బచ్చన పేట

గాంధీ మార్గం అందరికీ ఆదర్శం .. సర్పంచ్ వడ్డేపల్లి మల్లారెడ్డి

Submitted by veerareddy on Mon, 03/10/2022 - 13:00

బచ్చన్నపేట సెప్టెంబర్ 2 (ప్రజా జ్యోతి) ./,....గాంధీ మార్గం భారతదేశ ప్రజలందరూ ఆదర్శంగా తీసుకోవాలని బచ్చన్నపేట సర్పంచ్ వడ్డేపల్లి మల్లారెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద 153వ జయంతి ఉత్సవాలను పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. దేశ స్వతంత్ర పోరాటంలో మహాత్మా గాంధీ గొప్పతనం గురించి వివరించారు. మండల కేంద్రంతో పాటు సాల్వపూర్. మన్సాన్పల్లి. పడమటి కేశపూర్. కొన్నే. రామచంద్ర గూడెం. పోచన్నపేట. నారాయణపురం. తమ్మడపల్లి. గోపాల్ నగర్. కేసిరెడ్డిపల్లి. కొడవటూరు. లక్ష్మాపూర్. కట్కూర్. ఆలింపూర్. దబగుంటపల్లి. నాగిరెడ్డిపల్లి. బోన కొల్లూరు. బసిరెడ్డిపల్లి.

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

Submitted by veerareddy on Mon, 03/10/2022 - 12:58

బచ్చన్నపేట అక్టోబర్ 2 (ప్రజా జ్యోతి)./... బచ్చన్నపేట మండలంలోని ప్రధాన చౌరస్తాలో గాంధీ 153 వ జయంతి ఉత్సవాలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా పూలమాలలు వేసి నిర్వహించారు అనంతరం నాయకులు మాట్లాడుతూ గాంధీ అహింస వాది అని హింసను ఎప్పుడు ప్రోత్సహించేవాడు కాదు అని శాంతి మార్గంలో సమస్యలను పరిష్కరించుకోవాలన్నా గొప్ప వ్యక్తి అని ఆయన చేసిన సేవలను కొనియాడారు.

తమ్మడపల్లిలో గాంధీ జయంతి వేడుకలు

Submitted by veerareddy on Mon, 03/10/2022 - 12:50

బచ్చన్నపేట అక్టోబర్ 2 (ప్రజా జ్యోతి) ./...మండలంలోని తమ్మడపల్లి గ్రామంలో సర్పంచ్ మేకల కవిత రాజు ఆధ్వర్యంలో గాంధీ 153 వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. భారతదేశానికి గాంధీ చేసినటువంటి సేవలను ఎవరూ మర్చిపోవద్దని భారత దేశ స్వతంత్ర పోరాటంలో గాంధీ పాత్ర ముఖ్యమని అన్నారు. గ్రామ కార్యదర్శి చక్రధర్. పిఎస్ సిఎస్ చైర్మన్ బెజడి సిద్ధులు. ఉప సర్పంచ్. బైరగోని దామోదర్ వార్డు సభ్యులు. బెల్లంకొండ శ్వేత. కంసాని మధుసూదన్ రెడ్డి. కుర్దుల ఆశీర్వాదం. గోలకొండ సునీత. ఫీల్డ్ అసిస్టెంట్ పద్మ. అరక శ్రీనివాస్. మట్టి రవి. సా నిక రాజు. గ్రామపంచాయతీ సిబ్బంది.

దేశానికి కెసిఆర్ సేవలు ఎంతో అవసరం ... జడ్పీ వైస్ చైర్మన్ గిరబోయిన భాగ్యలక్ష్మి

Submitted by veerareddy on Mon, 03/10/2022 - 12:46

బచ్చన్నపేట అక్టోబర్ 2 (ప్రజా జ్యోతి) ./...తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శమని జనగామ జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ గిరబోయిన భాగ్యలక్ష్మి అంజయ్య అన్నారు. ఆదివారం మండలంలోని గోపాల్ నగర్ గ్రామపంచాయతీలో సర్పంచ్ పర్వతం మధు ప్రసాద్ తో కలిసి పెన్షన్ కార్డులను పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ. వృద్ధాప్య పెన్షన్లు. ఒంటరి మహిళా పింఛన్లు. వికలాంగుల పెన్షన్లు. బీడీ మహిళకు పెన్షన్లు. కళ్యాణ లక్ష్మి. షాదీ ముబారక్. 24 గంటల కరెంటు ఉచితంగా. కెసిఆర్ కిట్టు. దళిత బంధు.

విద్యుత్ శాఖ ఏఈగా రాజ్ కుమార్

Submitted by veerareddy on Mon, 03/10/2022 - 12:11

బచ్చన్నపేట అక్టోబర్ 2 ప్రజా జ్యోతి: బచ్చన్నపేట మండలం విద్యుత్ శాఖ రాజకుమార్ నూతనంగా ఏ ఈ గ. బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పనిచేసిన ఏ ఈ సత్తయ్య బదిలీపై వెళ్లగా నూతన ఏ ఈగ.జనగామ టౌన్ లో సబ్ ఇంజనీర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న రాజ్ కుమార్ పదోన్నతి మీద బచ్చన్నపేట విద్యుత్ శాఖ బాధ్యతలు చేపట్టారు. ఏడిఈ అధికారి అర్జున్ పవర్. బచ్చన్నపేట విద్యుత్ శాఖ సిబ్బంది. శాలువతో సన్మానించి పూల బొకే అందించి శుభాకాంక్షలు తెలిపారు.

భవన నిర్మాణ కార్మికులకు ఉచిత శిక్షణ తరగతులు...

Submitted by veerareddy on Sat, 01/10/2022 - 12:25

ప్రారంభించిన జడ్పీ వైస్ చైర్మన్ గరబోయిన భాగ్యలక్మి...

బచ్చన్నపేట సెప్టెంబర్ 30ప్రజాజ్యోతి,.,, జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం గోపాల్ నగర్ గ్రామంలో  స్కూలు వద్ద భవన నిర్మాణ కార్మికులకు 15 రోజుల ఉచిత శిక్షణ శిబిరమును శుక్రవారం రోజున జనగామ జడ్పీ వైస్ చైర్మన్ గిరబోయిన భాగ్యలక్ష్మి అంజయ్య, గోపాల్ నగర్ సర్పంచ్ పర్వతం మధు ప్రసాద్ లు ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు.ఈ శిక్షణ సమయంలో పాల్గొన్న వారికి వేతనంతో పాటు శిక్షణ అయిపోయిన తర్వాత సర్టిఫికెట్ కూడా ఇవ్వబడునని ట్రైనర్ టి వేణుగోపాల్ తెలిపారు.
ఈ శిక్షణ శిబిరంలో 30 మంది పాల్గొన్నారు

లలితా దేవి అవతారంలో దర్శనమిచ్చిన దుర్గామాత

Submitted by veerareddy on Fri, 30/09/2022 - 15:55

బచ్చన్నపేట సెప్టెంబర్ 30 (ప్రజా జ్యోతి)./.. దేవి నవరాత్రోత్సవా లు గత ఐదు రోజులుగా మండలంలోని కట్కూరి గ్రామంలో దుర్గామాత పూజలు అందుకుంటుంది. మొదటిరోజు గ్రామ సర్పంచి ముసిని సునీత రాజు పూజలో పాల్గొనగా. సుప్రియ శ్రీనివాస్. మౌనిక వెంకటేష్. పద్మ రమేష్ పాల్గొనగా ఐదవ రోజు దుర్గామాత లలితా దేవి అవతారంలో వలబోజు ల భాస్కర్ ఉమా. కోల సత్యనారాయణ నాగవ్వ. దంపతుల ద్వారా అర్చకులు కోలోజు కనకాచారి ఆధ్వర్యంలో పూజలు అందుకుంది. కట్కూరు మాజీ సర్పంచి ముసిని ఎల్లయ్య గౌడ్. కమిటీ నిర్వాహకులు రాజు. శ్రీను. యోగిరాం. సతీష్ ఉన్నారు

సర్పంచిని సన్మానించిన. ఐఏఎస్ ఆఫీసర్

Submitted by veerareddy on Fri, 30/09/2022 - 14:37

బచ్చన్నపేట సెప్టెంబర్ 29 (ప్రజా జ్యోతి).//.. జనగామ జిల్లా. బచ్చన్నపేట మండలం కేశపురం గ్రామానికి చెందిన గిద్దెల రమేష్ . మధ్యకాలంలో కురిసినటువంటి వర్షాల వల్ల ఆలేరు కొలనుపాక మధ్యలో ఉన్నటువంటి వాగు ఉదృతంగా ప్రవహిస్తుండగా మోటార్ సైకిల్ పై ఉపాధ్యాయురాలు ఆ వాగులో ప్రమాదవశాత్తు కొట్టుకుపోతుండగా గమనించిన సర్పంచ్ ఆమెను ప్రాణాలకు తెగించి సాహసం చేసి కాపాడినందుకు  సర్పంచి ధైర్య సాహసాలకు మెచ్చుకొని ఈరోజు వాస్విక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఓబుల్ కేశపూర్ గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరానికి ముఖ్యఅతిథిగా విచ్చేసినటువంటి బుర్ర వెంకటేశం గౌడ్ ఐఏఎస్. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి.