గూడూరులో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు

Submitted by bosusambashivaraju on Sat, 10/09/2022 - 16:25
Chakali Ailamma's birthday celebrations were grand in Gudur

గూడూరు సెప్టెంబర్ 10 (ప్రజా జ్యోతి): రజాకార్ల గుండెల్లో భయాన్ని పుట్టించి తెలంగాణ పౌరుషాన్ని చాటిచెప్పిన భూ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ 37 వ వర్ధంతి వేడుకలు గూడూరు మండల కేంద్రంలో శనివారం ఘనంగా జరిగాయి. గూడూరు స్థానిక అంబేద్కర్ సెంటర్ నందు చాకలి ఎస్సీ సాధన సమితి ఆధ్వర్యంలో  జరిగిన. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రమేష్ నాయక్ కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు కత్తి స్వామి చాకలి ఎస్సీ సాధన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏదునూరి వెంకన్న హాజరై మాట్లాడుతూ రజాకార్ల వెన్నులో వణుకు పుట్టించిన వీర వనిత చాకలి ఐలమ్మ అని తెలంగాణ పౌరుషాన్ని చూపించి స్త్రీ జాతి లో ధైర్యశాలి గా నిలిచిపోయారు. నాడు చాకలి ఐలమ్మ చేసిన భూ పోరాటం చాలా గొప్పది అని అనేక పోరాటాలకు ఆదర్శంగా నిలిచారన్నారు.  ఈ వేడుకలకు ఉపసర్పంచ్ శివరాత్రి సంపత్  ఎంపిటిసి నూకల రాధికా సురేందర్ యాదవ్  మండల కో ఆప్షన్ సభ్యులు ఎండి రహీం పాషా,  ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు పాశం సాంబయ్య, సినియర్  తెరాస పార్టీ నాయకులు వాంకుడోత్ కటార్ సింగ్, తండా శ్రీహరి మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు బోడ ఎల్లయ్య, భూక్య సురేష్  నూకల అశోక్, బొంత రామన్న మండల అధ్యక్షులు రసమల్ల యాకయ్య, చాగంటి భీముడు, సిరికొండ సాయిలు, రాసమల్ల యాదగిరి, రాసమల్ల వెంకన్న, మడిపేద్ది శ్రీనివాస్, చంటి స్వామి, గజ్జి మల్లేష్ నల్ల తీగల యాకయ్య రాసమల్ల రాములు బుచ్చి రాములు తంగళ్ళపల్లి కృష్ణ  పాషా చింత బాలయ్య రాపర్తి అశోక్ తంగళ్ళపల్లి సునీల్ తదితరులు పాల్గొన్నారు.