అభివృద్ధి చూసి ఓర్వలేక నే కాంగ్రెస్ నాయకులు తెరాసపై బురద జల్లుతున్నారు తెరాస గూడూరు టౌన్ అధ్యక్షుడు చీదురు వెంకన్న

Submitted by veerareddy on Fri, 23/09/2022 - 14:12
 Unable to bear seeing the development, the Congress leaders are throwing mud at Teresa  Cheeduru Venkanna is the President of Teresa Guduru Town

గూడూరు  సెప్టెంబర్ 22 (ప్రజా జ్యోతి): అభివృద్ధిని చూసి ఓర్వలేకనే కొందరు కాంగ్రెస్ నాయకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై తెరాస పార్టీ పై విమర్శలు చేస్తున్నారని ప్రజలు అన్ని గమనిస్తారని టిఆర్ఎస్ గూడూరు టౌన్ అధ్యక్షుడు చీదురు వెంకన్న గుండెంగ ఎంపీటీసీ బోడ కిషన్ నాయక్ రామన్న నాయక్ అన్నారు. బుధవారం గూడూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తుంటే దాన్ని చూసి ఓర్వలేని కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంత మందికి పెన్షన్లు ఇచ్చారని నేడు 50 లక్షల మందికి పెన్షన్లు వస్తున్నాయంటే అది కేవలం కేసీఆర్  ఘనత మాత్రమే అని అన్నారు. దళితులు ఆర్థికంగా ఎదగాలని ఉద్దేశంతో దళిత బంద్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి 10 లక్షల రూపాయలు ఇస్తుంటే అది కనిపించని కాంగ్రెస్ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే తెరాస కార్యకర్తలకే దళిత బందు ఇస్తున్నారని  తప్పుడు స్టేట్మెంట్లు ఇస్తున్నారని అన్నారు. గిరిజనులు ఎన్ని రోజుల్లో కోరుతున్న 10 శాతం రిజర్వేషన్లు సీఎం కేసీఆర్ అమలు చేస్తే దానిని కూడా సమర్ధించి స్వాగతించాల్సి పోయి  దాని విషయంలో కూడా రాజకీయం చేస్తున్నారని దళితులు గిరిజనులు అభివృద్ధి చెందడం కాంగ్రెస్ పార్టీకే ఇష్టం లేనట్టుంది అని ఆయన అన్నారు.

ప్రజలకు తెలుసని ఎవరు ఎలాంటి అభివృద్ధి చేస్తున్నారో ఎనిమిది సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రంలో ఎంత అభివృద్ధి జరిగిందో దానిని చూసి ప్రజలు ఓటు వేస్తారని చెప్పారు ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు మా నాయకుడు కేసీఆర్ పైన తెరాస పార్టీ పైన ఎలాంటి విమర్శలు చేసిన ఊరుకునేది లేదని హెచ్చరించారు. గిరిజనుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారు అంటూ కాంగ్రెస్ నాయకులు చేసిన విమర్శలకు కెసిఆర్ లాంటి పెద్ద మనిషి ముందు ఆశీర్వాదం తీసుకోవడం తప్పు కాదని దాన్ని కూడా రాజకీయం చేసి విమర్శలు చేస్తున్నారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో తెరాస పార్టీ నాయకులు భూక్య సురేష్  కటార్ సింగ్ నాయకులు పాల్గొన్నారు పాల్గొన్నారు.