గూడూర్

గిరిజనులకు 10శాతం రిజర్వేషన్ ప్రకటనపై సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

Submitted by veerareddy on Mon, 19/09/2022 - 13:02

గూడూరు సెప్టెంబర్ 18 (ప్రజా జ్యోతి): నిన్న శనివారం  తెలంగాణ నిజాం పరిపాలన నుండి విముక్తి పొందిన  సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకలు  నిర్వహించింది. సందర్భంగా హైదరాబాదులో గిరిజన భవన్ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం కేసీఆర్ గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ ఇస్తామన్న ప్రకటనపై జిల్లా వ్యాప్తంగా గిరిజనుల్లో హర్షాతిరేకాలు వెలిబుచ్చుతున్నారు.

తెలంగాణ ఇంకా బందీఖానా లోనే ఉంది

Submitted by veerareddy on Sat, 17/09/2022 - 16:26
  • కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దాగుడుమూతల తో ప్రజలు నష్టపోతున్నారు 
  • సెప్టెంబర్ 17 విద్రోహ దినమే
  • న్యూడెమోక్రసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పడిగ శ్రీను

గూడూరు సెప్టెంబర్ 17 (ప్రజా జ్యోతి):  నిజాం పరిపాలన నుండి తెలంగాణ రాష్ట్రానికి విముక్తి దొరికిన అప్పటికే తెలంగాణ దొరల నుండి విముక్తి లభించలేదని అటు కేంద్రం ఇటు రాష్ట్ర ఇద్దరు దాగుడుమూతలాడుతూ ప్రజలను నష్ట పోయేలా చేస్తున్నారని న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు శ్రీను ఆరోపించారు.

తెలంగాణ రైతంగ సాయుధ పోరాట నాయకుల చరిత్రను పాఠ్యాంశాలలో చేర్చాలి

Submitted by veerareddy on Fri, 16/09/2022 - 15:48
  1. కొందరు చరిత్రను వక్రీకరిస్తున్నారని మాట్లాడడం బాధాకరం
  2. ఎంసిపిఐయు మహబూబాద్ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ కంచ వెంకన్న

గూడూరు సెప్టెంబర్ 16 (ప్రజా జ్యోతి):తెలంగాణ రైతంగ సాయుధ పోరాట నాయకుల చరిత్రను పాఠ్యాంశాలలో  చేర్చాలని,  ఆనాటి తెలంగాణ సాయుధ ఉద్యమంలో పాల్గొనని వారు కొందరు చరిత్రను వక్రీకరిస్తున్నారని మాట్లాడడం బాధాకరమని ఎంసిపిఐయు మహబూబాద్ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ కంచ వెంకన్న అన్నారు.సెప్టెంబర్ 11 నుండి 17వ తేదీ వరకు ఎంసిపిఐయు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా గ్రామ గ్రామాన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవ సందర్భంగ

నులిపురుగుల నివారణకు ఆల్బెండజోల్ మాత్రలు తప్పనిసరి డిఎంహెచ్ఓ హరీష్ రాజ్

Submitted by veerareddy on Fri, 16/09/2022 - 13:01

గూడూరు   సెప్టెంబర్ 15 (ప్రజా జ్యోతి):  బాలికలకు హానిచేసే నులిపురుగుల నివారణకు తప్పనిసరిగా ఆల్బెండజోల్ మాత్రలను సంవత్సరంలో రెండు సార్లు తప్పకుండా వెయ్యాలని మహబూబాబాద్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ హరీష్ రాజ్  సూచించారు. మహబూబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రం ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు, అయోధ్యాపురం జడ్.పి.హెచ్.ఎస్ బాలికలకు డీఎంహెచ్వో హరీష్ రాజ్ డిప్యూటీ డి ఎం హెచ్ వో డాక్టర్ అంబరీష్ జడ్పి కోఆప్షన్ సభ్యులు ఎం.డి కాసీం గూడూరు సర్పంచ్ రమేష్ అయోధ్య పురం సర్పంచ్ తులసి రామ్ నాయక్ చేతుల మీదుగా గురువారం ప్రారంభించడం జరిగింది.

గుంజేడు ముసలమ్మ కి మొక్కులు చెల్లించుకున్న ఎమ్మెల్యే శంకర్ నాయక్

Submitted by veerareddy on Thu, 15/09/2022 - 12:12


గూడూరు సెప్టెంబర్ 14 (ప్రజా జ్యోతి): గుంజేడు  ముసలమ్మ కు మహబూబాబాద్ శాసనసభ్యులు  బానోత్ శంకర్ నాయక్, ఎంపీటీసీ సుజాత మోతిలాల్ తో కలిసి బుధవారం మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో మళ్లీ సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జెడ్పి కో ఆప్షన్ ఎండి ఖాసీం ,లింగా రెడ్డి, వెంకట్ కృష్ణ రెడ్డి, లక్ష్మణ్ రావు, సురేందర్, వేణుగోపాల్ రెడ్డి,  సర్పంచులు, ఎంపిటిసిలు, పార్టీ గ్రామ, మండల నాయకులు మరియు  తదితరులు ఉన్నారు.

గూడూరులో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు

Submitted by bosusambashivaraju on Sat, 10/09/2022 - 16:25

గూడూరు సెప్టెంబర్ 10 (ప్రజా జ్యోతి): రజాకార్ల గుండెల్లో భయాన్ని పుట్టించి తెలంగాణ పౌరుషాన్ని చాటిచెప్పిన భూ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ 37 వ వర్ధంతి వేడుకలు గూడూరు మండల కేంద్రంలో శనివారం ఘనంగా జరిగాయి. గూడూరు స్థానిక అంబేద్కర్ సెంటర్ నందు చాకలి ఎస్సీ సాధన సమితి ఆధ్వర్యంలో  జరిగిన.

మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎంపిపి రమేష్

Submitted by sridhar on Sat, 10/09/2022 - 16:23

గూడూరు సెప్టెంబర్ 10 (ప్రజా జ్యోతి):మహబూబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలోని పలు గ్రామాలలో ఇటీవల మృతి చెందిన వాడి కుటుంబ సభ్యులను మాజీ ఎంపీపీ రమేష్ శనివారం పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. ముందుగా గూడూర్ గ్రామపంచాయతి పరిధిలోని చంద్రుగూడేం వాసి ఉట్ల వీరచారి తల్లి కృష్ణ బాయి ఇటివల చనిపోగ అక్కడికి వేళ్ళి పూలతో నివాళి అర్పించి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి  తెలిపి వారి కుటుంబానికి సహాయంగా 50కీలోల బియ్యము అందచేయడము జరిగింది.