అన్నదానం మహ దానం

Submitted by Upender Bukka on Fri, 30/09/2022 - 12:01
Annadanam is a great gift

ప్రజా జ్యోతి నాగారం 29 సెప్టెంబర్ ./..  దానాలలో  కెల్లా  అన్నదానం  గొప్పదానమని  సర్పంచ్  ఫసుపులేటి  ప్రేమలత వెంకటరెడ్డి   అన్నారు  .గురువారం  నాగారం మండలంలోని మాచిరెడిపల్లి గ్రామంలో  మెయిన్ బజారులో జైభవానీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 6 వ వార్షికోత్సవం సందర్భంగా   కమిటీ సభ్యులు  ఏర్పాటు చేసిన కార్యక్రమంలో  ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ ప్రేమలత మాట్లాడుతూకమిటీ సభ్యులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం  చేసుకోవాలని తెలిపారు. అన్నదాన కార్యక్రమానికి ముందుకొచ్చిన కమిటి సభ్యులను అభినందించారు.
ఈ కార్యక్రమంలో  సోమరాజు ,శ్రీనివాస్ మున్న ,వీరమల్లు, వెంకన్న క్రిష్ణమూర్తి, లింగమల్లు, యాకన్న, అంజయ్య ,స్వామి తదితరులు పాల్గొన్నారు  .