ఆదివాసీల సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా కొమరం భీం జయంతి వేడుకలు...

Submitted by veerabhadram on Sun, 23/10/2022 - 07:12
komuram bheem jayanthi veduka

చండ్రుగొండ ప్రజా జ్యోతి  అక్టోబర్ 22

ఆదివాసిల ఆరాధ్య నాయకుడు కొమరం భీం చూపిన బాటలోనే పయనించి ఆదివాసి లు తమ హక్కుల కాపాడుకోవాలని ఆదివాసి జేఏసీ నాయకులు  అన్నారు. కొమరం భీం జయంతిని పురస్కరించుకొని చండ్రుగొండ మండల కేంద్రంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా కొమరం భీం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈసందర్భంగా ఆదివాసి జేఏసీ నాయకులు  మాట్లాడుతూ.. ఆదివాసీల అభ్యున్నతి కోసం తెలంగాణ కోసం ఎన్నో త్యాగాలు చేసిన మహనీయుడు కొమరం భీం, నేటి తరాలకు ఆదర్శ ప్రాయుడని జాతి కోసం ప్రాంతం కోసం తమ జీవితాన్ని త్యాగం చేశాడని. ఆయన బాటలోనే నేటి యువత పయనించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ కో ఆప్షన్ సభ్యులు సయ్యద్ రసూల్, టిఆర్ఎస్ నాయకులు ఉప్పతల ఏడుకొండలు, భూపతి శ్రీనివాసరావు, కాంగ్రెస్ నాయకులు కేశబోయిన నరసింహారావు, ఆదివాసి నాయకులు బొర్రా సురేష్, పద్దం వినోద్, కుంజా వెంకటేష్, తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.