అంగన్వాడీ కేంద్రంలో పోషణ మాసం గురించి అవగాహన సదస్సు

Submitted by Thirumal on Wed, 07/09/2022 - 16:23
Awareness session about Nutrition Month at Anganwadi Centre


గద్వాల్: ప్రజాజ్యోతి ప్రతినిధి:-  జోగులాంబ గద్వాల జిల్లామనపాడు ప్రాజెక్టు ఇటిక్యాల సెక్టర్ ఇటిక్యాల మండలం పరిధిలోనిచాగాపురం గ్రామంలోని అంగన్వాడి కేంద్రంలలో పోషణ మాసం సందర్భంగా అంగన్వాడి రెండవ సెంటర్ మరియు నాల్గవ సెంటర్ లలో  తల్లులకు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సందర్భంగా ఏఎన్ఎం విద్యావతి మాట్లాడుతూ... గర్భిణీ స్త్రీలు మంచి పౌష్టిక ఆహారం పండ్లు ఆకుకూరలు కూరగాయలు పాలు  గుడ్లు మాంసం చేపలు ఎక్కువగా తీసుకోవాలని తెలియజేశారు, దాని వలన రక్తహీనత లేకుండా సుఖప్రసవము జరుగుతుందని తెలియజేశారు, బరువు తక్కువ పిల్లలు పుట్టడం వలన వారికి ఎలాంటి అనారోగ్యం వచ్చిన తొందరగా కోలుకోలేరని పూర్తి అనారోగ్యానికి గురి అవుతారని తెలియజేశారు,అలాగే శ్యాంమ్యాం పై అవగాహన కల్పించడం జరిగింది. శ్యాంమ్యాం మరియు బరువు తక్కువ పిల్లలకు అంగన్వాడి కేంద్రంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు, వారికి అదనంగా ఒక గుడ్డు 100 ఎంఎల్ పాలు బాలామృతం ప్లస్ ఇస్తున్నారు, కావున ప్రతినెల పిల్లల బరువులు తీయించుకొని వారి గ్రోత్ ను తెలుసుకోవాలని తల్లులకు తెలియజేశారు. అలాగే పోషణ మాసం సందర్భంగా పోషణ మాసం ప్రతిజ్ఞ, గ్రామంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో వెంకటన్న పంచాయతీ కార్యదర్శి సురేంద్ర, ఏఎన్ఎం లు విద్యావతి, లక్ష్మి, అంగన్వాడీ టీచర్లు భాగ్యమ్మ, రాఘవేంద్రమ్మ
ఆశా కార్యకర్తలు పద్మ, రేణుక, హేమలత, ఈదమ్మ, గర్భవతులు, బాలింతలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.