పత్తి రైతు వ్యవసాయ కూలీ అవగాహన సదస్సు

Submitted by veerareddy on Sat, 01/10/2022 - 11:56
Cotton Farmer Agricultural Labor Awareness Conference

మునుగోడు అక్టోబర్ 01(ప్రజా జ్యోతి):   మునుగోడు మండల కేంద్రం చీకటి మామిడి గ్రామములో ఐ ఎల్ ఓ ఏఐటీయూసీ భాగస్వామ్యంతో గ్రామీణ ప్రాంతాలలో పత్తి కార్మికుల అవగాహనసదస్సు జరిగింది ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా నల్లగొండ జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బోల్గూరి నరసింహ హాజరై వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతంలో పత్తి సాగు ఎక్కువ చేయడం వలన గ్రామీణ ప్రాంతాలలో సన్నకారు చిన్న కారు రైతులు పత్తిలో భాగస్వాములు అవుతున్నారని వారికి ఎలాంటి భద్రత లేదని, అలాంటి కార్మికులను ,రైతులను గుర్తించి ప్రభుత్వాలు వారికి భద్రత కల్పించాలని అన్నారు.ILO మండల కోఆర్డినేటర్ మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న హక్కులను కేంద్ర ప్రభుత్వం హరించడానికి ప్రయత్నం చేస్తుంది 44 చట్టాలను నాలుగు కూడళ్ళుగా విభజించి చట్టం తేవడానికి ప్రయత్నం చేస్తుంది అట్టి చట్టాన్ని కార్మికులు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారని అదేవిధంగా పత్తి కార్మిక అవగాహన సదస్సు తెలంగాణ ప్రాంతంలో నల్లగొండ, గద్వాల అదిలాబాదు, జిల్లాలలో సదస్సులు జరుగుతున్నాయి అందుకని పత్తి ఉత్పత్తిలో భాగస్వాములయ్యే పత్తి కార్మికులకు సన్నకారు చిన్న కారు రైతులకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ మండల అధ్యక్షులు దుబ్బ వెంకన్న, ఐ ఎల్ ఓ మండల కోఆర్డినేటర్ చాపల శ్రీను, ఐ ఎల్ ఓ గ్రామ కో ఆర్డినేటర్ పులకరం ఆంజనేయులు, చీకటి మామిడి మాజీ సర్పంచ్ యశోద భిక్షం, వెంకన్న సంతోష సౌందర్య లింగస్వామి దశరథ ధనమ్మ సైదమ్మ లింగమ్మ కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు