జీవో ఇవ్వకుంటే సమ్మె మరింత ఉధృతం

Submitted by veerareddy on Thu, 22/09/2022 - 12:39
If Jivo is not given, the strike will escalate

చర్చలతో కాలయాపన చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం

59వ రోజుకు చేరిన వీఆర్ఏల సమ్మె

గూడూరు  సెప్టెంబర్ 21 (ప్రజా జ్యోతి): వీఆర్ఏ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తున్న ట్లు జీవో వెంటనే జారీ చేయాలని లేకుంటే సమ్మెను మరింత ఉధృతం చేస్తామని తెలంగాణ వీఆర్ఏల జేఏసీ రాష్ట్ర ప్రభుత్వాన్ని బుధవారం హెచ్చరించింది. వి ఆర్ జె సి పిలుపుమేరకు చేస్తున్న సమ్మె గూడూరు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు 59వ రోజుకు చేరింది ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ విఆర్ఏల నిరవధిక సమ్మెలో భాగంగా 13 వ తేదీన విఆర్ఏల అసెంబ్లీ ముట్టడి చేస్తుండగా  రాష్ట్ర మంత్రి  కేటీఆర్ పిలిచి చర్చలు జరుపగా 18 వ తేదీ వరకు సమయం ఇవ్వండి 20 వ తేదీ వరకు మళ్ళి చర్చ జరిపి మీకు జీవో  ముఖ్యమంత్రి చే విడుదల చేయిస్తానని చెప్పి నిన్న జరిగిన చర్చలో  జీవో ఇవ్వకుండా నన్ను  నమ్మండి అని చెప్పి మీ సమస్యలను పరిష్కరిస్తాము ప్రభుత్వం వీఆర్ఏ లు వేరు కాదు అని చెప్పడం కాదు వెంటనే జీవో విడుదల చేయాలని లేనివెడల ఇలానే సమ్మె కొనసాగిస్తాం అన్నారు. అవసరం అయితే ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసి ప్రగతి భవన్ ముట్టడి లేదా ముఖ్యమంత్రి ఫామ్ హౌజ్ ను కూడా ముట్టడి చేస్తాం లేదా అవసరం అయితే ఆమరణ నిరాహార దీక్ష హైదరాబాద్ ఇందిర పార్క్ వద్ద 23000 మంది వీఆర్ఏలు చేయడానికి వెనుకాడంమని ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగినది. ఇచ్చిన హామీలను వెంటలే జీవో రూపంలో విడుదల చేయాలని కోరుతున్నారు.