రోడ్డుకు అడ్డంగా దిమ్మెల నిర్మాణం.. రాజకీయంగా వేడెక్కిన చండ్రుగొండ...

Submitted by veerabhadram on Thu, 15/09/2022 - 19:21
road  political

 ప్రజా జ్యోతి సెప్టెంబర్ 15  చండ్రుగొండ:
 రాత్రి రాత్రికే రోడ్డుకు అడ్డంగా పార్టీలు, కుల సంఘాలు, ఇతర వర్గాల దిమ్మెలు పోటీపడి నిర్మించడంతో చండ్రుగొండ పంచాయతీ ఒక్కసారిగా రాజకీయంగా వేడెక్కింది. పలు సంఘాలు, యువకులు పంచాయతీ, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసి, నిర్మాణాలను తొలగించాలని, లేకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
 మండల కేంద్రమైన చండ్రుగొండ ప్రధాన సెంటర్లో జాతీయ రహదారి పక్కన గల జిల్లా పరిషత్, ఎస్సీ బాలుర వసతిగృహానికి వెళ్ళే రహదారిపై బుధవారం రాత్రి నుండి గురువారం తెల్లవారుజామున వరకు సుమారు ఐదు దిమ్మెలు ( రాజకీయ పార్టీలు,కుల సంఘాలు, ఇతర సంఘాలు )నిర్మించారు. నిర్మాణాలు రోడ్డుకి అడ్డంగా గంటల కొద్ది నిర్మిస్తున్న ఇటు పంచాయతీ పాలకవర్గం కానీ, పోలీసులు, రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదు. తెల్లవారేసరికి సుమారు ఐదు దిమ్మలనిర్మాణం పూర్తయింది. ఇప్పుడు ఆ దిమ్మలనుకూలిస్తే గతంలో నిర్మించిన టిఆర్ఎస్, టిడిపి, ఆదివాసి, ఆటో యూనియన్, ఇతర దిమ్మెలను సైతం కూల్చాలని కొత్తగా నిర్మించిన వారు డిమాండ్ తెరపైకి . దీంతో గ్రామస్తులు, యువకులు, ఆదివాసి సంఘాల ఐక్యవేదికలు గురువారం తహసిల్దార్ వర్స రవికుమార్ కు, జిపి సెక్రెటరీ ఉపేంద్రకు నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని  ఫిర్యాదు చేశారు.ఏది ఏమైనా రోడ్డుకు అడ్డంగా దిమ్మెలను నిర్మించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని, వారికి సహకరించిన వారిపై  విచారణ చేపట్టాలని గ్రామస్తులు, యువకులు,డిమాండ్ చేస్తున్నారు.