దోమతెరలను వాడాలి

Submitted by Tirumalashetty… on Tue, 13/09/2022 - 22:02
Aswaraopeta

దోమతెరలు వాడాలి.. కాచి చల్లార్చిన నీరు త్రాగాలి
-మలేరియా ప్రభావిత గ్రామాలలో  దోమల నివారణ మందు పిచికారి
..ఎస్ యూఓ అజ్మీర వెంకటేశ్వరరావు 
అశ్వారావుపేటరూరల్, సెప్టెంబర్08, ప్రజాజ్యోతి: గ్రామాలలోని ప్రజలు దోమతెరలు వాడాలని, త్రాగేనీరు కాచి చల్లార్చుకోని త్రాగాలని సబ్ యూనిట్ అధికారి అజ్మీర వెంకటేశ్వరరావు అన్నారు. మంగళవారం గుమ్మడవల్లి ప్రాథమికఆరోగ్యకేంద్రం పరిధిలోని మలేరియా ప్రభావిత గ్రామాలైన చెన్నాపురం, గుత్తి కాయల కాలనీ, గోపన్నగూడెం గ్రామాలలో సబ్ యూనిట్ అధికారి అజ్మీర వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో సర్పంచ్ లక్ష్మణరావు ప్రారంభించగా 286 గృహాలలో దోమల నివారణ మందు పిచికారి చేయించారు. ఈ సందర్భంగా అజ్మీరా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఇంటి ఆవరణంలో నీరునిల్వ ఉండటం వలన దోమలు ఎక్కువగా పెరుగుతాయని నీరునిల్వ ఉండేటటువంటి వస్తువులను ఎప్పటికప్పుడు పరిశీలించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్ టిఎస్ విజయరెడ్డి, హెల్త్ అసిస్టెంట్ వెంకటేశ్వర్లు, ఏఎన్ఎంలు రాధాబాయి, స్వరూప, కార్యదర్శి సాగర్ ఆశాకార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు