నులిపురుగుల నివారణకు ఆల్బెండజోల్ మాత్రలు తప్పనిసరి డిఎంహెచ్ఓ హరీష్ రాజ్

Submitted by veerareddy on Fri, 16/09/2022 - 13:01
Albendazole tablets are a must for deworming  DMHO Harish Raj

గూడూరు   సెప్టెంబర్ 15 (ప్రజా జ్యోతి):  బాలికలకు హానిచేసే నులిపురుగుల నివారణకు తప్పనిసరిగా ఆల్బెండజోల్ మాత్రలను సంవత్సరంలో రెండు సార్లు తప్పకుండా వెయ్యాలని మహబూబాబాద్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ హరీష్ రాజ్  సూచించారు. మహబూబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రం ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు, అయోధ్యాపురం జడ్.పి.హెచ్.ఎస్ బాలికలకు డీఎంహెచ్వో హరీష్ రాజ్ డిప్యూటీ డి ఎం హెచ్ వో డాక్టర్ అంబరీష్ జడ్పి కోఆప్షన్ సభ్యులు ఎం.డి కాసీం గూడూరు సర్పంచ్ రమేష్ అయోధ్య పురం సర్పంచ్ తులసి రామ్ నాయక్ చేతుల మీదుగా గురువారం ప్రారంభించడం జరిగింది. సందర్భంగా డీఎంహెచ్వో హరీష్ రాజ్ మాట్లాడుతూ బాలికలు నులి పురుగుల వలన రక్తహీనతను ఏర్పడుతుందని వాటిని నిర్మూలించేందుకు సంవత్సరంలో ఆరు నెలలకు ఒకసారి ఆల్బెండజోల్ మాత్రలు తప్పనిసరిగా వేయించుకోవాలని సూచించారు. విద్యార్థినిలు ఎప్పటికప్పుడు తమ చేతులను శుభ్రం చేసుకుంటూ పరిశుభ్రంగా ఉండాలని పరిశుభ్రతను మించిన ఆరోగ్యం ఇంకొకటి లేదని ఆయన అన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో  వైద్య అధికారి సాయినాథ్, పుష్పాలత, మౌనిక  వారు, లవరాం, లోక్య నాయక్ , కోమల, సూపర్వైజర్ గణేష్, శ్రీలత,హేమలత పాల్గొనడం జరిగింది.