అంగన్వాడి పిల్లలకు, గర్భిణీలకు, బాలింతలకు పౌష్టిక ఆహారం తప్పనిసరి: సర్పంచ్

Submitted by Thirumal on Wed, 07/09/2022 - 17:23
Nutritious food must be given to Anganwadi children, pregnant and lactating women: Sarpanch

గద్వాల్: ప్రజాజ్యోతి ప్రతినిధి:-జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం పెద్దతండ గ్రామపంచాయతీ అంగన్వాడి సెంటర్లో గర్భిణీ స్త్రీలు మరియు   పోషణ లోపం ఉన్న పిల్లల తల్లిదండ్రులు పోషణ మాసం సందర్భంగా కమిటీ ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ తాన్య నాయక్  మాట్లాడుతూ...
రాష్ట్ర ప్రభుత్వం పోషణ అభియాన్ సెప్టెంబర్ 1 నుండి 30 వరకు నిర్వహిస్తున్నదని, ఇందులో గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారాన్ని అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్నదని తెలిపారు, గ్రామంలో గర్భిణీలకు, బాలింతలకు తృణధాన్యాలు, ఆకుకూరలాంటి పౌష్టికాహారం అందజేయాలన్నారు, బరువు తక్కువ ఉన్న పిల్లలను గుర్తించి సరైన పౌష్టికాహారం అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు, తీవ్ర లోపం, అతి త్రీవ లోపం క్రింద గుర్తించిన  పిల్లలకు తప్పని సరిగా బాలామృతం ప్లస్ అందజేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.

 ప్రతిరోజు అంగన్వాడీ కేంద్రంలో బాలామృతం  ప్లస్  ఉదయం, సాయంత్రం, పిల్లలకు ఇవ్వాలన్నారు. అంగన్వాడీ కేంద్రం పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని గ్రామ సర్పంచ్ తాన్య నాయక్ అన్నారు