పాఠశాలల్లో విద్యార్థులకు అవగాహన

Submitted by veerabhadram on Fri, 21/10/2022 - 05:23
School

ప్రజా జ్యోతి చంద్రుగొండ అక్టోబర్ 20

 చంద్రుగొండ మండలం బెండాలపాడు గ్రామపంచాయతీలో గల మండల పరిషత్ పాఠశాల నందు ఐటీసీ బంగారు భవిష్యత్ వాస్ ఇనిస్ట్యూట్ వారు ఈరోజు తడి పొడి చెత్త పై విద్యార్థులకు అవగాహన కల్పించారు తడి పొడి చెత్తను వేరు చేసి పొడి వ్యర్ధాలను వేరు చేసి పునరుత్పత్తికి పంపేలా చూడటం అలాగే పాఠశాలలో పరిశుభ్రమైన వాతావరణం ఉండేలా ప్రతి ఒక్కరూ పాటించాలని వారు తెలియజేశారు. చెత్తలో రకాలను గురించి వివరించారు. మరియు మన చుట్టుపక్కల వాతావరణం పరిశుభ్రంగా ఉంచుకుంటేనే అందరం ఆరోగ్యంగా ఉంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, ఐటీసీ బంగారు భవిష్యత్ వాస్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చిన కోఆర్డినేటర్ డి వెంకట్రావు, సిఓ జంపరాజు పాల్గొన్నారు.