జోగులాంభ గద్వాల్

నేషనల్ క్రైమ్ ఇన్ఫర్మేషన్ గుర్తింపు కార్డును విడుదల చేసిన న్యాయవాది

Submitted by Tirumalashetty… on Tue, 13/09/2022 - 19:57

గద్వాల: ప్రజా జ్యోతి ప్రతినిధి:- నేషనల్ క్రైమ్ ఇన్ఫర్మేషన్ బ్యూరోగా జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన కాశపోగు జాన్ నియమితులయ్యారు. ఇందుకు సంబంధించిన గుర్తింపు కార్డును మంగళవారం న్యాయవాది సురేష్ మహరాజ్ ఆవిష్కరించి అందజేశారు. ఈ సందర్భంగా జాన్ ని పూలమాల శాలువాలతో సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు సుగంధర్ నాథ్, తిరుమల్, ఖాజావలి, కృష్ణ,  లవకుశ, రాజు తదితరులు పాల్గొన్నారు.

శాంతిభద్రతలకు సంబంధించిన సమస్యల పరిష్కారానికై పోలీసు శాఖ పూర్తిస్థాయిలో కృషి చేస్తుంది

Submitted by sridhar on Tue, 13/09/2022 - 10:06

గద్వాల ప్రతినిది (ప్రజాజ్యోతి) సెప్టెంబర్ 12 : సోమవారం నాడు  జిల్లా పోలీస్  కార్యాలయంలో ప్రజల ఫిర్యాదులను జిల్లా ఎస్పీ జె. రంజన్ రతన్ కుమార్ స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయా పోలీసు స్టేషన్ల అధికారులతో మాట్లాడుతూ, పోలీసు పరిధిలోని ప్రతి అంశాన్ని పరిష్కరించడంలో వేగంగా చర్యలు తీసుకోవాలని ఎస్.పి.  ఆదేశించారు. మహిళలు ఇతరుల చేత ఎలాంటి వేధింపులకు గురైన వెంటనే పోలీస్ వారిని సంప్రదించాలని కోరారు. అలాగే సివిల్ వివాదాలను  పిర్యాదు దారులు కోర్టు లలో పరిష్కరించుకోవాలని, సివిల్ వివాదాలు స్వీకరించబడువు అనే విషయాలను పిర్యాదు దారులు గ్రహించాలని అన్నారు. 

మండల స్థాయి సైన్స్ సెమినార్

Submitted by sridhar on Tue, 13/09/2022 - 10:02

గద్వాల ప్రతినిది (ప్రజాజ్యోతి) సెప్టెంబర్ 12 : మల్దకల్  మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సోమవారం "సుస్థిర అభివృద్ధి కోసం ప్రాథమిక విజ్ఞాన శాస్త్రాలు సవాళ్లు అవకాశాలు"   అనే అంశంపై జరిగిన మండల స్థాయి సైన్స్ సెమినార్ నిర్వహించారు.ఈ సెమినార్ లో ఎల్కూరు, బిజ్వారం విఠలాపురం,కుర్తి రావులచెరువు,పాల్వాయి, కస్తూర్బా గాంధీ విద్యాలయం, మద్దెలబండ,అమరవాయి,జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాఠశాల నుండి విద్యార్థులు పాల్గొన్నారు.

ప్రజావాణి ద్వారా రైతుల నుండి వచ్చే భూ సమస్యలు వెంటనే పరిష్కరించాలి

Submitted by sridhar on Tue, 13/09/2022 - 09:58

గద్వాల ప్రతినిది (ప్రజాజ్యోతి) సెప్టెంబర్ 12 : ప్రజావాణి ద్వారా  రైతుల నుండి వచ్చే భూ సమస్యలను వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్ని మండలాల తహసీల్దార్లకు  ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశం హాలు నుండి  అన్ని మండలాల తహసీల్దార్లుతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

పలువురికి ప్రగాఢ సానుభూతి తెలిపిన ఎమ్మెల్యే అబ్రహం

Submitted by sridhar on Sat, 10/09/2022 - 16:06

 అలంపూర్: సెప్టెంబర్ 10(ప్రజా జ్యోతి) ఐజ మండలం తూముకుంట గ్రామంలో ఐజ మండల  టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ రఘునాథ్ రెడ్డి  మామ  అయిన శ్రీ విష్ణువర్ధన్ రెడ్డి  (వయసు83) ఈ రోజు ఉదయం అనారోగ్యంతో మరణించడం జరిగింది విషయం తెలుసుకున్న అలంపూర్ శాసన సభ్యులు ఎమ్మెల్యే అబ్రహం  వారి ఇంటికి వెళ్ళి వారి భౌతిక కాయాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు

పీజీ కళాశాల అకాడమిక్ బ్లాక్ భవనానికి భూమి పూజ చేసిన ఎమ్మేల్యే

Submitted by Ashok Kumar on Thu, 08/09/2022 - 15:23

గద్వాల ప్రతినిది (ప్రజాజ్యోతి) సెప్టెంబర్ 08 :  గద్వాల జిల్లా కేంద్రంలోని  నది అగ్రహారం సమీపంలో పీజీ కళాశాల  ఆవరణలో గురువారం రూ.10.50 కోట్లతో నిర్మించే కళాశాల నూతన అకాడమిక్ బ్లాక్ భవనానికి శంకుస్థాపన చేయడం జరిగింది. ముఖ్యఅతిథిగా గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి భూమి పూజ చేసి పనులు ప్రారంభించడం జరిగినది.భవన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్ , ఆదేశించారు.

అంగన్వాడి పిల్లలకు, గర్భిణీలకు, బాలింతలకు పౌష్టిక ఆహారం తప్పనిసరి: సర్పంచ్

Submitted by Thirumal on Wed, 07/09/2022 - 17:23

గద్వాల్: ప్రజాజ్యోతి ప్రతినిధి:-జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం పెద్దతండ గ్రామపంచాయతీ అంగన్వాడి సెంటర్లో గర్భిణీ స్త్రీలు మరియు   పోషణ లోపం ఉన్న పిల్లల తల్లిదండ్రులు పోషణ మాసం సందర్భంగా కమిటీ ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ తాన్య నాయక్  మాట్లాడుతూ...

సంగాల చెరువులో చేప పిల్లలను వదిలిన జెడ్పి చైర్ పర్సన్,ఎమ్మెల్యే

Submitted by sridhar on Mon, 05/09/2022 - 14:58

గద్వాల ప్రతినిది (ప్రజాజ్యోతి) సెప్టెంబర్ 05: గద్వాల నియోజకవర్గ పరిధిలోని సంగాల చెరువులో 2022-2023 సంవత్సరమునకు 100 శాతం రాయితీతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ ఆదేశాల మేరకు చేప పిల్లల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా జోగులాంబ గద్వాల జిల్లా జెడ్పి చైర్ పర్సన్ సరితమ్మ, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హాజరై సంగాల చెరువులో  మత్స్యకారులతో కలిసి చేప పిల్లలను వదిలారు.