డిజిటల్ టీవీలతో విద్యార్థులకు సులభతరం

Submitted by Sukka.ganesh on Sun, 04/09/2022 - 11:16
Easier for students with digital TV

యాదాద్రి(వలిగొండ)సెప్టెంబర్ 03(ప్రజాజ్యోతి న్యూస్):డిజిటల్ టివిలలో పాఠాలు బోధించడం ద్వారా విద్యార్థులకు సులభంగా అర్థం అవుతుందని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు.శనివారం మండల కేంద్రంలోని శ్రీవేంకటేశ్వర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మండలంలోని 28 ప్రభుత్వ పాఠశాలలకు దాత బండారు మయూర్ రెడ్డి సౌజన్యంతో అందజేసిన స్మార్ట్ టివిలను వారు పంపిణీ చేసి మాట్లాడుతూ స్మార్ట్ టీవీలతో పాఠాలు బోధించడం వల్ల విద్యార్థులకు సులభంగా అర్థం అవుతుందని విద్యార్థులు వాటిని సద్వినియోగం చేసుకోవాలని వారు అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి,జిల్లా విద్యా శాఖ అధికారి నారాయణ రెడ్డి,ఎంపిపి నూతి రమేష్ రాజ్,జెడ్పిటిసీ వాకిటి పద్మా అనంతరెడ్డి,సర్పంచ్ బొల్ల లలిత శ్రీనివాస్,ఎంపిటిసిలు కందారపు యశోద కొమురయ్య,పల్లెర్ల భాగ్యమ్మ రాజు,పసల జ్యోతి విజయానంద్,దాత మయూర్ రెడ్డి,తహశీల్దార్ శ్యామ్ సుందర్ రెడ్డి,ఎంపిడిఓ గీతారెడ్డి,వివిధ గ్రామాల సర్పంచులు,ఎంపిటిసిలు,ఎంఈఓ శ్రీధర్,పిఆర్టియు మండల అధ్యక్షుడు పసల విజయానంద్,పాఠశాల ప్రధానోపాధ్యాయులు మహమ్మద్ అలీ,ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.