పాలకుర్తి

టీఆర్ఎస్ గ్రామ పార్టీ ఇంఛార్జి ల నియామకం

Submitted by narmeta srinivas on Sun, 27/11/2022 - 18:39

పార్టీని మరింత బలోపేతం చేయాలి

సంక్షేమ పథకాలు, అభివృద్ధి ని గడప గడపకు వివరించాలి

మండల పార్టీ అధ్యక్షుడు : సిందె రామోజి 

పాలకుర్తి / కొడకండ్ల  ( ప్రజా జ్యోతి)  నవంబర్ 27 :  మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశాలతో మండలంలోని అన్ని గ్రామాలకు బిఆర్ఎస్ (టీఆర్ఎస్) గ్రామపార్టీ  ఇంఛార్జిలను మండల పార్టీ అధ్యక్షుడు సిందె రామోజీ ఆదివారం నియమించారు. గ్రామాల వారిగా, లక్ష్మక్క పల్లి గ్రామానికి దీకొండ రమేష్, రామన్నగూడెం కే.

రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన ఉన్నత పాఠశాల విద్యార్థులు

Submitted by narmeta srinivas on Fri, 25/11/2022 - 18:29

అభినందించిన గ్రామ సర్పంచ్, ఉపాధ్యాయులు

పాలకుర్తి / కొడకండ్ల (ప్రజా జ్యోతి) నవంబర్ 25 : రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు కొడకండ్ల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు మద్దెబోయిన అభిలాష్ అండర్ 16, గజ్జి మనస్విని అండర్ 12, లాంగ్ జంప్ ఈవెంట్లో ఎంపికయ్యారు. ఈనెల 22న జనగామ జిల్లా కేంద్రంలోని ధర్మకంచ మినీ స్టేడియంలో జిల్లా స్థాయిలో నిర్వహించిన పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి ఎంపికయ్యారు. డిసెంబర్ 5, 6 తేదీలలో హైదరాబాదులోని గచ్చిబౌలి లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో వీరు పాల్గొంటారు.

కార్పొరేట్ పాఠశాలకు దీటుగా పాఠశాలను తీర్చిదిద్దుతాం : సర్పంచ్ శ్రీలత సోమన్న

Submitted by narmeta srinivas on Mon, 21/11/2022 - 19:38

విధ్యార్థులకు షూ, టై, బెల్టులు పంపిణీ చేసిన సర్పంచ్

పాలకుర్తి /  కొడకండ్ల (ప్రజా జ్యోతి)  నవంబర్ 21 :  కార్పొరేట్ పాఠశాలకు దీటుగా నర్సింగాపురం పాఠశాలను తీర్చిదిద్దుతామని నర్సింగాపురం గ్రామ సర్పంచ్ దండెంపల్లి శ్రీలత సోమన్న అన్నారు. సోమవారం గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులకు సర్పంచ్ దండంపల్లి శ్రీలత సోమన్న తమ సొంత ఖర్చులతో 12,500 రూపాయల విలువగల షూ, బెల్ట్, టై లను ఉచితంగా పంపిణీ చేశారు.

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును కలిసిన జిబి తండ గ్రామస్థులు

Submitted by narmeta srinivas on Mon, 21/11/2022 - 18:31

పాలకుర్తి / కొడకండ్ల ( ప్రజాజ్యోతి) నవంబర్ 21 : రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరాల శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును కొడకండ్ల మండల జిబి తండ గ్రామస్తులు హనుమకొండ లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో సోమవారం గ్రామ అభివృద్ధి కార్యాచరన విషయం లో మర్యాద పూర్వకంగా కలిశారు.ఈ కార్యక్రమంలో జిబి తండా గ్రామ సర్పంచ్ కుమారి గుగులోతు మంజుల, టిఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు గుగులోతు బాషా నాయక్ ,గ్రామ నాయకులు వస్రం నాయక్ ,మాజీ ఎంపీటీసీ రామ్ మూర్తి నాయక్ , వీరేష్, మహేష్, వెంకన్న, మహేందర్,  సురేష్ , వీరేష్, నరేష్ ,రమేష్  తదితరులు పాల్గొన్నారు.

2016కు ముందు ఆధార్ కార్డు దిగిన ప్రతి ఒక్కరు కార్డును అప్డేట్ చేసుకోవాలి

Submitted by narmeta srinivas on Mon, 21/11/2022 - 17:59

తహసీల్ధార్ : కోలా చంద్రమోహన్

పాలకుర్తి / కొడకండ్ల ( ప్రజాజ్యోతి) నవంబర్ 21 : 2016 వ సంవత్సరానికి ముందు ఆధార్ కార్డు దిగిన ప్రతి ఒక్కరు తమ ఆధార్ కార్డును అప్డేట్ చేసుకోవాలని కొడకండ్ల మండల తహసిల్దార్ కోల చంద్రమోహన్ సూచించారు. సోమవారం మండల తహసిల్దార్ కార్యాలయంలో ఆధార్ జీవితాన్ని సులభరతరం చేస్తుంది అనే పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో ఆధార్ కార్డు అన్ని అవసరాలకు చాలా శక్తివంతమైనదని అన్నారు. జీవన సౌలభ్యాన్ని సులభతరం చేస్తుందని ఆయన అన్నారు.

వరల్డ్ టాయిలెట్ డే సందర్భంగా స్వచ్ఛతా రన్

Submitted by narmeta srinivas on Sat, 19/11/2022 - 19:57

పాలకుర్తి / కొడకండ్ల (ప్రజాజ్యోతి) నవంబర్ 19  : శనివారం వరల్డ్ టాయిలెట్ డే సందర్భంగా కొడకండ్ల గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో సర్పంచ్ పసునూరి మధుసూదన్ సమక్షంలో మండల కేంద్రం లో స్వచ్చతా రన్ నిర్వహించి గ్రామ ప్రజలకు టాయిలెట్ల పట్ల అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ కుందూరు విజయలక్ష్మి అమరేందర్ రెడ్డి, ఉప సర్పంచ్ రమేష్ ,కార్యదర్శి ఘంటా శ్రీనివాస్, అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, వివోఏలు, వార్డు మెంబర్లు, గ్రామ ప్రజలు, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోఘనంగా ఇందిరాగాంధీ జయంతి వేడుకలు

Submitted by narmeta srinivas on Sat, 19/11/2022 - 19:06

ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న మహా నేత ఇందిరమ్మ : ధరావత్ సురేష్ నాయక్

పాలకుర్తి / కొడకండ్ల (ప్రజాజ్యోతి) నవంబర్ 19 :  భారత మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా శనివారం కొడకండ్ల మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షుడు ధరావత్ సురేష్ నాయక్ అధ్వర్యంలోఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా సురేష్ నాయక్ మాట్లాడుతూ మొట్టమొదటి ఏకైక మహిళా ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరా గాంధీ స్త్రీలకు గౌరవం తెచ్చే విధంగా ప్రపంచ సమాజంలో,ముఖ్యంగా మహిళా సాధికారత సంస్థ నుండి అపారమైన గౌరవాన్ని పొందారని, భూ సంస్కరణ చట్టం తీసుకోచ్చి,పెద ప్రజలకు ఇం

సీనియర్ జర్నలిస్టు వెంకటేశ్వర్లు పై దాడి హేయమైన చర్య

Submitted by narmeta srinivas on Fri, 18/11/2022 - 20:12

పాలకుర్తి / కొడకండ్ల (ప్రజాజ్యోతి) నవంబర్ 18 : సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రానికి చెందిన సీనియర్ పాత్రికేయుడు బైరబోయిన వెంకటేశ్వర్లు పై దాడి చేయడం ఏమైనా చర్య అని, దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని జై భారత్ ఎస్టీ పోరాట వేదిక రాష్ట్ర కన్వీనర్ భూక్య శ్రీను నాయక్, ఎస్సీ పోరాట వేదిక రాష్ట్ర నాయకుడు వల్లూరి మధు మాదిగ అన్నారు.

గ్రామీణ క్రీడా ప్రాంగణాలు వారం రోజుల్లో పూర్తి చేయాలి

Submitted by narmeta srinivas on Fri, 18/11/2022 - 20:05

ఎంపీడీవో : సురేంద్ర నాయక్

పాలకుర్తి / కొడకండ్ల (ప్రజాజ్యోతి) నవంబర్ 18 : గ్రామీణ క్రీడా ప్రాంగణాల నిర్మాణాలలో భాగంగా నిర్మిస్తున్న క్రీడా ప్రాంగణాలు, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వారం రోజుల్లోగా పూర్తి చేయాలని గ్రామ కార్యదర్శులను ,సర్పంచ్ లను ఎంపీడీవో సురేంద్రనాయక్ ఆదేశించారు. శుక్రవారం మండలంలోని పెద్దబాయి తండా, లక్ష్మక్క పల్లి, రామేశ్వరం క్రీడా ప్రాంగణాల సైట్, నర్సరీ లను ఎంపీడీవో సురేంద్రనాయక్ సందర్శించారు.

బదిలీపై వెళ్లిన ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ధర్మేంద్ర

Submitted by narmeta srinivas on Fri, 18/11/2022 - 19:55

సమర్థవంతంగా పనిచేసిన ధర్మేంద్ర : జనగామ డిఐఈఓ బైరి శ్రీనివాస్

పాలకుర్తి / కొడకండ్ల (ప్రజా జ్యోతి) నవంబర్ 18 : కొడకండ్ల మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గత ఐదున్నర సంవత్సరాల కాలం పాటు ప్రిన్సిపాల్ గా విధులు నిర్వహించిన శ్రీధర్ల ధర్మేంద్ర బదిలీపై హన్మకొండ జూనియర్ కళాశాలకు వెళ్లిపోయారు. ఈ సందర్భంగా కళాశాలలో ప్రిన్సిపాల్ ధర్మేంద్రకు శుక్రవారం వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా డిఐఇఓ బైరి శ్రీనివాస్ మాట్లాడుతూ ధర్మేంద్ర కొడకండ్ల లోనే కాకుండా జనగామ జిల్లా ఇంటర్ విద్యలో కీలక పాత్ర పోషించారని అన్నారు.