తిరుమల కొండపై కూల్చేసిన అన్నమయ్య గృహాన్ని వెంటనే నిర్మించాలి

Submitted by narmeta srinivas on Tue, 08/11/2022 - 13:14
తిరుమల కొండపై కూల్చేసిన అన్నమయ్య గృహాన్ని వెంటనే నిర్మించాలి

అన్నమయ్య కళాక్షేత్రం పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ విజయ శంకర  స్వామి

 

జనగామ / పాలకుర్తి (ప్రజాజ్యోతి) నవంబర్ 08 : తిరుమల కొండపై సమతా ఆధ్యాత్మిక మూర్తి అన్నమయ్య గృహాన్ని, అన్నమయ్య విగ్రహ ప్రాంగణాన్నీ, ఆంజనేయస్వామి విగ్రహాన్ని, పున:ప్రతిష్ఠ చేయాలని అన్నమయ్య కళాక్షేత్రం పీఠాధిపతులు.,అన్నమయ్య గృహ సాధన సమితి జాతీయ అధ్యక్షులు శ్రీ విజయ శంకర స్వామి అన్నారు.అన్నమయ్య విగ్రహ ప్రాంగణాన్నీ పున:ప్రతిష్ఠ చేయాలని కోరుతూ జైభారత్, అన్నమయ్య గృహ సాధన సమితి సంయుక్త అధ్వర్యంలో గత నెల రోజుల నుండి రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న అన్నమయ్య గృహ సాధన చైతన్య రథయాత్ర సోమవారం రాత్రి పాలకుర్తి స్వయంభు శ్రీ  సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి దేవాలయాన్ని చేరుకుంది.ఈ సందర్బంగా ఆలయ ఈవో రజనీ కుమారి శ్రీ విజయ శంకర స్వామికి మేళతాళాలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. అన్నమయ్య గృహ సాధన సమితి, జై భారత్ సేకరించిన 11 లక్షల యాబై వేల సంతకాలకు శ్రీ సోమేశ్వర ఆలయంలో  ఆలయ పూజారులు పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు శ్రీ విజయ శంకర స్వామిని శాలువాతో సన్మానించారు.ఈ సందర్బంగా అన్నమయ్య గృహ సాధన సమితి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీను నాయక్, జైభారత్ రాష్ట్ర నాయకులు వల్లూరి మధు మాదిగల అధ్వర్యంలో దళిత రత్న, టిఎస్ఈజిసి డైరెక్టర్ అందే యాకయ్య, స్థానిక దళిత నాయకులు వల్లూరి రామస్వామి, యాకూబ్ నాయక్, భాహుజన న్యూస్ జిలకర కృష్ణాకర్, గంగాధరి సత్యం, బానోతు సోమన్న నాయక్, వల్లూరి కుమార స్వామి, తదితరులు శ్రీ విజయ శంకర స్వామికి పుష్పాంజలితో స్వాగతం పలికి, శాలువాతో సన్మానించారు..ఈ కార్యక్రమంలో అన్నమయ్య గృహ సాధన సమితి జాతీయ ప్రధాన కార్యదర్శి దున్న లక్ష్మేశ్వర్.  జైభారత్ జాతీయ కార్యదర్శి సత్యనారాయణ గోల, జైభారత్ బిసి పోరాట వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుండు వెంకన్న,  జైభారత్ ఎస్సీ పోరాట వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోయ సుధాకర్, రాష్ట్ర కార్యదర్శి ఇమ్మయ్య, జైభారత్ రాష్ట్ర నాయకులు రాఘవదాస్, తదితరులు పాల్గొన్నారు.