వెంకన్న గుండెంగ ఎంపీటీసీ బోడ కిషన్ నాయక్ రామన్న నాయక్ అన్నారు. బుధవారం గూడూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తుంటే దాన్ని చూసి ఓర్వలేని కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.