ఆధిపత్యానికి సింహ స్వప్నం ఐలమ్మ

Submitted by sridhar on Sat, 10/09/2022 - 17:39
Ailamma is the lion's dream for dominance
  • జిల్లెల్ల గ్రామ సర్పంచ్ ఎముక జంగయ్య

కల్వకుర్తి సెప్టెంబర్ 10 ప్రజా జ్యోతి ; తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో జాగీర్దార్, జమిందార్, దేశ్ముకులకు చాకలి ఐలమ్మ ఓ సింహస్వప్నంగా నిలిచిందని జిల్లెల్ల గ్రామ సర్పంచ్ ఎముక జంగయ్య అన్నారు. జిల్లెల్ల గ్రామ రజక సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ 37వ వర్ధంతి వేడుకలను శనివారం గ్రామంలోని బస్టాండ్ వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ ఎముక జంగయ్య, ఉపసర్పంచ్ జి.రాజు, ఎంపిటిసి శోభాశేకర్ రెడ్డి, మాజీ ఉపసర్పంచ్ పి.ఎం పాండుగౌడ్ లు హాజరై ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి , నివాళులర్పించారు.

 ఈ సందర్భంగా సర్పంచ్ ఎముక జంగయ్య మాట్లాడుతూ  భూమి, భూక్తి , విముక్తి వెట్టిచాకిరి కోసం పోరాడుతూ, సమాజ చైతన్యాన్ని రగిలింపజేసిన పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ  అన్నారు. ఆంధ్ర మహిళా సభలో సభ్యురాలుగా కొనసాగుతూ జాగిర్ధర్, జమీందారు, పెత్తందారి వ్యవస్థ కు చరమగీతం పాడిన  వీరనారీమణి ఐలమ్మ  అని అన్నారు. భూస్వాములకు ఎదురు తిరిగి వేల ఎకరాల భూమి ని నిరుపేదలకు పంచిన ఘనత ఆమె సొంతమన్నారు. చివరి రక్తబొట్టు వరకు కూడా అన్యాయాన్ని ఎదిరించి,  న్యాయం కోసం పోరాడిన వీరనారీమని ఐలమ్మని అన్నారు.

ట్యాంక్ బండపై ఆమె విగ్రహాన్ని ఏర్పాటు చేసి, ఐలమ్మ పేరు మీద మహిళా యూనివర్సిటీ ని ఏర్పాటు చేయాలని సర్పంచ్ ఎముక జంగయ్య  ప్రభుత్వాన్ని కోరారు.  అనంతరం ఉప సర్పంచ్ జి.రాజు మాట్లాడుతూ భూమి, బుక్తి, వెట్టిచాకిరి కోసం తన కుటుంబాన్ని సర్వసంగ పరి త్యాగం చేశారని ఆయన అన్నారు. బాంచన్ కాల్మొక్త అనే రోజుల్లో దొరలకు ఎదురు తిరిగి కొంగు నడుముకు చుట్టి, రోకల్బండ చేతబట్టి దొరలను  గడీలకే పరిమితం చేశారన్నారు. ఎన్ని అవంతరాలు ఎదురైనా ముక్కు అని ధైర్యంతో దొడ్డి కొమరయ్య అమరత్వంతో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని కొనసాగించిన వీర వనిత అని పేర్కొన్నారు.

ఆమె త్యాగం, ఆమె ధైర్యం  తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నేటి తేరానికి స్ఫూర్తిదాయకమని ఉప సర్పంచ్ జి.రాజు అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు జి.పాండురంగారెడ్డి , కో ఆప్షన్ నెంబర్ బాల్ జంగయ్య, గౌడ సంఘం అధ్యక్షులు పి. జంగయ్య గౌడ , టిఆర్ఎస్ పార్టీ యూత్ నాయకులు ముత్యాల రమేష్ , స్కూల్ కమిటీ మాజీ చైర్మన్ జి.ఆనందు, రజక సంఘం నాయకులు ఎముక రవి, దశరథం , ముత్యాలు, యాదయ్య , ఇదమయ్య, ఆంజనేయులు, రవి , మల్లికార్జున్ ,  శ్రీహరి , ఆటో యూనియన్ నాయకులు శ్రీశైలం, జర్నలిస్టు నరేష్, ఆటో శేఖర్ ,బుచ్చయ్య , శివసేన తదితరులు పాల్గొన్నారు.