క్రీడామైదానం పనులలో ఎంపీడీవో, పంచాయతీ పాలకవర్గం,అధికారులు జాప్యం....

Submitted by veerabhadram on Thu, 15/09/2022 - 19:06
play grund

 ప్రజా జ్యోతి సెప్టెంబర్ 15  చండ్రుగొండ:
మండల పరిధిలోని మద్దుకూరు గ్రామపంచాయతీలో గల 139 సర్వేనెంబర్ లో గల ఎకరం ప్రభుత్వ భూమిగా సర్వే ప్రకారం కలెక్టర్ గారి ఆదేశాల మేరకు గ్రామపంచాయతీకి పంచనామా చేసి అప్పజెప్పడం జరిగింది. కానీ క్రీడా ప్రాంగణంలో పనులు మొదలయ్యకపోవడం వల్ల గ్రామ ఆదివాసి యువకులు ఎంపీడీవో  కార్యాలయంకి వెళ్లి అడగగా, ఎంపీడీవో అన్నపూర్ణ మద్దుకూరు పంచాయతీ పాలకవర్గం ఆ భూమి వేరే కొరదని ఆ భూమిలో క్రీడా ప్రాంగణం పనులు చేపడితే  పురుగుల మందు తాగి చనిపోతానని బెదిరించాడని, దరఖాస్తు ఇచ్చి వారం రోజులు గడువు కోరాడని తెలియజేశారు.
ఇట్టి విషయం పై యువకులు తహసిల్దార్ ని కలవగా ఆ భూమి ప్రభుత్వ భూమి అని సర్వే చేసి పూర్తిగా తెలుసుకున్నాకే భూమిని కేటాయించామని అన్నారు. ఒకవేళ భూమి వేరొకరిది అయితే వారు నిరూపించుకోవడానికి వారం రోజులు గడువు ఎందుకని పంచాయతీని ఆశ్రయించకుండా నేరుగా నా దగ్గరికి రావచ్చు కదా అని ప్రశ్నించారు. దీనిపై ఆదివాసీ యువకులు మాట్లాడుతూ.. కావాలనే క్రీడా ప్రాంగణం పై రాజకీయాలు చేస్తున్నారని గిరిజనేతరులు, గిరిజనులు అడ్డం పెట్టుకొని ఏజెన్సీలో భూ దందాలు చేస్తున్నారని ఆరోపించారు. క్రీడా ప్రాంగణ పై రాజకీయాలు చేయొద్దని పనులను అడ్డుకుంటే ఎంత దూరమైనా వెళ్తామని ఆ భూమిని ఎట్టి పరిస్థితుల్లో వదిలేదే లేదని అవసరమైతే కలెక్టర్ దగ్గరకైనా పోయి తేల్చుకుంటామని ఆదివాసి జేఏసీ మండల అధ్యక్షుడు కాకా మహేష్ దొర తెలిపారు.