తెలంగాణ రైతంగ సాయుధ పోరాట నాయకుల చరిత్రను పాఠ్యాంశాలలో చేర్చాలి

Submitted by veerareddy on Fri, 16/09/2022 - 15:48
The history of Telangana peasant armed struggle leaders should be included in the curriculum
  1. కొందరు చరిత్రను వక్రీకరిస్తున్నారని మాట్లాడడం బాధాకరం
  2. ఎంసిపిఐయు మహబూబాద్ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ కంచ వెంకన్న

గూడూరు సెప్టెంబర్ 16 (ప్రజా జ్యోతి):తెలంగాణ రైతంగ సాయుధ పోరాట నాయకుల చరిత్రను పాఠ్యాంశాలలో  చేర్చాలని,  ఆనాటి తెలంగాణ సాయుధ ఉద్యమంలో పాల్గొనని వారు కొందరు చరిత్రను వక్రీకరిస్తున్నారని మాట్లాడడం బాధాకరమని ఎంసిపిఐయు మహబూబాద్ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ కంచ వెంకన్న అన్నారు.సెప్టెంబర్ 11 నుండి 17వ తేదీ వరకు ఎంసిపిఐయు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా గ్రామ గ్రామాన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవ సందర్భంగా వారం రోజులపాటు అప్పటి పోరాట స్మృతిలను గుర్తు చేసుకుంటూ కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా  శుక్రవారం గూడూరు మండల కేంద్రంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవ సందర్భంగా అప్పటి అమరవీరుల చిత్రపటాలకు పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది.

అనంతరం జరిగిన కార్యక్రమంలో ఎం సిపిఐయు మహబూబాద్ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ కంచ వెంకన్న మాట్లాడుతూ 1946 సెప్టెంబర్ 11 నుండి అక్టోబర్ 21 వరకు నైజాం సర్కార్ కు వ్యతిరేకంగా కాసిం రిజివి గుండాలకు వ్యతిరేకంగా సాగిన మహత్తరమైన పోరాటంలో కమ్యూనిస్టుల నాయకత్వంలో గ్రామీణ ప్రాంత ప్రజలను సమీకరించి భూమి భుక్తి ప్రజల విముక్తి కోసం సాగిన పోరాటంలో 4,000 మంది అమరులు వీరమరణం పొందారని వారి పోరాట స్ఫూర్తితో 3000 గ్రామాలను పెట్టి చాకిరి వ్యతిరేకంగా విముక్తి చేయడం జరిగిందని అప్పటి పోరాటాస్మృతులను గుర్తు చేశారు అప్పటి ఉద్యమానికి సంబంధం లేని నాయకులు అప్పటి చరిత్రను వక్రీకరిస్తూ మాట్లాడడం బాధాకరమైందని నాటి పోరాట చరిత్రను నేటి యువతరానికి తెలియజేయడం కోసం తెలంగాణ రైతంగ సాయుధ పోరాట నాయకుల చరిత్రను పాఠ్యాంశాలలో చేర్చి వారి సేవలను తెలియజెప్పడం అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తిని గైకొని నేడు పాలకవర్గ పార్టీలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై సమరశీల పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఎం సి పి ఐ యు పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి నూకల ఉపేందర్ గూడూరు మండల కార్యదర్శి బందెల వీరస్వామి జిల్లా మండల నాయకులు కటకం బుచ్చిరామయ్య బానోతులాలు పెసరి చిలకమ్మ తాడెం నరసయ్య తదితరులు పాల్గొన్నారు.