హడ్ హాక్ కమిటీ మండల కన్వీనర్ గా ముత్యం లక్మి నారాయణ

Submitted by veerareddy on Wed, 28/09/2022 - 12:39
Mutyam Lakmi Narayana as Mandal Convener of Hud Hawk Committee

గూడూరు  సెప్టెంబర్ 27 (ప్రజా జ్యోతి):  తెలంగాణ మాల పోరాట సమితి(టిఎంపిఎస్)గూడూరు మండల హడ్ హాక్ కమిటీని ఏక గ్రీవంగా ఎన్నుకున్నట్లు మాల పోరాట సమితి వ్యవస్థాపక, రాష్ట్ర అధ్యక్షులు పెరమాండ్ల వెంకటేశ్వర్లు తెలిపారు. మంగళవారం గూడూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన తెలంగాణ మాల పోరాట సమితి సంఘం సమావేశానికి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. అనంతరం గూడూరు మండల టిఎంపి ఎస్ హడ్ హాక్ కమిటీని నియమించారు. హడ్ హాక్ కమిటీ మండల కన్వీనర్ గా పొనుగోడు గ్రామానికి చెందిన ముత్యం లక్మి నారాయణ ను, కో కన్వీనర్ గా చెంద్రుగూడెం గ్రామానికి చెందిన దోమ ఉపేందర్ ను ఏక గ్రీవంగా నియమించినట్లు మాల పోరాట సమితి వ్యవస్థాపక, రాష్ట్ర అధ్యక్షులు పెరమాండ్ల వెంకటేశ్వర్లు తెలిపారు. ఈసందర్బంగా వెంకటేశ్వరు మాట్లాడుతూ మాలలను అన్ని విధాలుగా ఆదుకుంటామని, మాలల అన్ని రంగాలలో ముందుండి సంఘాన్ని బలోపేతం చేయాలనీ, మాలలకు ఏ సమస్యలు వచ్చిన నేను ముందుండి సమస్యలల్లో పాలు పంచుకొని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.అనంతరం నూతనంగా ఎన్నికైన ముత్యం లక్మి నారాయణ,దోమ ఉపేందర్ లు మాట్లాడుతూ మాపై ఎంతో నమ్మకము ఉంచి మాకు ఈపదవి ఇచ్చినందుకు గూడూరు మండలంలో మాల సంఘం బలోపేతం కోసం అహర్నిశలు కృషి చేస్తామని సంఘం అభివృద్ధి కోసం అందరిని కలుపుకొని పోయి పని చేస్తామని అన్నారు. ఈకార్యక్రమంలో ధార ప్రసాద రావు,పత్తేమ్ ఉపేందర్,ఎడ్ల ప్రభాకర్,పెరమాండ్ల శ్రీనివాస్, అరకాల వెంకన్న,తోగరు సారయ్య,సింగుడాల అనిల్, గండమల్ల సంజీవ,ఎడ్ల బాలరాజు,బత్తుల ఎల్లస్వామి తదితరులు పాల్గొన్నారు.