వెల్మకన్న లో పత్తి కార్మికులకుఅవగాహన సదస్సు

Submitted by veerareddy on Fri, 30/09/2022 - 13:31
 Awareness conference for cotton workers in Velmakanna

కార్మికులకు సామాజిక భద్రత ఇన్సూరెన్స్ కల్పించాలిAITUC ILO

మునుగోడు సెప్టెంబరు 30(ప్రజా జ్యోతి): మునుగోడు మండల పరిధిలో గల వెల్మకన్నే గ్రామంలో పత్తి కార్మికులకు సామాజిక భద్రత గౌరవప్రదమైన వృత్తి కల్పించాలని బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన ,వెట్టిచాకిరి నిర్మూలన తదితర అంశాలపై ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఈరోజు ఎల్మకన్నె గ్రామంలో ILO ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ మరియు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మండల కోఆర్డినేటర్ చాపల శ్రీను అధ్యక్షతన జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా నల్లగొండ జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బోలుగురు నరసింహ హాజరై వారు మాట్లాడుతూ పత్తి కార్మికులకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని భవన నిర్మాణ కార్మికులకు ఎలాగైతే లేబర్ బోర్డు ఏర్పాటు చేసిన విధంగా పత్తి ఉత్పత్తిలో భాగస్వాములయ్యే పత్తి కార్మికులు గాని సన్న కారు మరియు చిన్న కారు రైతులకు లేబర్ బోర్డు ఏర్పాటు చేసి వారిని ఆదుకోవాలని వారన్నారు ,ఐ ఎల్ ఓ మండల కోఆర్డినేటర్ చాపల శ్రీను మాట్లాడుతూ గ్రామాలలో పూర్తిగా చట్టాల మీద అవగాహన లేనందున 14 సంవత్సరాల లోపు పిల్లలను తమ తల్లిదండ్రులు పత్తి తీయడం తీసుకువెళ్లడం జరుగుతుంది.

చిన్నపిల్లలతో పని చేయిస్తే చట్టపరంగా కేసులౌతాయీ అందుకని గ్రామీణ రైతులు పత్తికూలీలు ఇది గమనించాలని చిన్నపిల్లలను బడికి పంపించాలని వారికి విద్యాబుద్ధులు చెప్పించి విద్యావంతులను చేయాలని అందరూ విద్యావంతులైతే సమాజంలో గౌరవం లభిస్తుందని అదేవిధంగా ,బాల కార్మికుల నిర్మూలనకై అందరం కృషి చేయాలని వారన్నారు ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ మండల అధ్యక్షులు దుబ్బ వెంకన్న. ILO ఎల్మకన్య గ్రామ కోఆర్డినేటర్ భీమనపల్లి. రమేష్ కార్మికులు ముత్యాలు బషీర్ పెంటయ్య, నరసమ్మ ,యాదమ్మ,లక్ష్మమ్మ అలివేలు, ధనమ్మ ,కమలమ్మ రాజు ,లక్ష్మయ్య, లింగస్వామి శ్రీశైలం ,యాదయ్య తదితరులు పాల్గొన్నారు