గిరిజనులకు 10శాతం రిజర్వేషన్ ప్రకటనపై సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

Submitted by veerareddy on Mon, 19/09/2022 - 13:02
On announcement of 10 percent reservation for tribals  Palabhishekam for CM's portrait

గూడూరు సెప్టెంబర్ 18 (ప్రజా జ్యోతి): నిన్న శనివారం  తెలంగాణ నిజాం పరిపాలన నుండి విముక్తి పొందిన  సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకలు  నిర్వహించింది. సందర్భంగా హైదరాబాదులో గిరిజన భవన్ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం కేసీఆర్ గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ ఇస్తామన్న ప్రకటనపై జిల్లా వ్యాప్తంగా గిరిజనుల్లో హర్షాతిరేకాలు వెలిబుచ్చుతున్నారు. వివరాల్లోకి వెళితే ఈ సందర్భంగా మహబూబాద్ జిల్లా గూడూరు మండలం గిరిజనులు కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు సీఎం కేసీఆర్ ఒకప్పుడు ఎంతో పేదరికం అనుభవించిన గిరిజనులకు తండాలను గ్రామ పంచాయతీలుగా చేసి ఒక గుర్తింపు తెచ్చారని అదేవిధంగా గిరిజనుల కోసం ప్రత్యేకంగా భవనాన్ని నిర్మించడం ఏ కాకుండా ఆ సందర్భంగా గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాలకు మేలు జరుగుతుందని ఈ రోజు ఎంతో మంది గిరిజనులు పోరాటాలు చేసి రిజర్వేషన్ కోసం నానా ఇబ్బందులు ఎదుర్కొన్నామని సీఎం కేసీఆర్ చొరవ వల్ల 10 శాతం రిజర్వేషన్ ప్రకటించడం హర్షణీయమన్నారు ఇంకా తండాల్లో గ్రామ పెద్దలు బానోత్ బాన్యా నాయక్ , యాకుబ్ , దస్రు,వీరన్న,భావుసింగ్ ,హుస్సేన్ ,కిషన్,వెంకన్న ,వెంకటేష్ ,వెంకన్న  విష్ణు,రూప్ లాల్ తదితరులు పాల్గొన్నారు.