బీజేపీ లో చేరిక పచ్చి అబద్ధం

Submitted by veerareddy on Tue, 20/09/2022 - 16:42
Joining BJP is a blatant lie


పార్టీ మారడంపై వదంతులు సృష్టించ వద్దు 

పాల్త్య తండా వాసుల విన్నపం

గూడూరు సెప్టెంబర్ 20 (ప్రజా జ్యోతి): ప్రజా- గోస బిజెపి భరోసా యాత్ర సందర్భంగా మహబూబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో కేంద్ర మాజీ మంత్రి బిజెపి రాష్ట్ర నాయకులు నటుడు బాబు మోహన్ పర్యటన సందర్భంగా బిజెపి పార్టీలో చేరికలు జరిగాయి. కాగా ఆరోజు బిజెపి పార్టీ తీర్థం పుచ్చుకున్న వారు తమను బలవంతంగా కొంతమంది బిజెపి పార్టీ లో చేరాలని ఒత్తిడి చేశారని తాము ఎప్పుడూ తెరాస కార్యకర్తలు అని అని మీడియాకు తెలిపారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూపాల్త్య తండా ప్రజలు మొత్తం బీజేపీలో చేరారని వస్తున్న వార్తలు పచ్చి అబద్ధం  అని గత నాలుగు రోజుల కిందట 'ప్రజా గోస- బీజేపీ భరోసా' పేరుతో బీజేపీ అధికారం కోసం బీజేపీ గోస యాత్రను మా వెంగంపేటలోని పాల్త్య తండాలో చేశారు. ఒకరిద్దరు వారి స్వార్ధ ప్రయోజనాల కోసం, బీజేపీ వారు ఎర వేసిన  డబ్బుల కోసం కక్కుర్తి పడి తండా ప్రజలు బీజేపీలో చేరాలని ఒత్తిడి తీసుకువచ్చారు. వారి మాట వినని వారిని తండా నుండి బహిష్కరిస్తామని బయపెట్టారు. వారి ఇండ్లలో జరిగే మంచి చెడులకు ఎవరూ వెళ్ళొద్దని బెదిరింపులకు పాల్పడ్డారు. ఇంకా ఒక అడుగు ముందుకు వేసి మా తండాలో 90 మంది ఓటర్లు ఉండగా 150 మంది బీజేపీలో చేరారని పేపర్ లో ప్రకటనలు ఇవ్వడం మరీ విడ్డురం. ఇదిలా ఉండగా నిన్న టీఆర్ ఎస్ గ్రామ కమిటీ నిర్వహించిన సమావేశానికి సదరు తండా నుండి 20 కుటుంబాల పెద్దలు హాజరయ్యారు. మేము మీతోనే ఉన్నామని, మా తండా కుటుంబాలు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో తెరాస ఎనిమిదేండ్ల పాలనలో లబ్ది పొందామన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ టీఆర్ఎస్ ని వీడే ప్రసక్తి లేదన్నారు. గతంలో మమ్మల్ని నమ్మి గ్రామ పార్టీ అధ్యక్షునిగా మా తండావాసున్ని నియమిస్తే వాడు స్వార్ధం, స్వ ప్రయోజనాల కోసం పార్టీకి ద్రోహం చేయడమే కాక తండా వాసుల్ని బెదిరిస్తూ, భయపెడుతూ బీజేపీలో చేరేలా ఒత్తిడి తెస్తున్నాడు.

బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నాడు  అని అయినప్పటికీ లొంగకుండా మీతో కలిసి ప్రయాణం చేయాలనే ఈ కార్యక్రమానికి స్వతహాగా హాజరైనట్లు 20కుటుంబాల పెద్దలు  తెలియజేశారు. దయచేసి ఈ వదంతులు నమ్మొద్దని గ్రామ కమిటీ, మండల పార్టీ శాసనసభ్యులు  బానోతు శంకర్ నాయక్ కి విన్నవించుకుంటున్నామన్నారు. ఈ సమావేశంలో గ్రామ పెద్దలు కుందూరు శోభన్ రెడ్డి, గ్రామ కమిటీ సలహాదారుడు కట్ల విష్ణు, కార్యదర్శి రాజాలు, ఉపాధ్యక్షులు యాదగిరి, వెంకన్న, సాయిలు, జవహర్, మోహన్, దేశ్య, భీమ్ల, గోల్య, రమేష్, కిషన్, ఫక్య, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.