పెన్పహాడ్

మహాత్మా గాంధీ ఆశయాలతో ముందుకెళ్లాలి

Submitted by veerareddy on Mon, 03/10/2022 - 14:56

పెన్పహాడ్ మండలం అక్టోబర్ 02 (ప్రజా జ్యోతి): మండల పరిధిలోని చిన్నగారకుంట,  గ్రామపంచాయతీ లో ఆదివారం గాంధీ జయంతి సందర్భంగా సర్పంచ్ శాలిబాయ్, మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.  ఈ సందర్భంగా సర్పంచ్ శాలిభాయ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు గాంధీజీ ఆశయాలను ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్లాలని  అన్నారు. 153వ గాంధీ జయంతి  సందర్భంగా వారు మాట్లాడుతూ గాంధీజీ చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ ప్రయాణిస్తే విజయం తప్పదని చెప్పారు.

మల మహానాడు నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

Submitted by veerareddy on Mon, 03/10/2022 - 14:42

 పెన్పహాడ్ మండలం అక్టోబర్ 02 (ప్రజా జ్యోతి):  మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు  జి చెన్నయ్య ఆదేశాల మేరకు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మేక వెంకన్న సూచన మేరకు మాల మహానాడు సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు ఆశోద రవి,జిల్లా మహిళా అధ్యక్షురాలు పిట్టల భాగ్యమ్మ ఆధ్వర్యంలో  పెన్ పహాడ్ మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగినది మండల అధ్యక్షుడిగా తుమ్మకొమ్మ విజయ్ ,మండల ప్రధాన కార్యదర్శిగా కంచి ప్రవీణ్ , జిల్లా కార్యదర్శిగా బొల్లెద్దు వినోద్,మండల మహిళా అధ్యక్షురాలుగా రాయి నవ్య,మండల ఉపాధ్యక్షుడు వరకాల విజయ్ కుమార్,మండల కార్యదర్శిగా గొబ్బి రమేష్ , మండల కోశాధికారిగా పేరం మధు , మహిళా కార్యదర్శిగా బాద

నూతన వధూవరులను ఆశీర్వదించిన తెరాస నాయకులు

Submitted by veerareddy on Sat, 01/10/2022 - 10:45

పెన్పహాడ్ మండలం సెప్టెంబర్ 30 (ప్రజా జ్యోతి): పెన్పహాడ్ మండల పరిధిలోని అనంతారం గ్రామానికి చెందిన టిఆర్ఎస్ పార్టీ మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ మస్తాన్ - జాన్ బి ల కుమార్తె షేక్ రేష్మ - నాగుల్ మీరా వివాహానికి తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యవర్గ సభ్యులు ఒంటెద్దు నరసింహారెడ్డి, మండల ఎంపిపి నెమ్మాది బిక్షం ముఖ్య అతిథులుగా హాజరై నవ దంపతులను ఆశీర్వదించారు  ఈ కార్యక్రమంలో మండల పిఎసిఎస్ చైర్మన్ లు వెన్న సీతారాం రెడ్డి నాతల జానకి రామ్ రెడ్డి, అనంతారం సర్పంచ్ బైరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, దూపాడు సర్పంచ్ బిట్టు నాగేశ్వరరావు, అనాజీపురం సర్పంచ్ చెన్ను శ్రీనివాస్ రెడ్డి,టిఆర్ఎ

దుర్గ మాత ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీపీ నెమ్మది బిక్షం

Submitted by veerareddy on Sat, 01/10/2022 - 10:32

పెన్పహాడ్ మండలం సెప్టెంబర్ 30 (ప్రజా జ్యోతి):  దేవి నవరాత్రి ఉత్సవాలో భాగంగా మండల పరిధిలోని అనంతారం గ్రామ పంచాయతీ వద్ద దసరా పండుగ,దేవీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన దుర్గ భవాని యూత్ దుర్గ మాత వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమం లో ముఖ్యఅతిథిగా ఎంపీపీ నెమ్మది బిక్షం పాల్గొన్నారు ఈ సందర్భంగా అమ్మవారికి కొబ్బరి కాయలు కొట్టి పూజలు నిర్వహించారు. అనంతరం దుర్గ భవాని యూత్ సభ్యులు ఆయనకు శాలువలు కప్పి సన్మానించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ బైరెడ్డి శ్రీనివాస్ రెడ్డి.సింగిల్ విండో చెర్మెన్ నాతల జానకి రాంరెడ్డి.దంతాల వెంకటేశ్వర్లు.

వసూళ్లకు పాల్పడిన లైన్ మెన్ సస్పెండ్

Submitted by veerareddy on Sat, 01/10/2022 - 10:27

పెన్పహాడ్ మండలం సెప్టెంబర్ 30 (ప్రజా జ్యోతి):  విద్యుత్ బిల్లులు, మీటర్ల పేరుతో ప్రజలనుండి వసూళ్లు చేసి దుర్వినియోగానికి పాల్పడిన లైన్ మెన్ ను సస్పెండ్ చేసినట్లు విద్యుత్ శాఖ డీఈ శ్రీనివాస్ వెల్లడించారు. శుక్రవారం  ఆయన విలేకరులతో మాట్లాడుతూ పెన్ పహాడ్ మండల పరిధిలోని లింగాల గ్రామ లైన్ మెన్ రూ.78,000/- వేల రూపాయలు జల్మాల కుంట, ఎల్లప్పకుంట తండాల్లో వసూళ్లకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైందన్నారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి విద్యుత్ వినియోగదారుల సేవా కేంద్రంలో డీడీ చెల్లించాలని సూచించారు. పట్టణాల్లో 48 గంటలు, రూరల్ లో 4 రోజుల్లో లైన్ మెన్ మీటర్లు ఫిట్ చేస్తారని చెప్పారు.

అనంతారం గ్రామం లో బతుకమ్మ చీరల పంపిణీ

Submitted by veerareddy on Sat, 01/10/2022 - 10:26

పెన్పహాడ్ మండలం సెప్టెంబర్ 30 (ప్రజా జ్యోతి): మండల పరిధిలోని అనంతారం గ్రామపంచాయతీ ఆవరణలో  తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆదేశానుసారం బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెన్పహాడ్ మండలం ఎంపీపీ నెమ్మది బిక్షం హాజరై సర్పంచ్ బైరెడ్డి శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన ఈ చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఇట్టి కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీ మామిడి రేవతి పరందాములు పిఎసిఎస్ చైర్మన్ లు వెన్న సీతారాం రెడ్డి నాతలజానకి రామ్ రెడ్డి,  తెరాస నేతలు చిట్టెపు నారాయణరెడ్డి , దంతాల వెంకటేశ్వర్లు , జనార్దన్ రెడ్డి ,ధర్మారెడ్డి కట్ల నాగార్జున  

మృతుని కుటుంబాన్ని పరామర్శ టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు దొంగరి యుగేందర్

Submitted by veerareddy on Fri, 30/09/2022 - 11:35

  పెన్పహాడ్ మండలం సెప్టెంబర్ 29 (ప్రజా జ్యోతి):  మండల పరిధిలోని అన్నారం బ్రిడ్జి గ్రామానికి చెందినటి ఆర్ ఎస్ పార్టీ నాయకుడుపొడపంగి పెద్ద ఆనందం అఖాల మరణం చెందడం పార్టీకి తీరని లోటు అని మండల పార్టీ అధ్యక్షులు దొంగరి యుగంధర్ అన్నారు. అనంతరం మృతుడి పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ మీసాల రమణ దేవయ్య మాజీ సర్పంచ్ మీసాల లచ్చయ్య,గ్రామ శాఖ అధ్యక్షులు మీసాల లింగయ్య,అన్నారం మాజీ అధ్యక్షులు నకిరేకంటి సత్యం,నకిరేకంటి రాంబాబు,హుస్సేన్,యాకుబ్,
బిక్షం,రత్నం, జనార్దన్, చిరంజీవి,చిన్న వెంకటయ్య,తదితరులు పాల్గొన్నారు.

ఆపదలో ఉన్న వారిని కాపాడే ఆపద్బాంధవుడు విద్యుత్ శాఖ మాత్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి

Submitted by veerareddy on Fri, 30/09/2022 - 10:54

పెన్ పహాడ్ మండలం సెప్టెంబర్ 29 (ప్రజా జ్యోతి):  పెన్పహాడ్ మండల పరిధిలోని చెట్ల ముకుందాపురం గ్రామ నివాసి ఉప్పల మోహన్ రావు గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు చికిత్స కోసం ఆర్థికంగా ఇబ్బంది పడుతుండడంతో  రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి దృష్టికి సమస్యను తీసుకెళ్లగా వెంటనే స్పందించిన మంత్రి 5,00,000 ,(ఐదు లక్షల రూపాయలు ) లను సీఎం రిలీఫ్ ఫండ్ (LOC) ద్వారా మంజూరు చేయించి వారి కుటుంబానికి అండగా నిలిచారు ఈ సందర్భంగా మోహన్ రావు కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ప్రజల కష్టాల్లో సుఖాల్లో పాలుపంచుకునే నాయకుడు దొరకడం మన అదృష్టం