తెలంగాణ ఇంకా బందీఖానా లోనే ఉంది

Submitted by veerareddy on Sat, 17/09/2022 - 16:26
Telangana is still in captivity
  • కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దాగుడుమూతల తో ప్రజలు నష్టపోతున్నారు 
  • సెప్టెంబర్ 17 విద్రోహ దినమే
  • న్యూడెమోక్రసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పడిగ శ్రీను

గూడూరు సెప్టెంబర్ 17 (ప్రజా జ్యోతి):  నిజాం పరిపాలన నుండి తెలంగాణ రాష్ట్రానికి విముక్తి దొరికిన అప్పటికే తెలంగాణ దొరల నుండి విముక్తి లభించలేదని అటు కేంద్రం ఇటు రాష్ట్ర ఇద్దరు దాగుడుమూతలాడుతూ ప్రజలను నష్ట పోయేలా చేస్తున్నారని న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు శ్రీను ఆరోపించారు. శనివారంజగనాయకులగూడెంలోసిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా  సెప్టెంబర్ 17ను  విద్రోహ దినంగా పాటిస్తూ నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.  తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో అసువులు బాసిన అమరవీరుల అందరికీ  ఈ సందర్భంగా సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ గూడూరు సబ్ డివిజినల్ కమిటీ విప్లవ నివాళులు అర్పించటం జరిగింది . సహాయ కార్యదర్శి పడిగ శ్రీను  మాట్లాడుతూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ద్వారా  పటేల్. పట్వారీ.భూస్వాముల. పెత్తందార్ల .నైజాం రజాకార్ల దౌర్జన్యాలను దాడులను తిప్పి కొడుతూ  పది లక్షల ఎకరాల భూములను ప్రజలపరం చేసి  మూడు వేల గ్రామాల్లో గ్రామ స్వరాజ్జ్యాలు ఏర్పాటు చేసి  విముక్తి మార్గం చూపిన ఘనచరిత్ర కమ్యూనిస్టు విప్లవ కారులు దేనని కొనియాడారు . వారి పోరాట స్ఫూర్తితో  నేడు కేంద్ర. రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సమరశీల పోరాటాలు నిర్వహించాలని  ప్రజలకు పిలుపునిచ్చారు .ఈ నిరసన కార్యక్రమాలలో గూడూరు సబ్ డివిజినల్ కమిటీ నాయకుకులు .దొంతోజు  ఉపేందర్  మల్లేష్ తదితరులు  పాల్ కొనడం  జరిగినది.