దసరా రోజు రావణ వధ ఆపాలి ఏపీవైయస్ రాష్ట్ర నాయకులు భూక్యా శ్రీనివాస్

Submitted by veerareddy on Thu, 29/09/2022 - 16:20
 The slaughter of Ravana should be stopped on Dussehra day  APYS state leaders Bhukya Srinivas


గూడూరు సెప్టెంబర్ 29 (ప్రజా జ్యోతి):  ప్రతి సంవత్సరం దసరాను పురస్కరించుకుని జరిగే రావణ వధ ను ఆపాలని ఏపీ వై యస్ రాష్ట్ర నాయకులు భూక్యా శ్రీనివాస్ అన్నారు. గూడూరు మండల కేంద్రంలో  భూక్యా శ్రీనివాస్ మాట్లాడుతూభారతదేశంలోకి ఆర్యులు వచ్చి ఈ దేశంలో మనస్ఫూర్తిని కులాల పేరుతో మతాల పేరుతో విభజించి పాలన కొనసాగించారు. ఆది నివాసులైనటువంటి రాజుల చరిత్ర మనుగడలో లేకుండా చేసినారు చరిత్రలో జంబు ద్వీపం పేరుతో పిలువబడే భారతదేశ చరిత్రను ఆర్యులు కుల మతాలుగా విభజించి ఈ దేశ రాజులైన రావణుడు మహిషాసురుడు తాటకి తూర్పునక్క ఉంటి వీరుల చరిత్రను కనుమరుగు చేసి వారిని రాక్షసులుగా చిత్రించారు.ఏ దేశంలో నైనా ఇద్దరి మధ్య యుద్ధం జరిగినప్పుడు విజయులు గాను అపజయులుగా గుర్తిస్తారు కానీ భారతదేశంలో ఒకరిని రాక్షసుడిగా మరొకరిని దేవుడిగా కీర్తిస్తున్నారు. 1600 మంది గోపికల వస్త్రాలను దొంగలించినటువంటి శ్రీకృష్ణుడిని దేవుడిగాను చరిత్రలో సీతను తాకని రావణాసురుడిని మాత్రం రాక్షసుడిగా చెబుతున్నటువంటి పుక్కిడి పురాణాలు శాస్త్రీయమైనవి కావు కాబట్టి ప్రతి దసరా రోజున రావణ దహనం చేయడం ఆపివేయాలి అందులో భాగంగానే అక్టోబర్ ఐదున జరిగే రావణ వదిని నిలిపివేయాలని అంబేద్కర్ పూలే యువజన సంఘం.  ఏపీ వై యస్ తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని  ఏపీ వై యస్ రాష్ట్ర నాయకులు భూక్యా శ్రీనివాస్  కోరారు.