రైతుల వ్యవసాయ పొలాలలో విద్యుత్ మోటార్ లను దొంగిలించిన ముఠాను పట్టుకున్న కెటి దొడ్డి పోలీసులు

Submitted by Ashok Kumar on Thu, 08/09/2022 - 15:20
KT Doddi police caught a gang that stole electric motors from farmers' agricultural fields

నిందితుల నుండి 9 విద్యుత్ మోటార్లు,3బైక్ లు,6 సెల్ ఫోన్ లు స్వాధీనం

గద్వాల ప్రతినిది (ప్రజాజ్యోతి) సెప్టెంబర్ 08 : గత కొన్ని రోజులుగా కెటి దొడ్డి మండలo పలు గ్రామాలపరిధిలోని రైతుల వ్యవసాయ పొలాలలో రాత్రి సమయాలలో  గుర్తు తెలియని వ్యక్తులు విద్యుత్ మోటర్లను దొంగలిస్తున్న విషయం పోలీస్ ల దృష్టికి రాగ వారి పై నిఘా ఉంచిన  కెటి దొడ్డి పోలీసులు దొంగల ముఠా ను  ఎట్టకేలకు పట్టుకొని వారి నుండి 9 విద్యుత్ మోటార్లు, 3బైక్ లు,6 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని 5 గురు నిందితులను, వారికి సహకరిస్తున్న మెకానిక్ రఫీ ను రిమాండ్ కు తరలించడం జరిగింది.వివరాలు : బుధవారం సాయంత్రం సుమారు 04:00 గంటల సమయంలో నమ్మదగిన సమాచారం మేరకు ఎస్ ఐ మరియు సిబ్బంది పోలీస్ స్టేషన్ ముందర వెహికల్ చెకింగ్ చేస్తుండగా, గువ్వలదీన్నే కు చెందిన, ఉరుకుందు, కృష్ణమోహన్ రెడ్డి, రాఘవేంద్ర మరియు కర్నాటక రాష్ట్రం వడ్లం దొడ్డి కి చెందిన విక్రమసింహ రెడ్డి, హోనప్ప @ వన్నప్ప లు 5 మంది కలిసి 3 మోటార్ సైకిళ్ళ పై అనుమానస్పదంగా ఉండడంతో వీరిని, పోలీసులు పట్టుకొని విచారించగా గత కొన్ని నెలల నుంచి చుట్టూ పక్కల గ్రామాలలో మరియు కర్నాటక రాష్ట్రం లోని యాపల్దీన్నే పరిధి లో రాత్రిపూట మోటార్ దొంగతనాలకు పాల్పడుతూ ఉంటారు. అయితే వీరు పగటి సమయంలో పొలాల్లో, కాలువల పై చూసుకొని, రాత్రిపూట వారు బైక్ లను తీసుకొని వెళ్ళి, లైట్ లను ఆర్పుకోని వాటిపై మోటార్ లను ఎత్తుకొచ్చి, నందీన్నే లోని రఫీ అనే వ్యక్తికి  అమ్మేవారు.

రఫీ ని పట్టుకొని విచారించగా, రఫీ తాను కొన్న దొంగ మోటర్లును పాత ఇనుప సామానులు వ్యాపారం చేసే హైదరాబాద్ కు చెందిన ఇర్ఫాన్ కు అమ్మేవాడని గుర్తించారు, తన దగ్గర ఉన్నమిగతా 9 మోటర్లు తన షాప్ లో నుంచి తెచ్చి చూయించగా, పోలీసు వారు 9 మోటార్లను, 3 బైక్లను 6 సెల్ ఫోన్ లను స్వాదినపర్చుకుని, దొంగతనాలు చేస్తున్న 5 గురు నిందితులను, మోటర్లను  కొంటున్న మెకానిక్ షాప్ రఫీని గురువారం  రిమాండ్ కు తరలించనైనది. ప్రస్తుతం హైదరాబాద్ కు చెందిన ఇర్ఫాన్ పరారీ లో ఉన్నాడు. ఈ కేసును ఛేదించడం లో సిబ్భంది తిప్పన్న, హజిబాషా, జ్యోతికాంత్ లు పాల్గొన్నారు.